ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత ఓటీటీ(OTT)లోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో చిత్రబృందం వరుసగా వీడియో సాంగ్స్‌(Video Song) ను రిలీజ్ చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ  మూవీ లో సమంత డాన్స్ చేసిన పాపులర్ సాంగ్ ఊ..అంటావా మావ.. ఊహూ అంటావా మావా.. అనే సాంగ్‌ను యూట్యూబ్‌(YouTube)లో విడుదల చేసింది. ఊ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా, ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఈ పాటలో సమంత అందాల ఆరబోతతో వీక్షకుల(Viewers)ను ఆకట్టుకుంది. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.50 లక్షల వరకు పారితోషకం(Remuneration) తీసుకున్నట్టు తేలుస్తోంది. లేటెస్ట్ గా ఈ పాట యూట్యూబ్‌లో 120 మిలియన్ వ్యూస్(Million Views) సొంత చేసుకుంది. ఈ పాట కోసం సమంత ఏ రేంజ్‌(Range)లో కష్టపడిందో తెలిపే ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియా(social Media)లో తెగ వైరల్(Viral) అవుతోంది. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్‌(Choreographer)తో కలిసి చేసిన డాన్స్ మూమెంట్స్‌(Dance Movements) ను చూసి ఫాన్స్ హీరోలు, హీరోయిన్లు ఓ పాట కోసం  ఏ రేంజ్‌లో కష్టపడతారన్నది తెలుసుతోంది. పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఎటు చూసిన  మొత్తం పుష్ప ఐటెం పాట హుంగామ(Hungama)నే ఉంటోంది.

అంతేకాకుండా  ఈ సినిమా జనవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో స్ట్రీమ్(Stream) అవుతోంది. దీనికి సంబంధించిన  ఆఫీషియల్(Official) ప్రకటన  విడదులైన విషయం తెలిసిందే. పుష్ప మూవీ  అన్ని భాషా(All Languages)ల్లో కలిపి 300 కోట్ల గ్రాస్‌(Gross)ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌(Poster)ను వదిలింది చిత్ర బృందం(Movie Unit). దింతో పాటు లేటెస్ట్ గా  ఈ సినిమా మరొక రికార్డు(Record)ను సొంతం చేసుకుంది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళ(Collections)ను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ బద్దలుకొట్టింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ బాక్స్ ఆఫీస్(Box Office) బద్దలయ్యేలా చేసింది. పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం గా చెప్పుకుంటున్నారు. ఇక మొత్తంగా పుష్ప వరల్డ్ వైడ్‌(World Wide)గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్(Makers) అధికారికంగా ప్రకటించారు.