మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ), బుచ్చిబాబు సన(Bucchi Babu Sana) దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా(Uppena Movie)తో టాలీవుడ్‌(Tollywood)కు ఎంట్రీ(Entry) ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘కొండపొలం’ సినిమా(Kondapolam Movie)తో పలకరించారు. ఇపుడు ముచ్చటగా ‘రంగ రంగ వైభవంగా’(Ranga Ranga Vaibhavamgaa) సినిమాతో ప్రేక్షకుల ముందు రాన్నునారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌(First Look)కు ఆడియన్స్(Audience) నుంచి  మంచి ఆదరణ వచ్చింది. తాజాగా ఈ మూవీని మే 27 (MAY 27TH) న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఉప్పెన, కొండలపొలం, రెండు సినిమాల తర్వాత వైష్ణవ్, దర్శకుడు గిరీషయ్య(Greeshayya) అనే కొత్త దర్శకత్వం(Direction)లో రూపొందిన చిత్రానికి  ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్(Title) పెట్టడమే కాదు. టీజర్‌(Teaser)ను విడుదల చేసారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ(Ketika Sharma) కథానాయిక(Heroine)గా నటిస్తోంది.

గతేడాది క్రిష్(Krish) దర్శకత్వం(Direction)లో వచ్చిన కొండపొలం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో మూడో సినిమా కోసం గ్యాప్ తీసుకొని తమిళ దర్శకుడితో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్(Shooting) పూర్తి చేసుకుంది.

రొమాంటిక్ సినిమా(Romantic Movie)తో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్(Title Teaser) కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది. బటర్ ఫ్లై కిస్(Butterfly Kiss) కావాలా అంటూ హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ టీజర్(Romantic Teaser) కట్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్(Music) అందిస్తున్నాడు. తాజాగా హీరో, హీరోయిన్ల(Hero, Heroine)కు సంబంధించిన లుక్స్(Looks) ను రిలీజ్ చేసారు. మరోవైపు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘జాతి రత్నాలు ఫేమ్(Jaathi Rathnalu Fame) అనుదీప్(Anudeep) దర్శకత్వం(Direction)లో ఓ మూవీ(Movie) చేయనున్నట్టు సమాచారం.‘రంగ రంగ వైభవంగా’ చిత్రం తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.