బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నిరుద్యోగులకు గుడ్ న్యూస్(Good News) ప్రకటించింది. బ్యాంకు లో ఖాళీగా వున్నా అనేక  ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ  మేరకు బ్యాంక్ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.

ఆసక్తి, అర్హత, కలిగిన అభ్యర్థులు(Candidates) ఆన్లైన్లో దరఖాస్తు(Online Registration) చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notifications) పేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 ఖాళీల(105 Posts)ను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జనవరి 7) నుంచి మొదలైంది.

ఈ పోస్ట్ లకు దరఖాస్తు  చేసుకోవడానికి ఈ నెల 27న చివరి తేదీ(Last Date)గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ముఖ్యమైన సమాచారం:

వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్(Wealth Management Services) విభాగంలో మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. హెడ్ వెల్త్ స్ట్రాటజిస్ట్,(Head wealth Strategist) ప్రైవేట్ బ్యాంకర్(Private Banker), పోర్ట్ ఫోలియో రిసెర్చ్ అనలిస్ట్(Port Folio Researcher Analyst), ప్రొడక్ట్ మేనేజర్(Product Manager), ట్రేడ్ రెగ్యులేషన్(Trade Regulation), గ్రూప్ సేల్స్ హెడ్(Group Sales Head) తదితర పోస్టులు(Posts) ఈ విభాగంలో ఉన్నాయి.

ఏదైనా డిగ్రీ(Degree) చేసిన అభ్యర్థులు(Candidates) ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సంబంధిత విభాగంలో అనుభవం (Experience) ఉండాలి. ఇంకా టెక్నీకల్ నాలెడ్జ్ (Technical Knowledge) ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు  చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 22 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

ఇంకా అగ్రి బ్యాంకింగ్(Agri Banking) విభాగంలో 47 అగ్రికల్చర్ మార్కెటింగ్(Agriculture Marketing) ఖాళీలు ఉన్నాయి.సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా(PD/Diploma) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు.

సంబంధితన విభాగంలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలిపారు. అభ్యర్థుల వయస్సు 25 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు చేసుకోండి ఇలా:

  • అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో(Online) అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు ముందుగా బ్యాంకు అధికారిక వెబ్ సైట్(Official Website) https://www.bankofbaroda.in/ ఓపెన్ చేయాలి.
  • తరువాత కెరీర్(Career) ఆప్షన్ ను ఎంచుకోవాలి
  • కరెంటు అప్పార్చునిటీస్(Current Opportunities) ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • తరువాత రిక్రూట్మెంట్ అఫ్  అగ్రికల్చర్  మార్కెటింగ్  ఆఫీసర్ ఫర్ సెంటర్  ఫర్   అగ్రి  – ఫైనాన్స్  మార్కెటింగ్ , రిక్రూట్మెంట్  అఫ్  వేరియస్  పొజిషన్స్   అండర్  వెల్త్  మనగెమెంత్   సర్వీసెస్  డిపార్ట్మెంట్  ఆన్  కాంట్రాక్టు  బేసిస్  రెండు జాబ్ ప్రొఫైల్స్ కనిపిస్తాయి.
  • ప్రతీ ప్రొఫైల్(Profile) కింద అప్లై నౌ(Apply Now) ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ ఆప్షన్లపై క్లిక్ చేసి అప్లై(Apply) చేసుకోవాల్సి ఉంటుంది.