బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) ఆరో వారం నామినేషన్స్(Nominations) ప్రక్రియ లో పది మంది కంటెస్టెంట్స్ నామినెట్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లో 19 మంది కంటెస్టెంట్స్ లో ఐదుగురు ఎలిమినేట్(Eliminate) అవ్వగా, ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్స్ వున్నారు .

ఇక ఈ వారం కెప్టెన్ ఎంపిక కోసం కెప్టెన్సీ కంటెండర్ పోటీ కోసం టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్. నాలుగు టీంలుగా విడిపోయాయి ఆడుతున్న టాస్క్ లో ఎలాంటి రచ్చలు మొదలైందో నిన్నటి 38వ ఎపిసోడ్ చూద్దాం.

నామినేషన్స్‌ ప్రక్రియలో జరిగిన గొడవ గురించి  జెస్సీ, సిరి, షణ్ముఖ్‌లు డిస్కషన్ పెట్టారు. శ్రీరామ్ యాక్టర్స్ అనడం పై ముగ్గురు చర్చించుకున్నారు.

సీక్రెట్ నామినేషన్స్ (Secret nominations) అనగానే  8 మంది నామినేట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్స్(Nominations) అంటే ఇద్దరే నామినేట్ చేశారు అని అన్నాడు షన్ను. ఆ తరువాత ప్రియ, ప్రియాంక దగ్గర సన్నీ  నామినేట్ చేస్తాన్నని బెదిరిస్తున్నాడు చెప్పుకొచ్చింది.

ఇక శ్రీరామ్, యాని మాస్టర్‌ని ఎందుకు నామినేట్ చేశావ్ అని విశ్వని అడిగాడు. ఇక శ్వేతా తన మనసులోని మాటలను శ్రీరామ్‌తో బ్రదర్ – సిస్టర్  రిలేషన్‌ని బ్రేక్ చేస్తున్నట్టు చెప్పింది.

‘బ్రేకప్‌ బ్రో, చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బ్రేకప్‌ మొదటి సారి కదా’అంటూ నవ్వుతూ చెప్పింది. దాన్ని సరదాగానే అంగీకరించిన  శ్రీరామ్‌ అవునవును అంటూ వెళ్ళిపోయాడు.

కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల టాస్క్ గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ ఈ టాస్క్‌ లో భాగంగా ఇంటి హౌస్ మేట్స్(House mates) నాలుగు గ్రూప్‌లుగా విడిపోవాల్సివుంటుంది.

ఈ టాస్క్ కి సంచాలకులుగా కాజల్, సిరి వ్యవహరించారు.

  1. బ్లూ టీంలో మానస్, సన్నీ, ఆనీ, టీం
  2. ఎల్లో టీంలో షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ
  3. రెడ్ టీంలో విశ్వ, శ్రీరామ్, ప్రియ
  4. గ్రీన్ టీంలో రవి, లోబో, శ్వేతా

బ్లూ, ఎల్లో టీంకి కాజల్‌కి మేనేజర్ గా, అలాగే రెడ్ అండ్ గ్రీన్ టీంకి మేనేజర్ గా సిరిని నియమించారు. వీళ్లే బొమ్మల క్వాలిటీ చూస్తారు. కెప్టెన్సీ(Captaincy)  పోటీదారులు అవ్వాలంటే బొమ్మలు తయారు చేయాలని, సమయానుకూలంగా బెల్ట్ పై నుంచి వచ్చిన మెటీరియల్స్‌తో బొమ్మలు తయారుచేయాల్సి ఉంటుందని చెప్పారు.

గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలిపిన బిగ్ బాస్(Big boss) .

ఇక ప్రియాంక వాష్ రూంలోకి లో  బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టగా బిగ్ బాస్(Big boss). బొమ్మలను బయటే చేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

అయితే రవి ఎప్పటిలాగే గేమ్ ఎలా ఆడాలో మిగిలిన టీం మేట్స్ కి  సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే బొమ్మల్లో కాటన్ సరిగా పెట్టకపోవడంతో,  బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ ఇది పత్తి యాపారం అంటూ మానస్ కౌంటర్ వేశాడు.

ఆ తరువాత నుంచి ఆట ఆడే విధానం మారిపోయింది. ఒకరి బొమ్మల్ని ఒకరు లాక్కుంటూ కనిపించారు. అయితే సంచాలకులుగా ఉన్న కాజల్ తన పని తాను చేయడం మానేసి బొమ్మల్ని లాక్కొండి అంటూ సలహా ఇచ్చింది. ఫిజికల్‌గా ఆడితే నేను ఎక్స్ ట్రీంకి వెళ్లిపోతా అని రవిని హెచ్చరించాడు ఇచ్చాడు షణ్ముఖ్.

సంచాలకులుగా ఉన్న సిరి ఒక టీంకే సప్పోర్ట్ చేస్తుంది యాని మాస్టర్ ఫైర్ అయింది. సిరి డ్రామా క్వీన్(Drama Queen)అని తన లాగా డ్రామాలు ఆడడం నాకు రాదనీ నోరు పారేసుకుంది యాని మాస్టర్.

అయితే మాటలు జారొద్దు  అని కాజల్ అనడంతో  కాజల్‌ని కూడా  ఆనీ మాస్టర్. నువ్వు  కూడా ఏం తక్కువ కాదు.. ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడొద్దు.. ముక్కుసూటిగా మాట్లాడాలి, నీ కూతురు చూస్తుందని నువ్వు  ఎంత ఫీల్ అవుతావో, నా పిల్లలు కూడా షో చూస్తుంటారని గుర్తుపెట్టుకో అని కోపంతో ఉగ్రరూపం చూపించిన యాని మాస్టర్.

దీంతో బాగా హర్ట్‌ అయిన సిరి ఆట కరెక్ట్ గా  అడినప్పటికీ నేను ఒక టీమ్‌ సపోర్ట్‌ చేస్తున్నానని అంటున్నారు. ఇకపై అలానే ఆడుతాను.’ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది. నేను ఆడతాను’అని సిరి అనగానే ఆలా చెయ్యదు జన్యూన్‌గా ఆడాలని షణ్ముఖ్‌ నచ్చచెప్పాడు.

ఇక ఈ టాస్క్‌(Task) లో రవి, లోబో, శ్వేతాలకు పవర్ పొందారు. స్పెషల్ బొమ్మ రావడంతో దాని ద్వారా అన్ని టీంలు దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్(Big boss).

ఇక బుధవారం ఎపిసోడ్‌లో యాని మాస్టర్ శ్వేతా ల మధ్య జరిగే ఫైట్ ని ప్రోమో(Promo) ద్వారా చూపించారు. నిన్నటి వరకూ శ్వేతని కూతురిలా చూసుకున్న యాని మాస్టర్ డాటర్ లేదు తొక్క లేదు అంటూ ఓపెన్ అయిపోయింది.