Gangrene(గ్యాంగ్రీన్). ఈ పేరు వింటేనే ఉలికిపడతాం. ఎందుకంటే ఇది సోకితే ఆ శరీర భాగాన్నే తీసేయాల్సి వస్తుంది. ముందు అసలు గ్యాంగ్రీన్ అంటే ఏమిటి, ఎందువల్ల వస్తుందో తెలుసుకుందాం. గ్యాంగ్రీన్ అంటే ఒక అవయవం లోని రక్త నాళాలు మూసుకుపోతుంది. అలా రక్తం ద్వారా వచ్చే పోషకాలు, ఆక్సిజన్ అందక అక్కడ tissue చనిపోతుంది. దాంతో ఆ శరీర భాగమంతా నీలం లేదా నలుపు రంగులోకి మారిపోతుంది. దీనినే గ్యాంగ్రీన్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నా ఎక్కువగా ఇది డయాబెటిస్ (diabetes) ఇంకా ధూమపానం (smoking) వల్ల వస్తుంది. ఇది సాధారణంగా కాలి వేళ్ళు, చేతి వేళ్ళతో మొదలై శరీరమంతా పాకుతుంది. దీనిని మొదట్లోనే గుర్తించకపోతే ఆ భాగాన్నే తీసేయాల్సి వస్తుంది. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు అంటున్నారు వైద్యులు.

gangrene 1

 

Angioplasty ద్వారా interventional cardiologist Dr. Ravindra Singh Rao, ఒక అరుదైన శస్త్ర చికిత్స చేసి ఒక రోగి కాలు తీసేయకుండా కాపాడారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే…

మన దేశం లోనే ఒక 60 ఏళ్ల వృద్దునికి గ్యాంగ్రీన్ సోకిన కాలుకు Angioplasty ద్వారా శస్త్రచికిత్స చేసారు. గ్యాంగ్రీన్ సోకిన కాలుకు గతంలో వేరొక శస్త్రచికిత్స చేసి ఉండడం వల్ల మరో కాలు ద్వారా artery లోకి Catheter (ఒక సన్నని మెత్తని గొట్టం)ను గ్యాంగ్రీన్ కాలులోకి పంపించి మూసుకుపోయిన రక్త నాళాన్ని (blocked artery) ని సహజ స్థితికి తీసుకువచ్చి మళ్ళీ మామూలుగా రక్త ప్రసారం జరిగేట్టు చేసారు.

gangrene surgery

ఇటువంటిది మన దేశంలో ఇదే ప్రధమం కావడం విశేషం. దీనికి ఇంచుమించుగా 1.5 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు వైద్యులు.

Courtesy