భుజం నొప్పి(Shoulder Pain) బాధిస్తుంటే  ఏ పని సక్రమంగా చేయి బుద్ది కాదు. అన్ని జాయింట్లు(Joints) కలిసి వుండే భూజం కదలిక ఇబ్బంది పడితే తట్టుకోవడం చాలా కష్టం. భుజం నొప్పికి ప్రధాన కారణాలు(Reasons), వాటి చికిత్స(Treatment), పరిష్కారాలు(Solutions) ఇప్పుడు తెలుసుకుందాం!

మన శరీరం(Body)లో భుజం ఒక ప్రత్యేకమైన భాగం. ఇందులో అనేక జాయింట్లు కలిసి ఉంటాయి. కండరాలు(Muscles), కీళ్లతో నిర్మితమై ఎన్నో కదలికలు కలిగివుంటాయి. అలాంటి భుజం కొన్ని సార్లు సమస్యలతో కదలేక ఇబ్బంది పడుతుంటాయి. భుజంలో ముఖ్యంగా మూడు ఎముకలు ఉంటాయి.

మోచేతి పై నుంచి వచ్చే హ్యూమరస్ ఎముక(Humorous Bone),భుజంలోని బ్లేడ్ లో వుండే సాకెట్(Socket) అనే రంద్రంలో ఇమడివుంటుంది. సాకేట్ లో రొటేటర్ కప్(Rotator Cup) ఉండటం వల్ల భుజాన్ని అన్ని వైపులా తిప్పడానికి వీలుంటుంది. ఇవి సరిగా లేనప్పుడు లేదా ఇన్ఫెక్షన్(Infections) వచ్చినప్పుడు లేదా టుమౌర్స్(Tumors) వచ్చిన సమయంలో భుజంలో నొప్పి వస్తుంది. భుజం నొప్పికి కీళ్ల అరుగుదల కూడా కారణం కావచ్చు.

జాయింట్ల(Joints)లో కార్టిలేజ్(Cartilage) అనే ద్రవ పదార్థం ఉంటుంది.ఇవి జాయింట్లు కదిలేటప్పుడు వేడి పుట్టకుండా నొప్పి రాకుండా చేస్తుంది. ఒకవేళ ఇది తగ్గిపోతే ఎముకలు ఒకదానికొకటి రాపిడి చేసుకుని బాధిస్తాయి. దీన్నే కీళ్ల అరుగుదల అంటారు. సాధారణంగా వయసు పెరిగే వారిలో ఇది కనిపిస్తుంది.

ఆర్థరైటిస్ వ్యాధి(Arthritis Disease) తో బాధ  పడేవారిలోను భుజం సమస్య(Shoulder Problem) బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి రోగ నిరోధక(Immunity) శక్తి తగ్గిపోతుంది. జాయింట్లలో వుండే లైనింగ్ తగ్గిపోతుంది. దింతో భుజంలో మంట, నొప్పి కలుగుతుంది. అలసట(Tired), బలహీనత(Weakness), ఫ్లూ జ్వరం(Flu Fever) వంటి లక్షణాలు ఉంటాయి. జ్వరం(Fever), డిప్రెషన్(Depression), కళ్ళు(Eyes), నోరు పొడిబారిపోతాయి, ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది.ఆస్టియో ఆర్థరైటిస్(Osteo Arthritis)  వచ్చిన వారిలో భుజాలు, ఇతర జాయింట్లలో నొప్పి విపరీతంగా ఉంటుంది.

ఆక్సిడెంట్స్(Accidents) జరిగిన సమయంలోనూ భుజం నొప్పి తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. మరో వైపు డయాబెటిస్(Diabetes), పక్షవాతం(Paralysis), ఊపిరితిత్తుల వ్యాధులు(Lung Disease) లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్(Rheumatoid arthritis), గుండె జబ్బులు(Heart Disease) వున్నవారు, ఎక్కువగా ఫ్రోజెన్ షోల్డర్(Frozen Shoulder)  అంటారు.భుజం ఎముకలు(Bones) గట్టిపడిపోవడం అనే వ్యాధికి లోనవుతారు.

ఈ వ్యాధి వచ్చిన వారు  భుజాన్ని చిన్నగా కూడా కదపలేరు. కొన్ని సార్లు భుజం గాయపడిన సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. ఛాతి(Chest)లో తీవ్రంగా నొప్పి అనిపించవచ్చు. దీన్ని సాధారణంగా తీసుకోవద్దు, ఇలాంటి లక్షణాలు కనిపించడం హార్ట్ ఎటాక్(Heart attack) కు సంకేతంగా గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.

కాబట్టి భుజం నొప్పిలను  సులభంగా తీసుకోకపోవడమే మంచిది. భుజానికి సాధారణ సమస్యలైతే ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్(Bacterial Infection) అయితే యాంటీ బయోటిక్స్(Anti Biotic) ద్వారా వైద్యులు చికిత్స(Treatment) అందిస్తారు. ఒకవేళ టుమౌర్స్(Tumors) ఉంటే సర్జరీ(Surgery) ద్వారా తీసేస్తారు. ఒకవేళ నరాలకు సంబంధించిన సమస్యలైతే వెంటనే వైద్యుల(Doctors)ను సంప్రదించాలి లేని పక్షంలో ఇది మెదడు(Brain)లోని కణాల(Cells)ను దెబ్బ తీసే అవకాశం వుంది.

తద్వారా పార్కిన్న్స్ వ్యాధి(Parkinson’s Disease)కి కారణం కావచ్చు. భుజం నొప్పి రాగానే హాయిరాన పడిపోవద్దు అది ఎందువల్ల వచ్చింది కారణాలేంటో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వీలైతే వైద్యుడిని సంప్రదించాలి. భుజం నొప్పి(Shoulder Pain) కారణాలేనటనేది ముందుగా అన్వేషించండి.

అవసరమైతే టెస్టులు(Tests) చేయించుకోండి. వైద్యుల సూచనలతో,సలహాలతో మందులు వాడి ఆరోగ్యంగా జీవించండి.