ఇన్‌ఫినిక్స్(Infinix) స్మార్ట్‌ ఫోన్ ఇప్పుడు నోట్ 11 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్ కింద నోట్ 11 మరియు నోట్ 11 ప్రోతో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లు అద్భుతమైన డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి మరియు మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్‌తో పాటు 8GB RAM తో శక్తిని పొందుతాయి. నోట్ 11 సిరీస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 33W సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

ఇన్‌ఫినిక్స్(Infinix) గతంలో హాట్ 11 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ బడ్జెట్ కేటగిరీలో హాట్ 11, హాట్ 11 ఎస్ లను భారతదేశంలో విడుదల చేసింది. ఇన్‌ఫినిక్స్ హాట్ 11S మెడిటెక్ హీలియో G88 ప్రాసెసర్‌తో వస్తుంది, ఇది AnTuTu పరీక్షలో 238000 స్కోర్ చేసింది. ఆసక్తికరంగా ,రెడ్ మీ (Redmi 10) ప్రైమ్‌కు శక్తినిచ్చే అదే ప్రాసెసర్ మేడి టెక్ హీలియో ( MediTek Helio) G88. ఇన్ఫినిక్స్ హాట్ 11s కూడా ఆకట్టుకునే డిస్‌ప్లే(Display)ను కలిగి ఉంది, ఇది 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

ఇన్‌ఫినిక్స్ నోట్ 11 మరియు నోట్ 11 ప్రో విషయానికి వస్తే, ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ధరలు ఇంకా వెల్లడించలేదు. స్మార్ట్‌ ఫోన్‌లు “నిర్దిష్ట మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి” అని ఇన్‌ఫినిక్స్ చెప్పింది, కానీ స్మార్ట్‌ ఫోన్‌ల ధర గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. నోట్ 11 సెలెషియల్ స్నో, గ్లేసియర్ గ్రీన్ మరియు గ్రాఫైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది, అయితే నోట్ 11 ప్రో హేజ్ గ్రీన్, మిస్ట్ బ్లూ మరియు మిథ్రిల్ గ్రే కలర్ ఆప్షన్‌లలో ఉంది. భారతదేశంలో స్మార్ట్‌ ఫోన్‌లు ప్రారంభించబడుతాయో లేదో ఇన్‌ఫినిక్స్ ప్రకటించలేదు. ఈ ఫోన్  యొక్క విక్రయ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు

ఇన్ఫినిక్స్ నోట్ 11, నోట్ 11 ప్రో: స్పెసిఫికేషన్‌లు

ఇన్ఫినిక్స్ నోట్ 11 6.95-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఐపిఎస్ ఎల్‌సిడిని 1,080×2,460 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 120 రిఫ్రెష్ రేట్ మరియు 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G96SoC మరియు 8GB RAM మరియు 128GB స్టోరేజ్ ఉన్నాయి, వీటిని మైక్రో SD కార్డ్ ఉపయోగించి విస్తరించవచ్చు. ఇన్‌ఫినిక్స్ నోట్ 11 ప్రో ర్యామ్ ఎక్స్‌టెన్షన్(Extension) ఫీచర్‌తో వస్తుంది, ఇది వినియోగదారులు ర్యామ్‌ని 11 జిబికి విస్తరించేందుకు అనుమతిస్తుంది. ఈ పరికరంలో గ్రాఫిన్ ఫిల్మ్(Graffin Film) ఉపయోగించారు. ఇది చిప్‌సెట్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.ఈ డిస్‌ప్లే TUV రైన్ఇన్లాండ్ (Rheinland) సర్టిఫికెట్‌తో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే, నోట్ 11 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ 30x ఆప్టికల్ జూమ్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో వస్తుంది. ఇక ఇన్ఫినిక్స్ నోట్ 11 స్పెసిఫికేషన్ గురించి చూస్తె, దాని స్పెసిఫికేషన్‌లు కూడా ఇన్‌ఫినిక్స్ నోట్ 11 ప్రో లాగా ఉంటాయి. కానీ బ్యాక్ ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ లెన్స్(Mega pixel lens) తోనూ వస్తుంది.