యంగ్ హీరో నితిన్ (Nitin) గతేడాది మూడు సినిమాలతో పలకరించారు. రంగ్ దే, చెక్ సినిమాను థియేట్రికల్(Theatrical) రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ చూడలేదు.

ఇక ఆ తరువాత విడుదలైన ‘మాస్ట్రో’ (Maestro)మూవీని థియేటర్స్‌ లో కాకుండా  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌(Disney Hot star)లో డైరెక్ట్ గా రిలీజ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్(Good Response) వచ్చింది. ఇక  నితిన్‌ వరుసగా సినిమాలను చేస్తున్నారు.

అందులో భాగంగా ఆయన హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి(M.S.RajaSekhar Reddy) డైరెక్షన్ లో  ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam movie) అనే మూవీని తెరక్కేక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్(Shooting) జరుగుతోంది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్ డేట్(Update) వచ్చింది.

ఈ చిత్రం విడుదల ఎప్పుడు కానుందో మూవీ టీమ్(Movie team) తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం ఆగష్టు 12,(August 12th) 2022 న విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. అయితే అదే రోజున సమంత నటిస్తున్న యశోద, అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్‌(Agent)‌ కూడా రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మూవీని మొదట జూలై 8(July 8th)న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సినిమాలో కేథరిన్ ట్రెస్సా(Catherine Tressa), కృతిశెట్టి (Krithi Shetty)  హీరోయిన్‌లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్(Mahathi Swara Sagar) మ్యూజిక్(Music) అందిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్ర(IAS Officer Role)లో నటిస్తున్నారు.

ఈ సినిమాని నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌(Sreshta Movies Banner)లో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే సారాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ మూవీతో పాటు నితిన్, వక్కంతం వంశీ (Vakkantham vamsi) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెలిసిందే.

ఆదిత్య మూవీస్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. నితిన్‌కు 32 వ చిత్రంగా వస్తోంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటించనున్నారు.

ఇక ఈ సినిమాకు హారిస్ జయరాజ్(Harris Jayaraj) సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ(Cinematography)ని అందిస్తున్నారు.