ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ ,మరో సంస్థలో సెకండ్ జాబ్ (Second Job) చేయడాన్ని మెజారిటీ కంపెనీలు ఒప్పుకోవు. ఒక కంపెనీలో పని చేస్తే అదనపు ఆదాయం(Extra Income) కోసం ఇంకో కంపెనీలో కూడా పని చేయడాన్ని మూన్‌లైటింగ్‌ (moonlighting) అంటారు.

వర్క్‌ ఫ్రం హోం (Work From Home) విధానం పెరిగిన తర్వాత ఈ సమస్య తలెత్తింది. ఈ విధానం సరికాదని చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు(Software Companies) ఉద్యోగులకు స్పష్టం చేశాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో(Wipro), ఇన్ఫోసిస్‌(Infosys)తో కూడా ఇదే చెప్పాయి. ఇప్పుడు ప్రముఖ ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ HCL టెక్నాలజీస్ కూడా తమ ఎంప్లాయిస్(Employees) సెకండ్ జాబ్ చేయకూడదని క్లారిటీగా చెప్పింది. అక్టోబరు 12న మూన్‌లైటింగ్‌పై తన వైఖరిని క్లియర్‌గా వ్యక్తపరిచింది.

క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఎల్‌

రీసెంట్  గా హెచ్‌సీఎల్‌ టెక్ (HCL Tech) తన రెండవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తూ ఈ విషయంపై క్లారిటీ(Clarity) ఇచ్చింది. తమ కంపెనీ ‘ద్వంద్వ ఉపాధి (Dual employment)’ని ఆమోదించడం లేదని.. ఉద్యోగులు తమ కాంట్రాక్టులను గౌరవించాలని ఆశిస్తున్నట్లు హెచ్‌సీఎల్‌టెక్ చీఫ్ పీపుల్ ఆఫీసర్(CPO) రామ్ సుందరరాజన్(Ram Sundarajan) చెప్పారు.

ఉద్యోగులు తమ కంపెనీకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌(Exclusive)గా పనిచేయాలని స్పష్టం చేశారు. అదృష్టవశాత్తూ తమ కంపెనీలో సెకండ్ జాబ్ చేసే ఉద్యోగులు ఒకరిద్దరు తప్ప ఎక్కువగా లేరని పేర్కొన్నారు. ఇది తమకు ఒక పెద్ద సమస్య కాకపోవచ్చని చెప్పుకొచ్చారు.

రామ్ సుందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ, హెచ్‌సీఎల్‌ టెక్ (‘HCL Tech) కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ ఎక్స్‌క్లూజివిటీ (Exclusivity) అవసరమయ్యే ఎంప్లాయిస్ కాంట్రాక్ట్‌కి సైన్ అప్(Sing Up) చేస్తున్నారు. ప్రైవసీ, నాన్-సొలిసిటేషన్(Non Solicitation), నాన్‌ కంపీట్(Non Compete) మొదలైన వాటిని ఉద్యోగులు గౌరవించాల్సి ఉంటుంది.

మా ఉద్యోగులు వాటిని గౌరవిస్తారని మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు. ఉద్యోగులు తమ ఖాళీ సమయంలో ఏవైనా ఫ్యాషన్(Fashion) కోసం టైమ్‌ కేటాయించాలని అనుకుంటే అది వారి వ్యక్తిగత ఇష్టాని(Individual Like)కి వదిలేస్తున్నామని చెప్పారు.

అనైతిక చర్యలు

మూన్‌లైటింగ్‌(Moonlighting)ను అనైతిక చర్యగా.. కంపెనీ విలువలు, సంస్కృతికి వ్యతిరేకంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పేర్కొన్న కొద్ది రోజులకే HCL ఈ ప్రకటన చేసింది.

టిసిఎస్ (TCS) యాజమాన్యం తమ ఉద్యోగుల కాంట్రాక్టుల(Contracts)లో ఈ నిబంధనను ఉంచింది. తమ ఉద్యోగులు మరెక్కడా పనిచేయడానికి అనుమతి లేదని ఈ నిబంధన నొక్కి చెబుతోంది. ఇక మూన్‌లైటింగ్ అనేది ఇండియన్ ఐటీ(Indian IT) రంగానికి ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా అట్రిషన్ రేట్లు(Attrition Rates) ఎక్కువగా ఉండటం వల్ల తమ ఉద్యోగులను ఐటీ కంపెనీలు(IT Companies) కోల్పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ సమయంలో రెండు జాబ్‌లు చేసేవారు ఎప్పుడు వేరే కంపెనీకి మారిపోతారోననే భయం నెలకొంది.