భారత మీడియా(Bharath media)లో అతి ముఖ్య విలీన అగ్రిమెంట్ దాదాపు ఖరారైంది. ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌…(ZEE Entertainment Enterprises Limited) సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌(Sony pictures networks) ఇండియాతో విలీన ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ ప్రకటించింది. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం మాత్రమే వాటాలుంటాయి. మిగిలిన 52.93 శాతం వాటా ఎస్‌పీఎన్‌ఐకు చెందుతాయి. ఒప్పందంలో భాగంగా విలీన సంస్థలో సోనీ 1.575 బిలియన్‌ డాలర్లు, అంటే సుమారు రూ.11,600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.  ఒప్పందం ప్రకారం విలీన సంస్థ నిర్వహణ ను ఐదేళ్ల పాటు జీ ల ఎండీ, సీఈవో పునీత్‌ గోయెంకా చేపట్టనున్నారు.

దీంతో ఇటీవల కొద్ది రోజులుగా జీ యాజమాన్య మార్పుపై చెలరేగిన వివాదాలకు చెక్‌ పడే వీలున్నట్లు పరిశ్రమవర్గాల సమాచారం  విలీన సంస్థలో మెజారిటీ బోర్డు మేంబర్లను  సోనీ(Sony) నియమించనుంది. ఓఎఫ్‌ఐగ్లోబల్‌ చైనా ఫండ్‌తో కలిపి 17.9 శాతం వాటా కలిగిన ఇన్వెస్కో డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ గత వారం పునీత్‌ గోయెంకాతోపాటు.. జీ బోర్డులోని మరో ఇద్దరు సభ్యులను తొలిగించమంటూ  అత్యవసర సమావేశం కోసం డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజా గా ఈ ఒప్పంద  నేపథ్యంలో జీలో తలెత్తిన సంక్షోభం ముగియడంతోపాటు.. దేశీయంగా సోనీ బిజినెస్‌ (Sony Business) మరింత విస్తరించనుంది.

ఇరు కంపెనీలు ఇక నుంచి డిజిటల్‌ అసెట్స్‌, లీనియర్‌ నెట్‌వర్క్స్‌, ప్రోగ్రాం లైబ్రరీస్‌, ప్రొడక్షన్‌ ఆపరేషన్స్‌ వంటి వ్యవహారాలను సమంగా పంచుకోనున్నాయి. అగ్రిమెంట్‌ను అమలు చేయడానికి ముందు చేయాల్సిన వ్యవహరాలకు 90 రోజుల గడువు నిర్దేశించారు. అదే సమయంలో జీ ప్రమోటర్ల కుటుంబం.. 4శాతంగా ఉన్న ప్రస్తుత వాటాల్ని, 20శాతానికి పెంచుకునేందుకు ఛాన్స్ దొరికింది. ప్రస్తుత ఈక్విటీ విలువల ఆధారంగా విలీన నిష్పత్తి జీల్‌కు అనుగుణంగా 61.25 శాతంగా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇక షేర్ల కు కూడా రెక్కలు వచ్చాయి,ఇన్వెర్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో జీల్‌ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ.334 వద్ద ముగిసింది. ఒక దశలో గరిష్టంగా రూ. 355ను సైతం ఎక్కువైంది, ఇది 52 వారాల గరిష్టంకాగా..రూ.281 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ఇంట్రాడేలో బీఎస్‌ఈలోనూ 39 శాతం జంప్‌చేసి రూ.355 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ వేల్యూ  రూ.7,824 కోట్లు ఎగసి రూ.32,379 కోట్లకు చేరింది. ఈ విలీనం వల్ల  అమాంతం పెరిగిన గ్రూప్ షేర్లు. జపాన్‌ దిగ్గజం సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌(Sony group corporation)కు అనుబంధ సంస్థ ఎస్‌పీఎన్‌ఐతో విలీన వార్తల నేపథ్యంలో జీ గ్రూప్‌(Zee group)లోని ఇతర కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. జీ లెర్న్‌ 13 శాతంపైగా ఎగసి రూ. 16 వద్ద నిలవగా.. జీ మీడియా 5 శాతం బలపడి రూ.12.30 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

మూడు దశాబ్దాలుగా కస్టమర్ల కు చేరువైన జీ నెట్‌వర్క్‌ (Newtwork)కు కంటెంట్‌ క్రియేషన్‌లో మంచి అనుభవం ఉంది. గేమింగ్‌, స్పోర్ట్స్‌ వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌(Entertainment) రంగాల్లో సోనీ మంచి విజయల బాటలో నడుస్తోంది. ఇరు సంస్థల కలయుకతో ఏర్పడే సంస్థకు వ్యూహాత్మక విలువతో పాటు భారీ ఆదరణ పొందుతుందని  అనుకుంటున్నారు .