అగ్నిపథ్(Agni path) ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జోన్ల వారీగా ఆర్మీ ర్యాలీ తేదీలను ఆర్మీ అధికారులు వెల్లడించారు.

ఇండియన్ ఆర్మీ(Indian Army) అగ్నిపథ్ బెంగళూరు జోన్, అంబాలా జోన్, చెన్నై జోన్, జైపూర్ జోన్, జబల్‌పూర్ జోన్ దానాపూర్ జోన్ తదిత జోన్ల వారీగా ఇండియన్ ఆర్మీ ర్యాలీ రిక్రూట్‌మెంట్(Indian Army Recruitment) ఉంటుందన్నారు.

ఇండియన్ ఆర్మీ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు.. అగ్నివీర్(Agni Veer) అప్లికేషన్ ఫారమ్ తో పాటు.. తప్పనిసరిగా కొన్ని పత్రాలను సమర్పించాలి.

ఆ పత్రాల జావితా ఇలా ఉంది. 10/12వ తరగతి మార్కుల మెమో (Marks Memo), నివాస ధృవీకరణ పత్రం (Resident Certificate), బదిలీ సర్టిఫికేట్ (Transfer Certificate), NCC సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఆధార్ కార్డు (Adhaar Card)ను తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పటికే దరఖాస్తులు(Application) సమర్పించడానికి నోటిఫికేషన్ రిలీజ్(Notification Release) అయిన విషయం తెలిసిందే.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ(Last Date) 30 జులై(July 30th) 2022గా పేర్కొన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే https://joinindianarmy.nic.in/Authentication.aspx వెబ్ సైట్(Website) ద్వారా చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల యొక్క వయస్సు(Age) 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

దీనికి పురుషులు మరయు స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.పురుషులకు ఎత్తు 165 సెంమీ కాగా.. స్త్రీలకు 157సెంమీలుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ర్యాలీ తరువాత అభ్యర్థులకు మెడికల్ టెస్ట్(Medical Test) ఉంటుంది. దీనిలో నెగ్గితే.. రాత పరీక్ష(Written Test)ను నిర్వహిస్తారు. రాత పరీక్ష కోసం ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్(Indian Agni Veer Admit Card) జారీ చేయబడుతుంది.

ఈ రాత పరీక్ష అనేది 16 అక్టోబర్ 2022న నిర్వహించనున్నారు. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్(IAAR) దశల యొక్క అన్ని రౌండ్‌లను క్లియర్(Clear) చేసిన దరఖాస్తుదారులకు అధికారులు ‘జాయినింగ్ లెటర్'(Joining Letter) ఇస్తారు.

జోన్ల వారీగా ఆర్మీ ర్యాలీ తేదీలు వివరాలు

  • 10 ఆగస్టు 2022 నుండి 22 డిసెంబర్ 2022 వరకు – బెంగళూరు జోన్
  • 10 ఆగస్టు 2022 నుండి 05 డిసెంబర్ 2022 వరకు – జలందర్ జోన్
  • 12 ఆగస్టు 2022 నుండి 10 డిసెంబర్ 2022 వరకు – అంబాలా జోన్
  • 13 ఆగస్టు 2022 నుండి 25 నవంబర్ 2022 వరకు – చెన్నై జోన్
  • 13 ఆగస్టు 2022 నుండి 12 డిసెంబర్ 2022 వరకు – జైపూర్ జోన్
  • 13 ఆగస్టు 2022 నుండి 11 డిసెంబర్ 2022 వరకు – పూణే జోన్
  • 19 ఆగస్టు 2022 నుండి 10 డిసెంబర్ 2022 వరకు – లక్నో జోన్
  • 01 సెప్టెంబర్ 2022 నుండి 27 నవంబర్ 2022 వరకు – జబల్‌పూర్ జోన్
  • 01 సెప్టెంబర్ 2022 నుండి 19 డిసెంబర్ 2022 వరకు – కోల్ కత్తా జోన్
  • 05 సెప్టెంబర్ 2022 నుండి 20 డిసెంబర్ 2022 వరకు – దానాపూర్ జోన్
  • 07 సెప్టెంబర్ 2022 నుండి 07 డిసెంబర్ 2022 వరకు – షిల్లాంగ్ జోన్

07 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు ఐఆర్ఓ ఢిల్లీ కాంట (IRO Delhi Cont) పరిధిలో.. డార్జిలింగ్ అండ్ కాలింగ్ పాంగ్(Darjeeling and Kalling Pang) జిల్లాలో 01 నవంబర్ నుంచి 05 నవంబర్ వరకు.. జీఆర్డీ కున్రాఘడ్ మరియు జీఆర్డీ గూమ్ పరిధిలో 25 ఆగస్టు నుంచి 28 సెప్టెంబర్ వరకు ర్యాలీలు నిర్వహించనున్నారు.

వీటిలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ర్యాలీ తేదీలు ఇలా ఉన్నాయి.

చెన్నై జోన్(Chennai Zone) పరిధిలోకి ఈ తెలుగు రాష్ట్రాలు వస్తాయి. అందులో వైజాగ్(Vizag) లో 13 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. గుంటూరు (Guntur), నెల్లూరు (Nellore)లో 15 సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్ వరకు, సికింద్రాబాద్(Secundrabad), సూర్యాపేట(Suryapet)లో 15 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు.