స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) లో నాలుగో వారం కెప్టెన్ శ్రీరామ్ ఎంపికయ్యి కెప్టెన్(Captain) భాద్యతలు చేపట్టాడు.

అందులో భాగంగానే  నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడించిన బిగ్ బాస్, అలాగే బెస్ట్, వరస్ట్ పెరఫార్మెర్ ని కూడా ఎంచుకున్న హౌస్ మేట్స్(House mates).

మొత్తానికి ఈ వారం లోబో ప్రియా ల మధ్య గొడవ తార స్థాయి కి చేరిన ఆ తరువాత ఇష్యూని క్లియర్ చేసుకున్నారు.

ఇక టాస్క్ ల విషయానికి వస్తే ఎవరు చూపించాల్సిన సత్తా వారు టాస్క్ లో చూపించారు.

బెస్ట్ పెరఫార్మెర్ గా మానస్ ,ఒజివ బ్యూటీ క్వీన్ గా ప్రియా. జర్నలిస్ట్ గా మారిన సన్నీ, ఎవరిని ఇంటర్వ్యూ చేసాడో? తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ పై ఓ లుక్ వేయాల్సిందే.

ఇమ్మ్యూనిటి(Immunity) కోసం ఆడే కెప్టెన్సీ తనకి దక్కకుండా చేసినందుకు కాజల్ తో డిస్కషన్ పెడుతుంది  శ్వేతా. నేను హమీద తో కనెక్ట్ అవుతున్న నీతో నెక్స్ట్ వీక్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తా అంటుంది కాజల్.

నువ్వు నీ మైండ్‌ను ఎక్కువగా వాడుతున్నావు, కానీ మనసును కాదని కాజల్‌ను పాయింట్ అవుట్ చేస్తుంది . దీనిపై కాజల్‌ స్పందిస్తూ.. శ్రీరామచంద్ర గెలవాలనుకున్నా, అంతే తప్ప నీ ఫీలింగ్స్‌ నాకు మ్యాటరే కాదని శ్వేత ముఖం మీదే చెప్తుంది.

మరో పక్క అర్థరాత్రి అందరూ పడుకున్నాక శ్రీరామ్‌, హమీదా సైగలు చేసుకుంటూ ఫ్లయింగ్ కిస్సెస్ పంపుకుని గుడ్‌నైట్‌ చెప్పుకుంటారు.

తర్వాతి రోజు నటరాజ్‌ మాస్టర్‌ రవిని టార్గెట్ చేసాడు. రవి టాస్క్‌ ఆడుతునంత సేపు ఆక్టివ్ గా లేడని, నత్తలా అనిపించాడని కామెంట్‌ చేశాడు.

దీంతో విసిగిపోయిన రవి మాస్టర్‌ నన్ను చాలా ఇరిటేట్‌ చేస్తున్నాడని లోబో, కాజల్ తో అంటాడు. అసలు తన పేరు కూడా ఎత్తొద్దని ఆయనకు చెప్పంటూ లోబోకు చెప్తాడు.

తరువాత  నల్లచీర కట్టుకుని ప్రియాంక సింగ్‌ వయ్యారాలు పోతుంటే శ్రీరామ్‌ వాలుకనుల దాన అనే పాట పాడుతూ సూపర్ వున్నావ్ పింక్ అని కంప్లిమెంట్ ఇస్తాడు.

ఈ  వారం లగ్జరీ బడ్జెట్(luxury budget) టాస్క్ గా  ‘ఊలాలా… లా లా’ పేరుతో టాస్క్ ఆడించిన బిగ్ బాస్(Big boss) .

టీవీ స్క్రీన్ మీద ఏ హౌస్ మెట్ పేరు కనిపిస్తుందో వారు పెద్ద రింగ్ ను నడుముపై పెట్టుకుని 30 సెకన్ల పాటు కిందపడిపోకుండా తిప్పాలి. గెలిచిన వారికి ఏ ఫుడ్  ఇస్తారో  కూడా టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

హౌస్ మేట్స్(house mates) కోసం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో లోబో చికిన్, విశ్వ మటన్, ప్రియా మష్ రూమ్స్, రవి పీనట్ బట్టర్ ను విజయవంతంగా గెలుచుకున్నారు.

బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్లను సెలెక్ట్ చేసుకోమని చూపిన బిగ్ బాస్ .

దీంతో శ్రీరామ్‌-హమీదా జంట.. లోబోను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తెలుపుతారు.

యానీ మాస్టర్‌-శ్వేత.. శ్రీరామ్‌ను బెస్ట్‌, కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొన్నారు .

విశ్వ-రవిజంట .. మానస్‌ను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా, షణ్ముఖ్‌-సిరి.. మానస్‌ బెస్ట్‌, లోబో వరస్ట్‌ అని తేల్చారు.

తర్వాత వచ్చిన నటరాజ్‌ మాస్టర్‌- లోబో మానస్‌ను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తెలిపారు.

కాజల్‌-జెస్సీ, మానస్‌ను బెస్ట్‌, లోబోను వరస్ట్‌గా అభిప్రాయపడ్డారు.

ప్రియ- పింకీ, మానస్‌ను బెస్ట్‌, లోబో వరస్ట్‌ అని చెప్పారు. సన్నీ- మానస్‌, లోబోను బెస్ట్‌ అని చెప్తూ ఎవరి వాళ్ళో ప్రభావితం అవుతున్నావని  జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తేల్చారు.

మొత్తంగా ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌గా మానస్‌ను, వరస్ట్‌ పర్ఫామర్‌గా జెస్సీని ప్రకటించారు. దీంతో జెస్సీ మరో సారి జైల్లోకి వెళ్లాడు.

సౌందర్య సాధనాల ఉత్పాదక సంస్థ వోజీవా ప్రాడక్ట్స్ తో బిగ్ బాస్ ఓ టాస్క్ ను లేడీ కంటెస్టెంట్(contestants) కి ఇచ్చాడు . ఐదురుగు అమ్మాయిలను పోటీలో నిలిపి, వోజీవా(Oziva) కంపెనీ తయారుచేసిన వాటిని ఎవరు ముందుగా పెర్ఫెక్ట్ గా ఉపయోగిస్తారో వారిని బ్యూటీ క్వీన్ గా సెలెక్ట్  చేయాలనీ  శ్రీరామ్ కు చెప్పాడు.

ఆ గేమ్ లో యాని, ప్రియాంక, సిరి, ప్రియ, శ్వేత వర్మ పోటీ పడ్డారు. అయితే ప్రియ సౌందర్యోపకరణాలను పర్ ఫెక్ట్ గా ఉపయోగించి విన్నర్ గా నిలిచింది.

బిగ్‌బాస్‌ హౌస్‌(Big boss house)లో స్పెషల్ ఇంటర్వ్యూ చేయాల్సింది గా టాస్క్ ఇచ్చాడు. ఈ షోకి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ కెప్టెన్‌ శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు.

ఈ క్రమంలో కాజల్‌ మైక్‌ అందుకుంటూ సిరి, హమీదాలలో ఎవరిని సెలక్ట్ చేసుకుంటారు అని అడగా. లంచ్‌ టైమ్‌లో సిరి, డిన్నర్‌ టైమ్‌లో హమీదా అని శ్రీ రామ్  తెలివిగా బదులిచ్చాడు .

మరి టిఫిన్‌ టైమ్‌లో ఎవరూ లేరా? అని సన్నీ కౌంటరిచ్చాడు. మంచి అమ్మాయి కోసం వెయిటింగ్‌ అన్నావు, ఇక్కడున్న వారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు? అని సన్నీ ప్రశ్నించగా  శ్రీరామ్‌.. సిరి కమ్మిట్   కాకపోయివుంటే తనకే  ట్రై చేసేవాడిని అని చెప్పాడు.

దీంతో రవి అన్న, నీ టేస్ట్‌ ఇంత బ్యాడ్‌ అనుకోలేదని సెట్టైర్ వేసాడు.

మనసు లో  ఏ అమ్మాయైనా ఉందా? అన్న ప్రశ్నకు.. గుండెలనిండా ఏ అమ్మాయినైనా నింపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ ఓ ప్రియా.. ప్రియా.. అంటూ  పాట పడిన శ్రీరామ్.

ఇక్కడున్నవారిలో ఎవరిని డేట్‌కు తీసుకెళ్తారు అని అడుగగా వెంటనే హమీదా పేరు చెప్పాడు. అంతేకాకుండా పాట పడుతూ  ఆమెను ఎత్తుకుని, డ్యాన్స్‌ కూడా చేసాడు.

తర్వాత లోబో, సన్నీ కలిసి హౌస్‌మేట్స్‌(House mates) ను ఇమిటేట్ చేస్తూ నవ్వించ్చాడు.

మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి … మరి ముందు ముందు హౌస్ మేట్స్ ఎంత ఎంటర్టైన్ చేయనున్నారో చూడాల్సిందే ..