బిగ్ బాస్(Big Boss) షో ద్వారా ఫేమస్ అయిన కంటెస్టెంట్స్(Contestants)కి చాలా ఆఫర్లు(Offers) వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాజల్, లహరి ఇద్దరూ కూడా కొత్త అవతారం తో మన ముందుకు వచ్చారు.

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఇలా కొత్త అవతారం(new incarnation)తో కనిపించడం ఇదే మొదటి సారి. నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమా ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం జరిగింది.

ఈ ఈవెంట్‌(Event)ను కాజల్ మరియు లహరి(Kajal and Lahari) కలిసి హోస్ట్(Host) చేసారు.

బిగ్ బాస్ ఇంట్లో ఉండగానే లహరి ఇలాంటి ఆఫర్స్ ని అందుకోవడానికి ప్లాన్ చేసుకుందని వార్తలు కూడా వినిపించింది. ఇదే విషయాన్ని యాంకర్ రవి చెప్పడం జరిగింది. యాంకర్ రవి తనతో క్లోజ్ గా ఉంటానని చెప్పిన మాటలు యాంకర్(Anchor) గా అవకాశాలు తెచ్చిపెడుతుందని బిగ్ బాస్ హౌస్(Big Boss House) లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి లహరి ఇప్పుడు తాను కోరుకున్నట్లే యాంకర్‌(Anchor)గా మారింది.

కింగ్ నాగ్ నటించిన బంగార్రాజు మూవీ(Bangarraju Movie) ఈవెంట్‌కు లహరి హోస్ట్(Host) గా మారింది. గతంలో నాగార్జున, నాగ చైతన్యలను లహరి ప్రత్యేక ఇంటర్వ్యూ(Special Interview) చేసింది.

ఇక కాజల్‌కు ఇలాంటి ఈవెంట్లు మరియు ఇంటర్వ్యూలు కొత్త ఏమీకాదు. అయితే లహరి, కాజల్ ఇలా కలిసి ఇలా ఒకే ఈవెంట్ లో సందడి చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఇద్దరి హోస్టింగ్(hosting) పై జనాలు నోరు విప్పనున్నారా?.

సుమని తీసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తు(Future)లో వీరిద్దరికీ ఇలాంటి ఆఫర్లు(Offers) వస్తాయా? లేదా? అన్నది మున్ముదు తెలియాల్సివుంది.

ఈ ఇద్దరి హోస్టింగ్ ని ప్రేక్షకులు(Audience) ఆదరించాలి అని కోరుకుందాం. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్(Annapurna Studios Pvt.Ltd, Banner) మరియు జీ స్టూడియోస్ (G Studios) పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున సహ నిర్మాతగా (Producer) వ్యవహరించారు.

సంక్రాంతి (Sankranthi) సందర్భంగా జనవరి 14న(January 14th) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.