సీక్వెల్ ఓ విజ‌య సూత్రం. విజ‌య‌వంత‌మైన సినిమాని కొన‌సాగించ‌డం అనేది మామూలు విష‌యం కాదు. ప్రేక్షకుల అంచ‌నాలు భారీగా ఉంటాయి. వాటిని అన్నిటిని అందుకున్న సినిమాలూ త‌క్కువే. కాక‌పోతే,సీక్వెల్ అన‌గానే సినీ మార్కెట్ మొద‌లైపోతుంది. సీక్వెల్ కాంబినేష‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో  బిజినెస్ అతి భారీగా జ‌రుగుతుంది. ఇది.. క‌చ్చితంగా చెప్పాలంటే ప్ల‌స్ పాయింటే. అందువలనే కొన్ని  సీక్వెల్స్ ప‌ల్టీ కొడుతున్నా కొత్త గా సీక్వల్ సినిమాలు  వ‌స్తూనే ఉంటాయి.

ఇక హీరో రవితేజ విషయానికి వస్తే సినిమా తాలూకు సక్సెస్ క్రేజ్ ని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప,ఎప్పుడూ పర్టికులర్ సినిమాలపై ఎక్కడా ప్రేమను పెంచుకున్న దాఖలాలు కనిపించవు.

ర‌వితేజ `కిక్‌` కి సీక్వెల్‌గా `కిక్ 2` వ‌చ్చింది.

కిక్‌ కి సీక్వెల్‌గా ‘కిక్ 2’ కిక్ అంత పెద్ద హిట్ అవ్వకపోయినా, ఫర్వాలేదు అన్నట్టు నిలిచింది.. అయినా స‌రే నేను సీక్వెల్స్‌కి సై అంటున్నాడు మాస్ మ‌హారాజా రవి తేజ . ఇటీవ‌ల విడుద‌లైన `క్రాక్‌`కి కూడా సీక్వెల్ వ‌స్తుంద‌ని.. ఆ సినిమా చివ‌ర్లో ఒక సూచ‌న ప్రాయంగా చెప్పేసింది ఆ చిత్ర‌బృందం. అయితే ఈ సినిమా సీక్వెల్ చేయ‌డానికి హీరో ర‌వితేజ కూడా రెడీగానే ఉన్నాడట. క్రాక్ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడే సీక్వెల్ చేద్దాం అని గోపీచంద్ మ‌లినేనికి చెప్పాడ‌ట హీరో ర‌వితేజ‌.

అందుకే,అదే ధైర్యంతోనే సినిమా క్లైమాక్స్ లో `క్రాక్ 2` వ‌స్తోంద‌ని చెప్ప‌గ‌లిగాడు. అయితే ర‌వితేజ దృష్టి మ‌రో ఇంకో సినిమాపై కూడా ఉంది. అదే సూపర్ హిట్ ఇచ్చిన `రాజా ది గ్రేట్`, ఈసినిమా రవి తేజ కి మంచి విజ‌యాన్ని అందించింది . ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి త‌గిన క‌థ అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర రెడీగా ఉందని సమాచారం . “రాజా ది గ్రేట్” కి కూడా  సీక్వెల్ చేద్దామ‌ని అనిల్ నాతో అన్నాడు . కథ లో ఓ లైన్ కూడా వినిపించాడు. అది నిజంగా చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది“ అని చెప్పుకొచ్చాడు హీరో  ర‌వితేజ‌. సో…

దీనితో ర‌వితేజ నుంచి ఈ రెండు సీక్వెల్స్ మూవీస్  రావ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

చూద్దాం రవి తేజ ఈ సీక్వల్ సినిమాల తో ఎంత వరకు విజయం పొందుతాడో !! మాస్ మహారాజు కు సక్సెస్ రావాలనే కోరుకుందాం …