టాలీవుడ్(Tolly Wood) నటుడు  నాచురల్ స్టార్ నాని కధానాయకుడి(Hero)గా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy)’. ఇప్పటికే తెలుగులో ఈ మూవీ ఫస్ట్ లుక్(First Look), టీజర్(Teaser), ట్రైలర్‌(Trailer) విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్(Response) వచ్చింది.

మరోవైపు ఈ చిత్రాన్ని హిందీ తప్ప మిగతా దక్షిణాది భాషల్లో రిలీజ్(Release) చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా నాని అభిమానులు(Fans)  హైదరాబాద్‌లో  63 అడుగుల నాని స్టిల్ ని భారీ కటౌట్‌(CUTOUT)ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం  దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ  మూవీలో నాని సరసన కథానాయికలు(Heroines)గా సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ లు  న‌టించారు. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ చిత్రం  సాగనుందని ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌(Trailer) ద్వారా తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ మూవీ  ఒక వింటేజ్ డ్రామా(Vintage Drama)లా అనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తం(World Wide)గా ఈ చిత్రం  డిసెంబర్ 24న  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌(Promotions) లో భాగంగా ఈ సినిమా యూనిట్(Movie Unit) హడావిడి చేస్తోంది..

ఇక నాని నటించిన ఇదివరకటి  రెండు సినిమా(Two Movies)లు ‘వీ(V)’‘టక్ జగదీష్’(Tuck Jagdeesh) సినిమాలు ఓటీటీ వేదిక(OTT Platform)గా రిలీజైన విషయం  తెలిసిందే. దాదాపు రెండేళ్లు గ్యాప్ తర్వాత నాని హీరోగా నటించిన చిత్రం థియేటర్స్‌(Theaters) లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని ఫ్యాన్స్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌ లో దేవి 70 MM థియేటర్‌(Theatre)లో నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన పిక్స్‌ ను సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) చేస్తున్నారు. అయితే తెలుగులో ఇప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్,  రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల చిత్రాలకు  ఆ హీరోల ఫాన్స్  భారీ కటౌట్స్ ఏర్పాటు చేసేవారు. తాజాగా నాని అభిమానులు  కూడా తమ అభిమాన హీరోకి 63 అడుగుల(63 FEET)తో కూడిన భారీ కటౌట్(CUTOUT) ఏర్పాటు చేశారు.

శ్యామ్ సింగరాయ్’లో నాని రెండు వైవిధ్యమైన పాత్ర(Different characters)ల్లో నాని కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్(Trailer) యూట్యూబ్‌(YouTube) లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక తమిళంలో విడుదలైన ట్రైలర్‌(Trailer) కూడా ఆడియన్స్(Audience) ని ఆకట్టుకునే విధంగా ఉంది. శ్యామ్ సింగరాయ్ తమిళ వెర్షన్‌(Tamil Version)కు నాని సొంత డబ్బింగ్(Dubbing) చెప్పుకున్నారు.

గతంలో ఒకటి రెండు తమిళ చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో నాని తమిళ ప్రజలను తన గొంతుతో పలకరించనున్నారు. ఈ బుధవారం సాయంత్రం  నుంచి యూఎస్‌(USA)తో పాటు పలు ప్రాంతాల్లో ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) ప్రీమియర్స్ (Premiere Show) ను ఏర్పాటు చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక బృందం(Technical Team)లో సినిమాటోగ్రాఫర్ (Cinematographer) సాను జాన్ వర్గీస్ మరియు ఎడిటర్(Editor) నవీన్ నూలి ఉన్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని (Music) సమకూర్చే బాధ్యతను నిర్వహించారు.