ప్రస్తుతం తెలుగు సినిమాల లో లేటెస్ట్ సినిమా పేరు ఆదిపురుష్ కాగా ఈ చిత్రంతో రామాయణం పేరు కూడా విస్తృతంగా వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టాపిక్ లోనే గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా రామాయణం విషయంలో వైరల్ గా మారింది. రామాయణం మూవీ కి చరణ్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు అని అనేక మంది మాట్లాడుకున్నారు.

ఇదిలా ఉండగా చరణ్ తో రామాయణం అంటూ ఓ క్రేజీ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. మరి అది కూడా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి గాను చరణ్ తో సహా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేయనున్నారు అంటూ ఊహించని టాక్ వైరల్ గా మారింది.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో రాముడు సీత పాత్రలకి రామ్ చరణ్ , సాయి పల్లవి ల పేర్లు చాలా ఎగ్జైటింగ్ గా మారాయి. అయితే ఈ టాక్ ఎంత వరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం ఈ కాంబినేషన్లో అంచనాలు పీక్స్ లో ఉంటాయని మాత్రం చెప్పొచ్చు.