ప్రముఖ ఫ్యాషన్ ఈ కామర్స్ (E Commerce) సంస్థ మింత్రా (Myntra) నిరుద్యోగులకు శుభ వార్త ప్రకటించింది. ఈ పండుగ సీజన్ లో 16 వేల మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు తెలిపింది.

డెలివరీ(Delivery), లాజిస్టిక్స్(Logistics), వేర్ హౌజ్ హ్యాండ్లింగ్(Ware House Handling) తదితర విభాగాల్లో ఈ నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో మొత్తం 11 వేల నియామకాలను చేపట్టింది మింత్రా. ప్రస్తుతం నియామకాలు చేపట్టనున్న 16 వేల ఉద్యోగాల్లో 10 వేల మందికి నేరుగా ఉద్యోగవకాశాలను కల్పించనుండగా.. మరో 6 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది.

మింత్రా ప్రస్తుతం చేపట్టిన నియామకాల్లో సార్టింగ్ (Sorting), ప్యాకింగ్ (Packing), పికింగ్ (Picking), లోడింగ్ (Loading), అన్ లోడిండ్ (Un Loading), డెలివరీ (Delivery), రిటర్న్ ఇన్స్పెక్షన్ (Return Inspection) కు సంబంధించినవని సంస్థ తెలిపింది. గత జూన్ లో మింత్రా 50 లక్షల వస్తవులను కేవలం ఒకే రోజు అమ్మి రికార్డ్ సృష్టించి(Created Record)న సంగతి తెలిసిందే.