టాలీవుడ్(Tolly wood) యంగ్(Young) అండ్ సుప్రీమ్(Supreme) హీరో(Hero) సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) నుంచి రెండేండ్లుగా ఒక్క చిత్రం కూడా రావడం లేదు.

చివరిగా ‘రిపబ్లిక్(Republic)’ సినిమాతో అలరించారు. పొలిటికల్ డ్రామా(Political Drama)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్(Good Response) ను సొంతం చేసుకుంది.

రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటుండటంతో సాయి ధరమ్ తేజ్ పై ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం అదే తరహాలో ‘విరూపాక్ష’ అనే చిత్రంతో రాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ (Shooting)జరుపుకుంటున్న విరూపాక్ష ( Virupaksha ) చిత్రం కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం(Direction)లో తెరకెక్కుతోంది. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర ఎల్ఎల్పీ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమాల(Promotional Works)ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్(Back to Back) అప్డేట్స్(Updates) ను అందిస్తున్నారు.

తాజాగా విరూపాక్ష చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ అందింది. చిత్ర టీజర్(Teaser) ను సిద్ధం చేసినట్టు యూనిట్ తెలిపింది. విరూపాక్ష టీజర్ మార్చి 1న విడుదల చేయనున్నట్టు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర(Sri Venkateswara Cine Chitra) సంస్థ అధికారికం(Official)గా ప్రకటించింది(Announcement).

కారాజ్ ఓవర్ ఫియర్(Courage Over Fear) అనే కాప్షన్ ఇస్తూ టీజర్ పై ఆసక్తిని పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ క్రమంలో టీజర్ అప్డేట్ రావడంతో అభిమానులు ఫాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురైన విషయం తెలిసిందే. దాని తర్వాత సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గానే కోలుకున్న ఆయన వరుస ప్రాజెక్ట్స్ ను మళ్లీ లైన్ లో పెడుతున్నారు.

ఈసందర్భంగా ‘విరూపాక్ష’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. చిత్రం కోసమూ ఆయన బాగానే కష్టపడుతున్నాడు. చిత్రం 2023 సమ్మర్ ఏప్రిల్ 21(April 21st)న ప్రపంచ వ్యాప్తం(World Wide)గా విడుదల(Release) కానుంది. తెలుగు తోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడలోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్డ్‌ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్‌(Thriller) గా తెరకెక్కించిన చిత్రం. అక్కడ జరిగే వింత పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఆసక్తిగా ఉండనుంది. మరోవైపు మామ పవన్ కళ్యాణ్ తోనూ ‘వినోదయ సీతమ్(Vinodaya Sitam)’ సినిమా రీమేక్(Remake) లో నటిస్తున్నారు.

ఈ చిత్రం కూడా ఇదే ఏడాది ఆగస్టు(August)లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.