బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) ఆరోవారం విజయవంతంగా పూర్తయింది. ఈ వారం ఇంట్లో  గొడవలు, ఫన్, ఎనెర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ లో ట్విస్టులు జరిగాయి.

లోబో ఎలిమినేట్ అయి ఉంటాడని ఇంటి సభ్యులు(House mates) అనుకుంటున్నారు. కానీ లోబో సీక్రెట్ రూంలోకి వెళ్ళాడు అనే విషయం కంటెస్టెంట్స్ కి తెలీదు..

ఇక నిన్నటి  ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్(Eliminate) అయ్యారు.

సండే ఫండే కాబట్టి  నాగార్జున బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు కొన్ని గేమ్స్  ఆడించాడు. మరి అవన్నీ ఇక్కడ చూసేద్దాం.

లోబో సీక్రెట్ రూంలోకి వెళ్లాడని తెలియక హౌస్ మేట్స్(House mates) బాగా ఎమోషనల్(Elimination) అయ్యారు .ఇక రవి, విశ్వ, మానస్‌లు స్మోకింగ్ ఏరియాలో డిస్కషన్ పెట్టారు .

రవి ఎమోషనల్ అవుతుంటే మానస్, విశ్వ ఓదార్చారు.

రవి తనకు లోబోకు ఉన్న స్నేహం గురించి చెప్పాడు. లోబో తండ్రి మరణించిన విషయాన్ని గుర్తు చేశాడు. రోడ్డు మీద అలా నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు.

ఆ విషయం తెలిసి నాగోల్ నుంచి మేం ఇద్దరం వచ్చామని, మూడు రోజులు వాడితోనే ఉన్నాను.. అది మా రిలేషన్ అంటూ రవి ఎమోషనల్ అయ్యాడు.

ఇక తన దైన స్టైల్ లో డాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చిన నాగ్. హౌస్ మేట్స్(House mates) తో గేమ్ ఆడించాడు.

ఈ గేమ్ లో హౌస్ మేట్స్  రెండు టీంలుగా విడిపోయారు. పిప్పిప్పీ అని ఊదుకుంటూ పాటలను కనిపెట్టాల్సి వుంటుంది. అయితే  టీం ఏ సభ్యులుగా సరి, షన్ను, కాజల్, శ్రీరామ, ప్రియాంక, విశ్వలను ఫిక్స్ చేశాడు.

రవిని సంచలకుడుగా నియమించాడు. మిగిలిన వారందరినీ టీం బీ సభ్యులుగా ఎంపిక చేసాడు నాగ్.

అయితే ఈ గేమ్(Game) లో టీం ఏ అద్భుతంగా ఆడి విన్ అయ్యారు. ఈ గేమ్ లో త్వరగా, ఎక్కువగా పాటలను గెస్ చేసిన కాజల్. ఆ తరువాత ఆట ముగిసే టైం కి నాగార్జున నలుగురు సేఫ్(Safe) అయినట్టు ప్రకటించాడు.

ఇక మరో టాస్క్(Task) ఇచ్చి బొమ్మల ద్వారా ప్రియాంక, షన్నులు సేఫ్ అయినట్టు ప్రకటించాడు.

పిగ్గీ బ్యాంకు (Piggy Bank)లను పగలగొట్టడంతో శ్రీరామ్, సన్నీలు సేఫ్ అయినట్టు తెలిపాడు. ఆ తరువాత కళ్లకు గంతలు కట్టి మరో ఆట ఆడించాడు.

కళ్లకు గంతలు కడితే మిగతా వాళ్లంతా డైరెక్టన్స్ చెప్తూ ఉంటే  హూలా హూప్స్ మధ్యలో పెట్టిన బోన్‌ను పట్టుకోవాలి. అలా ఎవరు ముందు చేస్తే ఆ టీం గెలిచినట్టు చెప్పేశాడు.

మొదటి గేమ్ లో ఏ టీమ్స్ తో అయితే ఆడించాడో ఆ టీమ్స్ తో నే ఈ గేమ్ కూడా ఆడించాడు నాగ్.

టీం ఏ సభ్యులు చాకచక్యంగా ఈ ఆటను ఆది గెలిచారు. జెస్సీ,ప్రియాంక, షన్ను, సిరిల ఆటతో టీం ఏ ముందంజలోకి వచ్చింది. ఈ ఆట మధ్యలోనే మరో ఇద్దరూ సేఫ్ (Safe) అయినట్టు ప్రకటించిన నాగ్ (Nag).

కుక్క బొమ్మను ఇచ్చి అది ఎవరి చేతిలో అయితే అరవకుండా సైలెంట్‌గా ఉంటుందో వారే సేఫ్ అయినట్టు తెలిపాడు. ఇందులో  విశ్వ, రవి ఇద్దరూ కూడా సేఫ్ అయ్యారు.

ఆ తరువాత సిరి, జెస్సీ, శ్వేతాల్లో జెస్సీ సేఫ్(safe) అయ్యాడు. మిగిలిన ఇద్దరిని గార్డెన్ ఏరియాకు రమ్మన్నాడు నాగ్.

సుత్తి తో   అక్కడున్న డబ్బాను పగలగొట్టమన్నాడు. అందులో వచ్చిన మరో బాక్సును లివింగ్ ఏరియాకు తీసుకురమ్మన్నాడు.

ఆ డబ్బాలో సిరి పిక్  ఉండటంతో సిరి సేఫ్ అవ్వగా, శ్వేతా ఎలిమినేట్ అయింది. దింతో  ఆనీ మాస్టర్ ఎమోషనల్(emotional) అయ్యి  ఏడ్చేసింది. హౌస్ మేట్స్(house mates) గుడ్ బాయ్ చెప్పి బయటకు వచ్చిన శ్వేత.

ఇక స్టేజీ మీద‌కు వ‌చ్చిన శ్వేత‌తో సైన్ బోర్డు తో కంటెస్టెంట్స్(contestants) సూట్ అయ్యే సైన్ ని చేపమంటూ గేమ్  ఆడించాడు నాగ్‌.

ర‌వి వెరీ స్మార్ట్ అని, అత‌డికి గేమ్ పరంగా  దూరంగా ఉండాల‌ని కంటెస్టెంట్ల‌కు హెచ్చరిక చేసింది  శ్వేత‌.

హౌస్‌లో మాన‌స్ డేంజ‌ర్ అని అభిప్రాయ‌ప‌డింది, త‌క్కువ మాట్లాడి ఎక్కువ ఆడాల‌ని యానీ మాస్ట‌ర్‌కు అడ్వైజ్ ఇచ్చింది. నిన్ను టాప్ 5లో చూడాల‌నుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చింది.

శ్రీరామ్‌కు త్వ‌ర‌గా రీచార్జ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

అత‌డిని టాప్ 5లో చూడాల‌నుకుంటున్నానంది. విశ్వ ఆట లో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నదని అన్నది. కాక‌పోతే టాస్కు (Task)ల్లో ట‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తున్నాడ‌ని, అత‌డిని చూస్తుంటే విశ్వ ఒలంపిక్స్‌ కు కూడా వవెళ్లొచ్చని  చెప్పుకొచ్చింది శ్వేత‌.

కాజ‌ల్ డెడ్ ఎండ్ (Dead End)అని, మాట మార్చి యూటర్న్ తీసుకుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

శ్రీరామ్‌ శ్వేత కోసం ముస్తాఫా ముస్తాఫా పాట పాడి అందరిని ఏడిపించాడు. తరువాత  చాలా బాధపడుతూ  అంద‌రి నుంచి  వీడ్కోలు తీసుకుంది.