వర్సటైల్ స్టార్ నితిన్ నటించిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam)..

పొలిటికల్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ అయినా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ  మూవీకి ఎడిటర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలనే నితిన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన లుక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. ఇక ఈ మూవీలో యంగ్  హీరోయిన్  కృతి శెట్టి నటిస్తోంది.

ఇక ఈ బ్యూటీ కూడా బ్యాక్ టూ బ్యాక్ వరుసగా విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ది వారియర్’ మూవీతో అలరిస్తోంది. లేటెస్ట్ గా  కృతి శెట్టి నటిస్తున్న మరో చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’

ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఎప్పటికప్పుడు తాజాగా  అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమై రెస్పాన్స్ వస్తోంది.

తెలుగు హీరోయిన్, గ్లామర్ బ్యూటీ అంజలి ‘రా రా రెడ్డి’ స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా  నటుడు సముద్రఖని (Samutrikhani) ఫస్ట్ లుక్ ను విడుదల  చేశారు. తాజాగా కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను అదిరిపోయే పోస్టర్ తో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో  కృతి శెట్టి  ‘స్వాతి’ పాత్రలో నటిస్తోంది. విడుదలై పోస్టర్ లో  ఈ యంగ్ బ్యూటీ  చాలా స్టైలిల్ గా కనిపిస్తోంది. సన్ గ్లాసెస్ పెట్టుకొని ట్రెండీ వేర్ ధరించి, కాఫీ తాగుతూ కొంటె చూపుతో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ చిత్రాన్ని నితిన్  సొంత ప్రొడక్షన్  శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పైనే నిర్మిస్తున్న విషయం తెలిసిందే.    హీరోయిన్లుగా  కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. ఆగష్టు 12న సినిమా థియేటర్లో విడుదల కానుంది.