బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) లో నాలుగో వారం కూడా ముగింపుకు దగ్గరపడుతోంది. ఈ వారం నామినేషన్లో ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఎలిమినేషన్(elimination) కి నామినెటే అయ్యారు.

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా ఆసక్తి గా కొనసాగుతోంది. ఇక నిన్నటి  (సెప్టెంబర్ 30) 26 ఎపిసోడ్‌ వివరాల్లోకి వెళితే,  సారంగ దరియ పాట తో  గేమ్ ని  మొదలుపెట్టారు.

నటరాజ్ మాస్టర్ అయితే రోజూలాగే మంచి స్టెప్స్ వేశారు. తరువాత ఉరుముల సౌండ్ రాగానే శ్వేతా బజార్ నొక్కి పవర్ రూం యాక్సెస్ పొందడంతో  తమ కు పోటీ గా షణ్ముఖ్, సిరిలను ఎంపిక  చేసుకున్నారు.

‘ గెలవాలంటే  తగ్గాలంతే’ టాస్క్‌(Task) లో భాగంగా.‘చిక్కులో చిక్కికోకు’ అనే టాస్క్‌ లో చిక్కుల్లో ఉన్న ఆరు తాడుల్ని ఎవరైతే ముందుగా చిక్కులు తీస్తారో వారే విన్నెర్స్ అని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్‌ లో శ్వేత, యాని  మాస్టర్‌లు గెలిచారు.

తరువాత  గెలవాలంటే తగ్గాలి టాస్క్‌ లో.. సన్నీ-మానస్‌లు గెలిచారు. టాస్క్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే చాలా సిన్సియర్ గా ఆట ఆడారు.

హౌస్ మొత్తం బిగ్ బాస్(Big boss) ఇచ్చిన బిర్యానీ ఫుల్ గా లాగించేసిన . మానస్, సన్నీలు మాత్రం గేమ్‌పైనే దృష్టి పెట్టి బరువు తగించుకుని విన్నెర్స్ గా నిలిచారు.. అనంతరం ఇంటి సభ్యులు అందరికీ పిజ్జా, కూల్ డ్రింక్, స్వీట్స్‌ని పంపించారు బిగ్ బాస్.

దీంతో రెండు రోజుల తరువాత తమకి తినడానికి మంచి ఫుడ్ పంపినందుకు కెమెరా ముందు వచ్చి సన్నీ, మానస్‌లు సంతోషాన్ని  తెలిపారు.

అయితే  షణ్ముఖ్-సిరి లు  టాస్క్‌ లో పెద్దగా ఆడింది లేదు. సంచాలకులుగా ఉన్న కాజల్, షణ్ముఖ్-సిరిలకు సపోర్ట్ చేసిందని సన్నీ అంటున్నాడు. అందుకే నాకు సన్నీ నచ్చడు అని గుసగుసలాడింది.

అయితే ఈ టాస్క్‌ లో సంచాలకులుగా ఉన్న కాజల్.. సిరి-షణ్ముఖ్‌కి సపోర్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది.

మొత్తంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ కి సన్నీ-మానస్, యాని-శ్వేతా, శ్రీరామ్-హమీదా జంటలు ఎంపిక కావడంతో.. ఈ జంటల్లో ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరు కెప్టెన్(Captain) పోటీదారులుగా  ఉండాల్సి వస్తుందని.. ఎవరు కెప్టెన్ పోటీదారులుగా ఉండాలో తేల్చుకోవాలని చూపిన బిగ్ బాస్ .

దీంతో ఈ మూడు జోడీలు డిస్కస్ చేసుకున్నాక  శ్రీరామ్ చంద్ర, శ్వేత, సన్నీ‌లు కెప్టెన్ పోటీదారులుగా ఎంపికయ్యారు. అయితే ఇప్పటివరకూ ఫిజికల్‌గా, మెంటల్‌‌గా జరిగిన టాస్క్‌ లని  బిగ్ బాస్(Big boss) గెలిచినా జోడి ల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక  చేయడం కాస్త అసహనానికి గురి చేస్తోంది.

కెప్టెన్ పోటీదారులుగా ఉన్న వారిలో అర్హత లేని వాళ్లు ఎవరో చెప్పి.. కత్తితో వాళ్లు ధరించిన బెల్ట్‌పై పొడవాలని కోరారు బిగ్ బాస్.

ఎవరికి ఎక్కువ కత్తి పోట్లు ఉంటే  వాళ్లు పోటీ లో అర్హత కూలిపోయినట్లు, అలాగే తక్కువ కత్తి పోట్లు ఉన్నవాళ్లే హౌస్‌కి కెప్టెన్ అయినట్టు అని చెప్పారు. హౌస్ లో ఈ మధ్య గ్రూపులు ఏర్పడడం తో మొదటి నుంచి టాస్క్ బాగా ఆడిన సన్నీని  హౌస్ మేట్స్(House mates) టార్గెట్ చేశారు.

టాస్క్ మొదలు కాకముందే  సిరి అందరితో గుసగుసలాడడం ప్రారంభించింది  సన్నీకి కత్తిపోటు పొడుస్తా అని షణ్ముఖ్‌, జెస్సీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది .

ఇక మనుషులు వేరైనా ఆట ఒకటే కాబట్టి షణ్ముఖ్ కూడా సన్నీని టార్గెట్(Target_ చేశాడు కాబట్టే సిరి  కూడా సన్నీని టార్గెట్ చేసింది.

ఆ తరువాత లోబో, ప్రియ, నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంక, విశ్వలు కూడా సన్నీకి కత్తిపోట్లు పొడిచారు. దీంతో సన్నీ తనని టార్గెట్ చేసినందుకు ఎమోషనల్ అయ్యాడు.

మానస్  శ్వేతకి కత్తిపోటు పొడిచాడు, నిజానికి శ్రీ రామ్ ని టార్గెట్ చేస్తాడేమో అని హౌస్ మేట్స్ అనుకున్నారు ముఖ్యం గా సిరి అయితే మరి అత్యుత్సాహం ప్రదర్శించింది.

అయితే కాజల్ మాత్రం.. తనతో గొడవపడిన సన్నీని కాకుండా శ్వేతని కెప్టెన్ పోటీదారునిగా తప్పిస్తూ కత్తితో పొడిచింది.. సన్నీని చూస్తే మనసుకి బాధగా ఉందిని చెప్పింది.

మొత్తంగా అందరికంటే తక్కువ కత్తిపోట్లు ఎక్కువ మంది హౌస్ మేట్స్ మద్దతు చేయడంతో శ్రీరామ్ బిగ్ బాస్(Big boss) హౌస్‌కి నాలుగో వారం కెప్టెన్‌గా గెలిచాడు.

మొత్తంగా ఈ టాస్క్(Task) తొలి రోజు నుంచి డెడికేటెడ్ గా ఆడింది సన్నీ-మానస్‌ల జోడీ. బిగ్ బాస్ వేసిన బిర్యానీకి హౌస్ మేట్స్  లొంగిపోయినా, సన్నీ-మానస్‌లు మాత్రం తినకుండా వున్నారు.

ఫుడ్ తినకుండా రెండు రోజులు వర్కౌట్‌లు చేసి బరువు   తగ్గారు. పవర్ యాక్సెస్ రావడానికి కరం సన్నీ . అందుకే ‘గెలవాలంటే తగ్గాలంతే’ టాస్క్‌ లో అందరికంటే ఎక్కువ బరువు కోల్పోయాడు. కానీ  కెప్టెన్ ఎంపికకు వచ్చేసరికి  బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం వల్ల సన్నీ ని కెప్టెన్ కాలేకపోయాడు.

ఇంకా చెప్పాలంటే అందరికంటే బాగా ఆడారు కాబట్టి.. సన్నీ-మానస్‌ల మధ్య పోటీ పెట్టి  టాస్క్ లో గెలిచినా వాళ్ళను విజేతలుగా ప్రకటించాల్సింది.

శ్రీ రామ్ కంటే కూడా సన్నీ నే బరువు తక్కువ గా వున్న, శ్రీరామ్ కే తక్కువ కత్తిపోట్లు వేసి హౌస్ మేట్స్ శ్రీరామ్ నే  కెప్టెన్  గా ఎంచుకున్నారు.

బిగ్ బాస్(Big boss) ఈ మధ్య  ఊహించని స్ట్రాటజీస్ తో హౌస్ మేట్స్(House mates)ని ఆడుకుంటున్నాడనిపిస్తుంది. హౌస్ లో గ్రూప్ లు నడుస్తున్నాయి.

దాంతో పాటు సిరి సన్నీ మీద పగపట్టినట్టు వుంది. ఛాన్స్ వచ్చినపుడల్లా సన్నీ ని టార్గెట్(Target) చేస్తోంది. అయితే బిగ్ బాస్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఆడియన్స్ వోటింగ్ కూడా తారుమారు అవ్వచ్చు.

మరి ఈ వారం ఎలిమినేషన్ ఎలా వుండొబోతుందో…..