అందమైన భామలు  రెజీనా క‌సాండ్ర‌ (Regina Cassandra), అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ (Anupama Parameswaran),ప్రధాన పాత్రల్లో న‌టిస్తూ స‌తీష్ కాశెట్టి(Satish Shetty) ద‌ర్శక‌త్వం(Direction)లో రూపొందుతోన్న చిత్రానికి ‘మ‌రీచిక’ (Mareechaka)అనే టైటిల్‌(Tittle)ను ఫిక్స్(Fix) చేశారు.

ప్రస్తుత  ట్రెండ్‌(Trend)కు తగ్గట్టు వైవిధ్యమైన చిత్రాలు(Different Movies) తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోయిన్స్ కలసి ఓ రొమాంటిక్ డ్రామా(Romantic Drama)లో నటిస్తున్నారు. వీరితో పాటు విజ‌య్ అశ్విన్(Vijay Ashwin) మ‌రో ప్రధాన పాత్ర(Main Role)లో నటిస్తున్నారు.

‘మ‌రీచిక’ (Mareechika) అంటే క‌ళ్లను క‌నిక‌ట్టు చేసే భ్రమ (Illusion) అని అర్థం. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌(Concept Poster)ను జులై 14న  గురువారం రోజున రిలీజ చేశారు. ఈ పోస్టర్‌ను గ‌మనిస్తే అందులో కేవ‌లం పాదాలు మాత్రమే క‌నిపిస్తున్నాయి. ఆ పాదాల ప్రతిబింబం నీళ్లలో ఓ అమ్మాయి నీడ‌లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్టర్‌కు ‘ప్రేమ ద్రోహం ప్రతీకారం’ అనే కాప్షన్ ని జోడించారు.

ఇప్పటికే ఈ మూవీ  ఫ‌స్ట్ షెడ్యూల్(First Schedule) షూటింగ్(Shooting) పూర్తయ్యింది.  ఇక రెండో షెడ్యూల్ జూలై 26 నుండి  జ‌ర‌గ‌నుంది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా (Iylayaraja), ఈ రొమాంటిక్ డ్రామాకి మ్యూజిక్(Music) అందిస్తున్నారు. అర‌వింద్ క‌న్నాభిరాన్(Arvind Kannabiran) ఈ మూవీకి సినిమాటోగ్రఫీ(Cinematography) అందిస్తున్నారు.

వ‌న్ మోర్ హీరో బ్యాన‌ర్‌(One More Hero Banner)పై రవి చిక్కాల(Ravi Chikkala) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్ష్మీ భూపాల ఈ చిత్రానికి క‌థ‌(Story), స్క్రీన్ ప్లే(Screen Play), మాట‌లు(Lyrics), పాట‌ల‌(Songs)ను అందించారు. దీంతో పాటు ల‌క్ష్మీ భూపాళ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌(Lakshmi Bhupala Entertainment Banner)పై ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌(Co-Producer)గానూ వ్యవ‌హ‌రించారు.

యానిమేష‌న్ రంగం(Animation Field)లో 20 ఏళ్ల పాటు  త‌న‌దైన స్థానాన్ని దక్కించుకున్న రాజీవ్ చిక్కా, ఛోటా భీమ్‌(Chota Bhim)ను రూపొందించారు(Created).

తాజాగా ఇప్పుడు వ‌న్ మోర్ హీరో అనే బ్యాన‌ర్‌(Banner)ను ప్రారంభించారు(Started).