మంచి ఆహారం తీసుకోవడం ప్రతీ మనిషికి చాలా అవసరం.ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో నట్స్ (nuts), సీడ్స్ (seeds) ముఖ్యమైనవి. చాలా  మంది ,పిల్లలు సైతం నట్స్‌లో బాదం పప్పులు తినేందుకే ఇష్టపడతారు.

ప్రపంచవ్యాప్తంగా బాదం పప్పుకి మంచి  డిమాండ్ ఉంది.బాదం పాలు, బాదం బటర్ తదితర వెరైటీలను ఆస్వాదించేందుకు అందరూ ఇష్టపడతారు .

Almonds

 

అయితే ఈ బాదం పప్పులు ఎంతవరకు మనకు  ఆరోగ్యాన్ని అందిస్తాయి? శరీరానికి మేలు చేస్తాయా లేదా? ఏ విధంగా తీసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.

బాదంపప్పులో  చాలా పోషకాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. సుమారు 28 గ్రాములు బాదం పప్పులు మన  శరీరానికి  161 క్యాలరీలు అందిస్తాయట. ఇంకా వీటిలో 3.5 గ్రాముల ఫైబర్, 2.5 గ్రాముల పిండి పదార్థం, 6 గ్రాముల ప్రోటీన్, 14 గ్రాముల కొవ్వు, 37 శాతం విటమిన్-E మరియు 32 శాతం మెగ్నీషియం ఉంటాయట. ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్ప‌డ‌తాయి.సూపర్‌ ఫుడ్‌గా పిల‌వ‌బ‌డే బాదం పప్పు లో న్యూట్రీషియన్స్ , ఫైబర్, విటమిన్స్ ,ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్,మెగ్నీషియం,  ప్రోటీన్స్ అధికం గా ఉన్నాయి. బాదంను ప్రతీ రోజు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఎముకలకు మంచిది

బాదం ద్వారా శరీరంలో కాల్షియాన్ని పెంపొందించుకోవచ్చు.కాల్షియం శాతాన్ని పెంచుకోవడనికి బాదం పప్పులను తినడం అలవాటు చేసుకోండి. పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం స్థాయిలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.దీని వల్ల మన ఎముకలు బలోపేతమవుతాయి. ఎముకలు విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంతేకాకుండా బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికంగా ఉంటుంది . ఇది మానవ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే ప్రతీ  రోజూ బాదం తిన‌డం వ‌ల్ల శరీరం లో ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది.అంతేకాకుండా బాదం ,మన శరీరం గ్లూకోజ్ ను బాగా శోషించుకొనేలా చేస్తాయి.త‌ద్వారా శరీరం లో  మధుమేహం అదుపులో ఉంటుంది.

నానబెట్టిన బాదం తినొచ్చా?ఐతే ఏది మంచిది అనే సందేహం మన అందరికి వస్తుంది ??

నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది. నానబెట్టి తిన్న బాదం మన శరీర ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది.ముఖ్యంగా రాత్రి అంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ఇలా క్ర‌మం తప్ప‌కుండా బాదంపప్పును ను తిన‌డం వ‌ల్ల‌ జ్ఞాపకశక్తి బాగా మెరుగుప‌డుతుంది.

ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బాదం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది.ఈ క్ర‌మంలోనే ఆకలి బాగా తగ్గిస్తుంది.దీనితో బరువు బాగా త‌గ్గొచ్చు. బాదం ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ క్యాలరీలు తీసుకొనే అవకాశం ఉండదు.

బాదం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

మ‌రియు బాదంపప్పు లో ఉండే బి17 లో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ నివారణలో బాగా  స‌హాప‌డ‌తాయి.

డయాబెటీస్ బాధితులకూ మంచిదే- . బాదం వల్ల మేలే తప్పా మనకు ఎలాంటి కీడు ఉండదు.

మధుమేహం ఉన్నవారు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే కొన్ని ఆహారాల వల్ల మన శరీరం లో రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగిపోయే ప్రమాదం ఉంది.బాదంలో పిండి పదార్థం తక్కువ. ఫైబర్ శాతం ఎక్కువ. కాబట్టి,రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు బాదం చాలా బాగానే పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా శరీరం లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడమే కాకుండా తద్వారా ఇన్సులిన్ ప్రక్రియ సజావు గా సాగేందుకు దోహదం చేస్తుంది.

డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు. బాదం తినేవారిలో మెటాబాలిక్ (జీవక్రియ) సిండ్రోమ్ ,టైప్-2 డయాబెటీస్, ఇతర సమస్యలు అన్నీ అదుపులో ఉన్నట్లు కొన్ని పరిశోధనలలో గుర్తించారు.

రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? ఏ విధంగా తినాలి?

శరీరానికి మేలు చేస్తుంది కదా అని.. ఏదీ అతిగా తీసుకోకూడదు. ఈ సూత్రం బాదంకు కూడా వర్తిస్తుంది. బాదంలు మోతాదుకు మించి తింటే కొత్త సమస్యలు వచ్చిపడతాయి. ఆహార నిపుణుల సూచన ప్రకారం.. ప్రతి రోజు 8 నుంచి 10 బాదం పప్పులు తింటే ఆరోగ్యానికి మేలు. జుట్టు బాగా పెరిగేందుకు,బరువు తగ్గేందుకు, కండలు పెంచేందుకు ఈ మోతాదు బాదం సరిపోతుంది. అయితే, ఈ బాదంను నేరుగా తినేయకుండా దీన్ని నీటిలో సుమారు 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినడం చాలా మంచిది. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి.

almonds

ఆరోగ్యమే మహా భాగ్యం కదా !!ఇక ఆలస్యం ఎందుకు బాదం ని మన రోజు వారీ ఆహారం లో క్రమం తప్పకుండా తీసుకుని అందరం ఆరోగ్యం గా ఉందాం .