బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) నాలుగో వారం ఎలిమినేషన్ లో నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ ఇంటిని నుచి బయటకు వెళ్లారు.వెళ్తూ గుంట నక్క ఎవరో చెప్పేసారు.

బిగ్ బాస్ షో ని 19 మంది కంటెస్టెంట్స్ తో ప్రాంభించగా, ప్రస్తుతం  15 మంది కంటెస్టెంట్స్(Contestants) వున్నారు.

ఇక ఐదో  వారం లో కి అడుగుపెట్టిన ఈ షో ఎలాంటి టాస్క్ లతో హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టబోతున్నారో బిగ్ బాస్. అందులోను సోమవారం ఎలిమినేషన్(Elimination) కి జరిగే నామినేషన్(Nomination) ప్రక్రియ అంటేనే హౌస్ మేట్స్(House mates) అందరు గుర్రుగా వుంటారు.

ఇదే సమయం గా భావించి ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తుంటారు. ఈ వారం ఈ నామినేషన్ ప్రక్రియ ఎలాంటి గొడవలకు దారి తీయనుందో. మారి నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఓ లుక్ వేద్దాం రండి ..

ఈవారం నామినేషన్స్(Nomination) కాస్త కొత్తగా ప్లాన్ చేశారు.అయితే ఎప్పటిలాగే ఒక్కొక్కరు ఇద్దరేసి చొప్పున నామినేట్ చేయడం మాములే..

అయితే నామినేషన్ పేస్ టూ పేస్ కాకుండా కన్ఫెషన్ రూం(Confession room) నుంచి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్.

మొదటి జెస్సీతో ఈ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..

  1. జస్వంత్ – లోబోలను,యాంకర్ రవి, నామినేట్ చేశాడు.
  2. సన్నీ- ప్రియ, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
  3. విశ్వ – షణ్ముఖ్, జెస్సీ లను నామినేట్ చేశాడు.
  4. కాజల్ – రవి, సన్నీలను నామినేట్ చేశాడు.
  5. లోబో – మానస్, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
  6. ప్రియాంక – లోబో, హమీదా లను నామినేట్ చేశాడు.
  7. సిరి – రవి, హమీదాలను నామినేట్ చేశాడు.
  8. యాంకర్ రవి – షణ్ముఖ్, జస్వంత్లను నామినేట్ చేశాడు.
  9. యాని మాస్టర్ – రవి, విశ్వలను నామినేట్ చేశాడు.
  10. షణ్ముఖ్ – మానస్‌, విశ్వ లను నామినేట్ చేశాడు.
  11. హమీదా – ప్రియ, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
  12. శ్వేతా – మానస్, కాజల్ లను నామినేట్ చేశాడు.
  13. ప్రియ – సన్నీ, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
  14. మానస్ – జెస్సీ, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
  15. శ్రీరామ్ – జెస్సీ, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.

చాలా ఆసక్తికరంగా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో  షణ్ముఖ్ కు మొదటి సరే  భారీగా నామినేషన్ ఓట్లు  దక్కించుకున్నాడు . అందరికి రెండు మూడు ఓట్లతో నామినేట్ అవ్వగా, షణ్ముఖ్‌కి ఏకంగా 8 ఓట్లు వచ్చాయి.

సన్నీ, లోబో,మానస్, రవి, విశ్వ, హమీదా, ప్రియ, శ్రీరామ్ ఈ ఎనిమిది మంది షణ్ముఖ్‌ని నామినేట్ చేయడం విశేషం.

ఒకే వారంలో  9 మంది నామినేట్ కావడం, అలాగే ఒక కంటెస్టెంట్‌(Contestants)ని ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ చేయడం బిగ్ బాస్ చరిత్ర లో ఇదే మొదటి సారి.

ఇక కిచెన్‌ వర్క్ లో జెస్సీ ని చేయమనగా అతను నాకు నేను చేయను అనడం తో శ్రీరామ్, జెస్సీ ల మధ్య రచ్చ మొదలవుతుంది.

దాంతో శ్రీరామ్ ఎవరి వంట వాళ్లు వండుకుని తినాలని జెస్సీ తో అంటాడు.  జెస్సీనే వండుకుని తినాలని ఆదేశించాడు. దీంతో హర్ట్‌ అయిన జెస్సీ నాకు ఫుడ్‌ పెట్టరంట, నా ఫుడ్‌ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను  ‘ఇదేమీ నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్‌ హౌస్‌’ అని కెప్టెన్‌ మీద వాగ్వాదనకు దిగుతారు.

ఏం జరిగిందో తెలుసుకోకుండా మధ్యలోకి రాకంటూ హెచ్చరించాడు శ్రీరామ్‌. ఎవరి ఫుడ్‌ వాళ్లు వండుకోవాలని చెప్పడానికి నువ్వెవరివి? జస్ట్‌ కెప్టెన్‌వి అంతే, అని ఫైర్ అయ్యింది సిరి. నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని కౌంటరిచ్చాడు.

ఇక ఈ గొడవతో విసిగిపోయిన యానీ మాస్టర్‌ సిగ్గు, శరం ఉండాలి అలా గ్రూప్‌గా రావడానికి అంటూ జెస్సీ మీద ఫైర్‌ అవ్వుతుంది.

కానీ కొద్ది సేపటికే సిరి, షణ్ను, జెస్సీ తినకుండా కూర్చోవడంతో యానీ వారి దగ్గరకు వెళ్లి తినమని బుజ్జగిస్తుంది.

ఆకలేస్తే తింటారు, లేకపోతే వదిలేయండి అంటూ కెప్టెన్‌ శ్రీరామ్‌ (Captain Sriram) ఓపక్క చిరాకు పడుతూనే వాళ్లు తినకపోతే తాను కూడా తిననని అంటాడు. ఆ తరువాత  జెస్సీ, షణ్ముఖ్‌లకు ప్లేటులో భోజనం పట్టుకెళ్లి తినిపిస్తారు శ్రీరామ్.

మరి ఈ గొడవ ఏ స్థాయికి చేరనుందో. …ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ (Entertainment) ఉందో చూడాల్సిందే ..