బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) వీకెండ్ కి ముస్తాబయిపోయింది హౌస్. ప్రతి వారం నాగ్ హౌస్ మేట్స్(House mates)ని  ప్రేక్షకులను అలరించటంతో పాటు, కంటెస్టెంట్స్ బిహేవియర్, ఆటిట్యూడ్ ని సరి చేస్తుంటారు.

ఈ వారం పది మంది కంటెస్టెంట నామినేషన్ లో వున్నారు. అలాగే ఎలిమినేషన్(Elimination) ప్రక్రియ ఉంటుంది.

కానీ ఆదివారం ఎలిమినేషన్ కాస్త శనివారంమే లోబో ని ఎలిమినేట్ చేశారు. అయితే మల్లి ట్విస్ట్ ఇచ్చారు.

మరి వీకెండ్ షో లో ఏం జరిగిందో 42 వ ఎపిసోడ్ లో చూద్దాం….

వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా జైల్లో కి వెళ్లిన శ్వేత బిగ్ బాస్(Big boss) ఆదేశాల మేరకు జైలు నుంచి బయటకు వచ్చింది. ఇంత‌లో ర‌వి ఆమె దగ్గర కు వెళ్లి నా ఐడియా ఫాలో అవ‌మ‌ని నీకు చెప్పలేదని తెలిపాడు .

కానీ శ్వేత మాత్రం నువ్వు  కుష‌న్స్ క‌ట్ చేయ‌మ‌ని నాకు కూడా చెప్పావ‌ని తెలిపింది. త‌ర్వాత హౌస్ మేట్స్(House mates)  వారికి పంపించిన కాస్ట్యూమ్స్ వేసుకుని రెడ్ కార్పెట్‌పై రాంప్ వాక్ తో అలరించారు.

తరువాత  కాజ‌ల్‌, ర‌వి ఫ్రెండ్‌షిప్ హ‌గ్గిచ్చుకుని క‌లిసిపోయారు.

ఇక నాగార్జున కంటెస్టెంట్స్ ని కలవడంతోనే  కెప్టెన్సీ(Captaincy) కంటెండ‌ర్స్ టాస్కు లో కుష‌న్స్ పాడు చేసిన వారి పై గయ్యిమన్నాడు. దీంతో లోబో నీళ్లు న‌ములుతూ మొద‌ట త‌నే దూది తీశాన‌ని తెలిపాడు.

హౌస్ ప్రాప‌ర్టీ ధ్వంసం చేయ‌కూడ‌ద‌ని తెలీదా? అని నాగ్‌ నిల‌దీయ‌గా అమాయ‌కంగా ముఖం పెట్టి తెలీదంటూ అడ్డంగా త‌లూపాడు లోబో.

కుష‌న్స్ క‌ట్ చేయ‌మ‌ని నీకు ర‌వి చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోయావు, ర‌వి గ‌డ్డి తిన‌మంటే తింటావా? అని అరిచాడు నాగ్.

సంచాల‌కులుగా వున్నప్పుడు  కంటెస్టెంట్లు చెప్పేది కూడా వినాల‌ని సిరికి అడ్వైజ్  చేసిన నాగ్. ఇక యానీ అంత గ‌ట్టిగా అర‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని, అంద‌రి మీదా ఒట్టేయాల్సిన ప‌ని లేద‌ని క్లాస్ ఇచ్చాడు. అయితే సిరి యాటిట్యూడ్ నచ్చక  అలా ప్రవర్తించనంటూ ఆమెకు సారీ చెప్పింది యానీ.

ఇక‌ నువ్వు నీలా ఉంటేనే అంద‌రికీ న‌చ్చుతావ‌ని శ్రీరామ్‌కు సూచించాడు నాగ్‌. కానీ నామినేష‌న్స్‌(Nominations) లో ఆలా దురుసుగా మాట్లాడావు, యాక్టర్స్  అంటే అంత చిన్నచూపా? అని నిల‌దీశాడు.

దీంతో త‌ప్పు అంగీక‌రించిన‌ శ్రీరామ్ త‌ల దించుకుని సారీ చెప్పాడు. స‌న్నీకి ఎక్కడ లేని ఎన‌ర్జీ వ‌చ్చింద‌న్న నాగ్ ఇదే ఆట‌ను కంటిన్యూ చేయ‌మ‌ని చెప్పాడు. అంద‌రూ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నా నువ్వు మాత్రం అవ్వ‌డం లేద‌ని ష‌ణ్నుని పొగిడిన నాగ్‌.

ఇక శ్వేత త‌ను కుష‌న్స్ క‌ట్ చేశాన‌ని చెప్తూ ఏడ్చేసింది. ఆ చేయమని చెప్పిన మనిషి మాత్రం చేయ‌లేదంటూ ర‌వి మీద కౌంట‌రేశాడు నాగ్‌. ఇదంతా చూస్తుంటే న‌ట‌రాజ్ చెప్పిందే క‌రెక్ట్ అనిపిస్తోంద‌ని ర‌విని  గుంటనక్క గా తేల్చేసాడు నాగ్.

త‌న తప్పులేదని చెప్పే ప్రయత్నం చేసిన రవి. లోబో, నేను మాత్రమే  కాటన్ తీసే దాని గురించి డిస్కషన్  చేశామ‌న్నాడు.

బిగ్‌బాస్(Big boss) పంపిన కాట‌న్‌, కుష‌న్స్‌లో ఉన్న దూది సేమ్ ఉన్నాయ‌న్నాడు. దీంతో సంచాల‌కులు ఆ రెండుర‌కాల దూదిల‌ను ప‌రీక్షించి రెండు ఒకేలా లేదని  చెప్పడంతో మ‌రోసారి ర‌వి అడ్డంగా బుక్కయ్యాడు. ఇక శ్వేత తీసింద‌ని త‌న‌కు తెలీద‌ని ర‌వి  చెప్ప‌డంతో మ‌ధ్య‌లోనే అడ్డుప‌డ్డ శ్వేత‌.

ర‌వికి ఈ విష‌యం ముందే తెలుసంటూ అంద‌రి ముందే క్లారిటీ ఇచ్చింది.

త‌ర్వాత హౌస్ మేట్స్(Housemates) ని ఒక్కరొక్కరి గా క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని వాళ్ల పేర్ల‌ ను చెప్పమన్నాడు.

ముందుగా మాన‌స్‌ వేరేవాళ్ల మాట‌ల‌ను ప‌ట్టించుకుంటూ శ్రీరామ్ అన్నింటా వెన‌క‌డుగు వేస్తున్నాడ‌న్నాడు. స‌న్నీ మాట్లాడుతూ టాస్కుల్లో 100% ఇవ్వడం  లేదంటూ ప్రియ పేరు చెప్పాడు.

కాజ‌ల్, ప్రియ పేరు చెప్పింది. ఆమెసీట్ గ మాట్లాడుతారు కానీ  క‌నిపించేంత స్వీట్‌గా ఉండ‌ర‌ని తెలిపింది. యానీ మాస్ట‌ర్‌, శ్వేత‌, సిరి, ష‌ణ్ముఖ్‌ ఇండివిజువల్ గా ఆడ‌లేక‌పోతున్నాడంటూ లోబో పేరు తెలిపారు.

శ్రీరామ్‌, రవి పేరు చెప్పాడు. ప్రియ‌, ప్రియాంక‌.. ఎవ‌రికి గొడ‌వ‌ల‌వుతాయా అని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండే కాజ‌ల్ ఈ హౌస్ లో ఉండడానికి అన్‌ఫిట్ అని అభిప్రాయ‌ప‌డ్డారు.

జెస్సీ పక్కవాళ్ళను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ వారి ఆట చెడ‌గొడుతున్న ర‌వి హౌస్ అన్‌ఫిట్ అని చెప్పాడు.

ర‌వి, అక్కడ విష‌యాలు ఇక్కడ, ఇక్కడ విష‌యాలు అక్కడ చెప్తున్న కాజ‌ల్ హౌస్‌లో వుండే అర్హత లేదని అని చెప్పాడు. విశ్వ‌ త‌ప్పు చేస్తే ఒప్పుకోకుండా, స‌మ‌ర్థించుకునే ప్రియ అన్‌ఫిట్ అని తెలిపాడు. చివ‌ర‌గా వ‌చ్చిన లోబో, ప్రియ బిగ్‌బాస్(Big boss) హౌస్‌కు అన్‌ఫిట్ అని పేర్కొన్నాడు.

మొత్తంగా ఈ ప్రక్రియ లో లోబోకు, ప్రియ‌కు స‌మానంగా 4 ఓట్లు ప‌డ‌టంతో ఒక్కరి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి కాబట్టి నాగ్ ఓ డెసిషన్ తీసుకున్నాడు. హౌస్‌మేట్స్ ఎవ‌రికి ఎక్కువ స‌పోర్ట్ చేస్తే వారు సేఫ్ అని చెప్పాడు.

Nag and lobo

ర‌వి, స‌న్నీ, విశ్వ ఈ ముగ్గురు మాత్రమే లోబో వైపు నిల‌బ‌డ‌గా మిగిలిన అంద‌రూ ప్రియ‌కు సప్పోర్ట్ ఇచ్చాడు. దీంతో లోబో ఎలిమినేట్(Eliminate) అయిన‌ట్లు నాగ్‌ ప్రకటించడం తో ర‌వి షాకయ్యాడు.

ఇక‌ విశ్వ అయితే చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. తెలీక త‌ప్పు చేస్తే క్షమించండంటూ ఏడుస్తూ హౌస్ మేట్స్ కి సెలవంటూ స్టేజ్ మీదకి వచ్చిన లోబో.

ఇక స్టేజీ మీద‌కు వ‌చ్చిన లోబోతో నాగ్ ఎవరికి  థంబ్స్ అప్‌, థంబ్స్ డౌన్ ఇస్తావు అంటూ ఆట ఆడించాడు. అయితే కంటెస్టెంట్స్ అందరికి థంబ్స్ అప్ చూపిస్తూ, స‌న్నీ బుర్ర‌, త‌న బుర్ర ఒక‌టేన‌న్న లోబో ఇక‌పై మారిపోమ‌ని సూచించాడు.

కాజ‌ల్‌కు ఏ వేలూ చూపించ‌లేదని మ‌రోసారి స్పష్టం చేశాడు. త‌ర్వాత‌ అత‌డిని పంపించిన‌ట్లే పంపించేసి తిరిగి రమ్మన్నాడు నాగ్‌.

నిన్ను ఎలిమినేట్ చేసే అధికారం ప్రేక్షకులకు మాత్రమే ఉంద‌ని చెప్పడం తో లోబో ఎమోషనల్ అయ్యాడు.

హౌస్ లో ఉండేందుకు అన్‌ఫిట్ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాల‌ని ఓటేసినందున‌ వ‌చ్చేవారం నేరుగా నామినేష‌న్స్‌(Nomination) లో ఉంటావని  చెప్పాడు.

కాక‌పోతే నువ్వు హౌస్‌లోకి కాకుండా సీక్రెట్ రూమ్‌ (Secret room)లోకి వెళ్తున్నావ‌ని తెలిపాడు.

మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నారో తెలియాలంటే సండే ఎపిసోడ్ చూడాల్సిందే.

నాకు ఎందుకో శ్వేతా అనిపిస్తుంది మరి మీకు!