బిగ్ బాస్ సీజన్5(Big Boss Season 5)  హౌస్ మేట్స్(House mates) ఎవరికీ వారు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మరి షన్ను, సిరిలా వ్యవహారం అయితే బిగ్ బాస్ షో లో వున్నారా లేక ఇంకెక్కడైనా ఉన్నారా అన్నట్టు ఉంటుంది వారిద్దరి తీరు. అప్పుడే హాగ్ లు ఇచ్చుకుంటారు, ఆ వెంటనే గొడవలు, మరి షన్ను అయితే ప్రతిదానికి సిరిని టార్గెట్(Target) చేసి ఓ తెగ ఆరిచేస్తుంటాడు. ఎప్పుడూ చాలా ఆక్టివ్ గా వుండే సిరి ఈ మధ్య బాగా డల్ అయ్యినట్టు కనిపిస్తోంది. ఆమె అలా అవడానికి మూల కారణం షణ్నూనే అని మానస్‌, కాజల్‌ ఇద్దరు చర్చించుకున్నారు. షణ్ను చూపులతోనే సిరిని కంట్రోల్‌(Control) చేస్తున్నాడని, అది నేను చూశానని మానస్ తెలిపాడు. అయితే  దీనివల్ల సిరి ఇండివిడ్యువాలిటీ (Individuality) కోల్పోతుందని చెప్పుకొచ్చాడు.

బిగ్‌బాస్‌ జర్నీ(Big Boss journey)లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్ ని రోల్ రిక్రియేషన్(Roel recreation) ద్వారా హౌస్ మేట్స్(House mates) తో  చూపించే  ప్రయత్నం చేయిస్తున్న బిగ్ బాస్(Big Boss). బుధవారం ఎపిసోడ్ లో రోల్ ప్లే(Role play) చేసే గేమ్‌లో శ్రీరామ్‌- జెస్సీలకు కిచెన్‌లో జరిగిన గొడవను రీక్రియేట్‌ చేసి చూపించాలన్నాడు బిగ్‌బాస్‌. అయితే షణ్ను మాత్రం ఇప్పటికే ఈ టాస్కుల్లో తనను వివరితంగా ఇమిటేట్(Imitate) చేసి చులకనగా చూస్తున్నారని అసహనాని వ్యక్త పరిచాడు. మాటలు అంటే పడ్డాను, కానీ ఇమిటేట్‌ చేస్తే మాత్రం ఒప్పుకోను అని తెగచేసి చెప్పాడు. అసలు ఈ టాస్కులోనే పాల్గొననంటూ ఖరాఖండిగా చెప్పాడు. అతడిని కూల్‌ చేయడానికి వెళ్లిన సిరి మీద ఫైర్ అయ్యాడు. నువ్వు కూడా నన్ను తక్కువ చేస్తున్నావంటూ సిరి పై శివాలెత్తాడు షన్ను. ఇలా చీటికీ మాటికీ, ప్రతి విషయంలోనూ సిరి ని టార్గెట్ చేసి తన కోపం వెళ్ళబుచ్చడం హౌస్ మేట్స్ కి, చూసే ప్రేక్షకులకు విసుగుపుడుతోంది. ఇక ట్రోలింగ్(Trolling) చేసేవాళ్ళకి చాలా కంటెంట్ ఇచ్చినట్టే, మాములు ట్రోలింగ్స్ వుండవు. సన్నీ ఇమిటేట్ చేసినదానికి బిగ్ బాస్ హౌస్ లో అలిగి కూర్చున్నాడు. ఇక బయటకు వచ్చి ఈ ట్రోలింగ్స్ చూస్తే ఏమైపోతాడో ఈ అపార బ్రహ్మ.

ఎప్పటిలానే  సిరి వచ్చి సారీ చెప్పినప్పటికీ అతడు వినిపించుకోలేదు. నీవల్ల నాకేం నెగెటివ్‌ లేదు, నీ మంచి కోసం మాట్లాడితే నేను నెగెటివ్‌(Negative) అవుతున్నాను అంటూ కోప్పడ్డాడు. మిగతా హౌస్‌మేట్స్‌(House mates) అందరూ ఎంతో నువ్వు కూడా అంతేనంటూ తేల్చేసాడు. నువ్వు అవసరం లేదు, వెళ్లిపో ‘నాదగ్గర చాలా ఫ్రీడమ్‌(Freedom) తీసుకున్నావ్‌రా అవతలి వాళ్లను ఆయన ఈయన అంటావు, నన్నేమో అరేయ్‌ ఒరేయ్‌ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు. మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్‌ చేస్తున్నా, కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్‌(Hug) ఒక్కటే గుర్తుంది’ అంటూ సిరిని నానామాటలు అన్నాడు. వీళ్లిద్దరి గొడవలో తన తల్లిని కూడా లాగడంతో తనకు తెలియకుండానే సిరి  కనీళ్ళు పెట్టుకుంది. ఆ తరువాత షన్ను  సారీ(Sorry) చెప్పి ఆమెను ఓదార్చడం తన కోసం దోసలు  వేసి తీసుకురావడం జరిగిపోయింది. అలా మరి కాసేపటికే ఇద్దరూ కలిసిపోయి ఎప్పటిలానే హుగ్లీచుకున్నారు..

ఆ తరువాత సీన్‌ రీ క్రియేషన్‌ టాస్కు(Re creation Task)లో హమీదా ట్యాగ్‌ మెడలో వేసుకున్న సన్నీని, హమీద లానే తయారవడానికి విశ్వప్రయత్నం చేసాడు మనోడు. హమీద ల మారిన సన్నీ ని చూడగానే శ్రీరామ్‌కి ప్రాణం లేచి వచ్చినట్టుంది, మిస్‌ యూ హమీదా అంటూ సన్నీని హత్తుకుని అతడిని ముద్దలతో ముంచెత్తాడు. ఇప్పటివరకు జరిగిన రీ క్రియేషన్‌ టాస్కులో మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌(Most Entertaining Person)గా హౌస్‌మేట్స్‌(House mates) షణ్నును ఎంపిక చేసారు. దీంతో అతడు ప్రేక్షకులను ఓటేయమని అడిగే అర్హత పొందాడు.’ప్రేక్షకులే నా దేవుళ్లు. దయచేసి నన్ను సపోర్ట్‌(Support) చేయండి. ఇక్కడున్న అందరికీ ఓటేయండి, నాకు కొంచెం ఎక్కువ ఓట్లేయండి’ అని కోరాడు. ఆ తరువాత  ఎక్కువసేపు నవ్వకుండా ఉండాల్సిన టాస్క్‌ లో శ్రీరామ్(Task), మానస్‌ నవ్వకుండా బజార్(Buzzer) మ్రోగే వరకు వున్నారు.

ఈ టాస్క్ లో మానస్ గెలిచినట్టు కనిపిస్తోంది. అయితే ప్రోమో లో ఎవరు గెలిచారన్నా దాని పై గొడవ పడుతున్నట్టు, ఎప్పటిలానే  అన్ని విషయాల్లో నేను వున్నా అంటూ కాజల్ శ్రీరామ్ చంద్ర తో ఆర్గుమెంట్(Argument) కి దిగుతుంది, మరి నెక్స్ట్ ఎపిసోడ్(Next Episode) లో ఎం జరుగుతుందో గురువారం ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.