బిగ్ బాస్ సీజన్ 5(Big boss season5) ఆరో వారం కంటెస్టెంట్స్(Contestants) మధ్య రచ్చలు తారాస్థాయి లో రక్తికటిస్తున్నారు. ఎవరికీ వారు వారికి తగ్గట్టు నోర్లు పారేసుకుంటున్నారు.

ఈ హౌస్ లో అందరికి యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ వుంది. సిరి, సన్నీ లు ఎవరికీ వారు ఆటిట్యూడ్ చూపించుకుని గొడవకు దిగారు. మరో పక్క రోజుకో రూల్ పెట్టుడుతున్నారు, అంత మీ ఇష్టమా అంటూ సిరి పై అంత యెత్తున అరిచిన ప్రియా.

మానస్ దగ్గర ఎమోషనల్(Emotional) అయినా ప్రియాంక, తరువాత ఓదార్చిన మానస్. ఇలా ఇంట్లో కంటెస్టెంట్స్ మధ్య ఏర్పడిన పరిణామాలను తెలుసుకోవాలంటే పూర్తి గా నిన్నటి ౩9వ ఎపిసోడ్ లో చూసేద్దాం..

కెప్టెన్సీ(Captaincy) పోటీదారుల కోసం బిబి  బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్(Task) లో గ్రీన్ టీం సభ్యులైన రవి, శ్వేతాలకు, లోబో, బొమ్మ రూపంలోస్పెషల్ పవర్ పొందిన సంగతి తెలిసిందే. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్‌ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు.

యాంకర్ రవి స్పెషల్ పవర్(Special power) ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్‌ టీమ్‌ దగ్గర ఉన్న బొమ్మల్ని తీసేసుకున్నారు. దీంతో జీర్ణించుకోలేని యానీ మాస్టర్‌ శ్వేతా దగ్గర వున్న బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాని  మధ్య పెద్ద రచ్చ జరిగింది.

దీంతో బాగా హర్ట్‌ అయిన యానీ లాస్ట్‌ టాస్క్‌ లో ఫ్రెండ్‌ని కోల్పోయా, ఈ టాస్క్‌ లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కలో రిలేషన్‌షిప్‌ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వేత వెక్కి వెక్కి ఏడిచింది. ఇ

క శ్వేతపై అరిచిన యానీ మాస్టర్ తినడం మానేసింది. శ్వేత కూడా తినకుండా ఆగిపోయింది. దీంతో యానీ మాస్టర్, రా తిందాం అని అడిగింది.

రవి టీమ్‌కి వచ్చిన స్పెషల్‌ పవర్‌ వల్ల అన్ని బొమ్మలను కోల్పోయిన బ్లూ కలర్‌ టీమ్‌ అయినా మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌ ఏమి చేయలేకపోయారు.

సన్నీ, మానస్‌ అయితే రవి గేమ్‌ పై చాలా డౌట్స్ వస్తున్నాయని డిస్కస్ చేసారు. అందరూ బొమ్మల్ని కష్టపడి కుడుతుంటే వాళ్లు మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. ఇలాంటి క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని సన్నీ అన్నాడు.

ఇక మానస్‌ మాట్లాడుతూ యాంకర్ రవి ఆన్సర్ షీట్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. రవికి ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు? అందుకే వాళ్లు మొదటి నుంచి చాలా కూల్‌గా ఉన్నారు.

వాళ్లు పత్తి తీసుకుందాం బొమ్మలు కుట్టి గెలుద్దాం అని ఆడలేదు. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది, దాన్ని తీసుకుని  ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్ల దగ్గర నుంచి తీసుకుందాం అనే గేమ్ ఆడాడు అని అన్నాడు.

ఇక సంచాలకులుగా కాజల్, సిరిలు సరిగా చేయడం లేదంటూ ఓ రేంజ్‌లో నిప్పులు చెలరేగిన హౌస్ మేట్స్(House mates) ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట వాళ్లు చేయిపెడితే ఒకటి నేను, పెడితే ఒకటా ఇదెక్కడి రూల్స్ అని సన్నీ అరవడంతో, ‘సంచాలకులపై ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు అందరి ముందు సారీ చెప్పాలి అంటూ సిరి తన యాటిట్యూడ్ చూపించింది.

ఆమె యాక్షన్‌‌కి తగ్గట్టుగానే సన్నీ కౌంటర్  ఇచ్చాడు. ‘నేను సారీ చెప్పా ఏం చేసుకుంటావో చేస్కో పో’అంటూ యాటిట్యూడ్ చూపించాడు.

ఇక కాజల్  మాట్లాడుతూ మేం పెట్టిన రూల్‌ని క్రాస్ చేసినందుకు గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలి అంటూ చెప్పింది. దీనికి మేం ఒప్పుకోం అని ప్రియ వాదనకు దిగింది.

‘సంచాలకులుగా ఇది మా రూల్ పాటించాల్సిందే’ అని సిరి ఆదేశించడంతో వేయడంతో హౌస్ మేట్స్ (House mates) అందరికి చిర్రెత్తుకొచ్చింది.ఇవ్వాళ ఒక రూల్, నిన్న ఒక రూల్. మొన్న ఒక రూల్ రోజుకొక్క రూల్స్ మారిపోతుంటాయా? అని సన్నీ ఫైర్ కాగా.. నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి సంచాలకులు ఏం పీకుతున్నారు అంటూ ప్రియ ఫైర్ అయ్యింది.

ఆమె ఆ మాట అనగానే సన్నీ విజిల్స్ వేస్తూ ప్రియని సప్పోర్ట్ చేసాడు. ప్రియ అలా అనేసరికి ‘మా ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాం’ అని కాజల్ చెప్పడంతో సరే ఇదే మాట మీద ఉండు.. స్పెషల్ పవర్ ఇవ్వాలి నాకూ అప్పుడు నేను గేమ్ ఆడుతా అని ప్రియ కౌంటర్ వేసింది.

ఆ టైంలో సన్నీ మానస్ తో కలసి  ‘అటు బస్సూ ఇటు బస్సూ అని సాంగ్  అందుకుని సిరి, కాజల్‌లను హేళన చేసాడు దాంతో హర్ట్ అయ్యిన సిరి ని షన్ను ఓదారుస్తాడు.

ఇక మరో పక్క ప్రియాంక, మానస్ తో  కోపంగా ఉన్నావా? నీతో మాట్లాడొచ్చా అని అడుగుతుంది. ఏం లేదు చెప్పు అంటాడు  మానస్‌. చెప్పాక తిట్టవు కదా అంది ప్రియాంక. తిట్టనులే చెప్పు అని మానస్‌ అన్నడంతో  టాస్క్‌(Task) ల్లో నేను వందశాతం ఎఫర్ట్ ఇస్తున్నానా? అని అడిగింది. హా ఇస్తున్నావ్ గా అని చెప్పాడు మానస్.

దీంతో ప్రియ ‘నువ్వు అంటుంటావు కదా నేనొక బార్డర్ పెడతా దాన్ని ఎవరూ క్రాస్ చేయలేరు అని నేనెప్పుడైనా అది క్రాస్ చేసినట్టు నీకు అనిపించిందా? అని అడిగింది. అదేం లేదు.. ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతున్నావు ఎందుకు? నేను బార్డర్ ఎందుకు పెట్టాను అంటే ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారని, ప్రతి ఒక్క రిలేషన్‌లోనూ ఎక్స్ పర్టేషన్స్ ఉంటాయి.

అది వాళ్లు రీచ్ కాలేకపోతే ఫీల్ అయిపోయినట్టు కాకుండా మంచి ఒపీనియన్ ఉండాలనే బార్డర్ పెడతా ఈ విషయం గురించి నన్ను పదే పదే అడిగి నువ్వు  ఇబ్బంది పడకు నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు మానస్. దీంతో ప్రియాంక్‌ ఎమోషనల్‌ అవ్వడంతో  మానస్‌ పింకీ ని ఓదార్చాడు.

మొదటి నుంచి  నుంచి పక్కా ప్లాన్‌తో ఆట ఆడుతున్న కాజల్‌. ఈ వారం ఎలాగైన కెప్టెన్‌(Captain) కావాలని అనుకుంటోంది.  సంచాలకురాలిగా తనకున్న పవర్ ని  ఉపయోగించి రవి కెప్టెన్సీ పోటీ లో లేకుండా ఉండడానికి ప్లాన్‌ వేసింది.

గతంలో చెక్‌ చేసి ఓకే చెప్పిన బొమ్మలను కూడా మళ్లీ పరిశీలించాలని పట్టుపట్టింది.

ఇక వచ్చే ఎపిసోడ్ ప్రోమోలో సంచలకులదే చివరి నిర్ణయం కావడంతో కాజల్‌ చెప్పినట్టుగానే అన్ని బొమ్మలను మళ్లీ తీసుకొచ్చారు రవీ టీమ్‌. వాటిలో కొన్ని బొమ్మలను రిజెక్ట్‌ చేసినట్లు చూపించారు.

మరి కాజల్‌ కన్నింగ్‌ ప్లాన్‌ను రవి ఎలా డీల్ చేస్తాడో  గురువారం ప్రసారమయే ఎపిసోడ్‌లో చూద్దాం.