రోజు అల్పాహారం(Breakfast) తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు(healthy benefits) వున్నాయి. ఉదయానే మనం తీసుకునే అల్పహారం రోజును ప్రారంభించ్చేందుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన విధానంలో బరువును కాపాడుకునే దిశగా సాయం చేస్తుంది.కాబట్టి మనకు ఎక్కువ గా మేలు చేసే  బ్రేక్ ఫాస్ట్ ఏంటి? ఏఏయ్ అల్పాహారం  తింటే  ఎంత ఆరోగ్యం గా ఉంటాం. మ్రెఅక్ఫాస్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్రలేవగానే పొట్టంతా ఖాళీగా ఉంటుంది ఈ సమయంలో కాష్ఠంత అల్పాహారం తీసుకోవడం ద్వారా తగిన శక్తి లభిస్తోంది. అదే విధంగా ఉదయానే అల్పాహారం తీసుకోవడం  ద్వారా రోజంతా ఆకలి అదుపులో ఉంటుంది. ససిరా బరువుని అదుపులో వుంచుకోవడానికి, ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఎంతో అవసరం.

బ్రేక్ ఫాస్ట్(breakfast) తీసుకోవడం వల్ల శరీరం దృడంగా ఉంటుంది. నిద్రించే సమయం లో మన శరీరం లో జీవక్రియల ప్రక్రియ క్రమంగా తగ్గిపోతోంది. ఉదయాన్నే అల్పాహారం మానేయడం వల్ల నీరసించిపోవడానికి ఆస్కారమవుతుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల జీవక్రియలు ఉతేజితమవుతాయి.

ప్రతి రోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనులకు శక్తినిచ్చేది అల్పాహారమే.

మనం సాధారణం గా రోజు తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో పీచుపదారాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా వుండే పోషక విలువలు వున్నా ఆహారాలను తీసుకోవచ్చు అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫేస్టులో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.

ఉదయం తీసుకునే ఆహారంలో మోయుచు తప్పని సరి ఉండాలి.ఇందుకోసం రాగులు, జొన్నలు,సజ్జలతో చేసిన బ్రెడ్లు, అటుకులు, వోట్ మెయిల్ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలు.

పీచు తరువాత మనము తప్పకుండ తీసుకోవాల్సినవి మాంసకృత్యాలు, వీటికోసం రోజు గుడ్లను అల్పాహారం తో పాటు తీసుకోవడం వల్ల అవసరమైఅన్ ప్రోటీన్ అందుతుంది. మాంసకృతులతో పాటు అత్యవసర విటమిన్లు(Vitamins), ఖనిజా(Minerals)లు కూడా అందుతాయి. వీటితో పాటు బాదం(almonds) వంటి ఎండు పప్పులను కూడా చేర్చుకోవాలి.

అలాగే అల్పాహారంగా తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉండవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో వోట్ మెయిల్ తీసుకుంటే రోజంతా తక్కువ ఆహారం తీసుకోవడానికి, బరువుని నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది.

అలాగే మెటబాలిజం(metabolism) మెరుగు పడుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని గుర్తించడం ఒకెత్తయితే ఎలాంటి అల్పాహారం తీసుకోవడం అన్నది ముఖ్యమైన అంశం. రోజు మొత్తమీద పండ్లు, కూరగాయలు కనీసం మూడు దఫాలుగా, మూడు మోతాదులు గా తీసుకోవాలన్నదే సూత్రం కాబట్టి ఉదయం అల్పాహారంలో కూడా  ఇవే ఉండేలా చూసుకోవాలి .

ఏ పదార్థం తయారు చేసుకున్న అందులో కూరగాయ ముక్కలు, కూరగాయ తురుము వంటివి ఉండేలా చూసుకోవచ్చు. శుద్ధి చేసిన గోధుమలతో తయారు తెల్లబ్రెడ్ ముక్కలకంటే ముడి గోధుమలతో తయారు చేసిన  బ్రౌన్ బ్రెడ్(Brown Bread) తినడం మంచిది. దాన్ని కూడా మాంసకృత్తులు వుండే గుడ్డు వంటి వాటితో తీసుకోవడం మంచిది

టిఫిన్ అనగానే చాలా మంది ఇంట్లో చేసుకోవడం ఎందుకులే ? బయట తిందాం అనుకుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు. బయట తినే ఆహారంలో ఉప్పు, నేనెలా మోతాదు ఎక్కువగా ఉంటుంది అందుకని ఇంట్లోనే తినడం మంచిది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్  పెరిగిపోయి ఎక్కువ బరువు పెరిగి అవకాశం ఉంటుంది. అల్పాహారం(Break fast) తీసుకోవడం మాత్రమే కాదు సరైన విధంగా దీన్ని ఎంచుకోవడం చాలా కీలకం. ఆరోగ్యకరమైన పండ్లు, తృణధాన్యాలు, కూరగాయలు  లీన్ ప్రోటీన్స్ సహా పలు ఆహారాలను తీసుకోవచ్చు