దర్శకుడు రాజమౌళి(Rajamouli) పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్(Periodic Action Entertainer) గా రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్(RRR).

సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్(Block Buster Collections) తో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)లు హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్(Multi starrer) లో ఒకరు కొమరం భీమ్(Komaram Bheem), మరొకరు అల్లూరి సీతారామరాజు(Alluri Seetharamaraju) పాత్రలు చేశారు.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt), ఒలీవియా మోరిస్(Olivia Morris) హీరోయిన్స్(Heroines) గా నటించారు. అజయ్ దేవ్ గణ్ (Ajay Devgan) కీలక పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.

మార్చి 25న ప్రపంచ వ్యాప్తం(World Wide)గా ఈ చిత్రం విడుదలైంది.  భారీ అంచనాల(Huge Expectations)తో థియేటర్ల(Theaters)లోకి వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ, ప్రస్తుతం అదే దిశగా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్(Box Office) ను ఊపేస్తోంది.

మొదటి వారం(First Week) ముగిసే నాటికి ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్(World Wide) గా రూ.710 కోట్ల గ్రాస్(710 Crores Gross) రాబట్టింది. ఇక ఇండియా(India) వరకు చూస్తే రూ.560 కోట్ల గ్రాస్(560 Crores Gross) దాటేసింది.

మరో రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ కు పోటీనే లేదు. అలాగే హిందీలోనూ రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి తెలుగు మూవీ సత్తాను చాటుతూ కొత్త రికార్డు(New Record)ను సృష్టించింది(Created) ఆర్ఆర్ఆర్. తాజాగా RRR చిత్రం Book My Showలో అత్యధిక రేటింగ్ పొందిన చిత్రంగా నిలిచింది.

ఇప్పటి వరకు 571 కే(517K) కి పైగా ఆర్ఆర్ఆర్ మూవీకి రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇప్పటి వరకు ఏ సినిమాకైనా ఇదే అత్యధిక రేటింగ్(Highest Rating) అని చెప్పాలి. ఈ పాన్ ఇండియా మూవీ 90 శాతం మంచి రేటింగ్ ను సాధించిన చిత్రంగా టాప్(top) లో దూసుకుపోతోంది.

ఇలా జక్కన్న డైరెక్షన్ ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ క్రియేట్(Sensation create) చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు (Praised)దక్కించుకుంటోంది.