బిగ్ బాస్ సీజన్ 5(Big boss season 5) గత రెండు వారల కంటే మూడో వారం లో హౌస్ మేట్స్(Housemates) మధ్య గొడవలు, వాదనలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ప్రియా లహరి ల మధ్య నడిచిన అరుగుమెంట్ అయితే ఒకరిని  మించి ఒక్కరు నోరుపారేసుకున్న విషయం తెలిసందే. అయితే హౌస్ మేట్స్ ని కూల్ చేయడానికి అన్నట్టు హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయి అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో లవ్ ట్రాక్ లు, రొమాంటిక్ మసాలా కూడా కాస్త ఉండేలా కంటెంట్ ని ఇచ్చారు. హౌస్ మేట్స్ కూడా ఈ టాస్క్ బాగా ఎంజాయ్ చేసారు. ఇక యాంకర్ రవి కి బిగ్ బాస్ నేరుగా కెప్టెన్సీ పోటీదారుడయ్యే ఛాన్స్ ఇస్తూ ఒక సీక్రెట్ టాస్క్  ఇచ్చాడు. ప్రియా నెక్లెస్ దొంగలించించాలని చెప్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ను రవి చాలా సులభంగా పూర్తి చేసాడు. అయితే ఇదంతా తెలియని ప్రియా తన జవెల్లరీ బాక్స్ చూసారా అని ఇల్లంతా వెతుకుతుంది.

ఇక టాస్క్ విషయానికి  వస్తే  లహరి (lahari) ని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఎన్.ఆర్.ఐ.పాత్రలో  నటించిన శ్రీరామ్. ఒకే సమయంలో  అటు హమీద, ఇటు సిరిలతో లవ్ ట్రాక్ నదీప్సితూనే లహరి ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు శ్రీ రామ్.

ఇక లహరిని ప్రేమించిన పక్కింటి కుర్రాడు గా  మానస్… పెద్దలు కుదిర్చిన పెళ్ళిని చెడగొడితే… పెళ్ళిళ్ల పేరయ్య షణ్ముఖ్ (shanmukh) కు ఎంత డబ్బైనా ఇస్తానని బేరమాడుతాడు మానస్ (Manas). ఇక షణ్ముఖ్, శ్వేతా, లోబో ల మధ్య జరిగే  ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఫన్నీ గా అనిపిస్తుంది.

టాస్క్‌ లో భాగంగా.. లోబోకి హ్యాండ్ ఇచ్చి మనిద్దరం చెక్కులతో చెక్కేద్దాం శ్వేతా.. మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం అని మాట కలిపిన షణ్ముఖ్.. ఆ తరువాత లోబో కూడా శ్వేతాకి ఐ లవ్యూ చెప్పి లైన్‌లో పెట్టాడు..

ఇంతలో షణ్ముఖ్ పిలవడంతో ఏంటండీ గురువుగారూ అని వచ్చాడు లబో.. ‘గురువు గారూ గురువు గారూ అని నాకే వెన్ను పోటు, వేస్తావా అని కోపం గా వెళ్ళిపోతాడు. శ్వేతా షణ్ముఖ్ వెంట శాస్త్రి గారు అంటూ వెళ్తుంది.

అప్పటిదాకా సరదాగా జరిగిన స్కిట్ కాస్త సీరియస్ అయింది. నిన్ను  ఏమైనా అందాం అంటే పెయింట్ వేసి కొడతావని సరదాగా అన్న షణ్ముఖ్.

దాంతో  శ్వేతకి కోపం రావడంతో సీరియస్ అవుతుంది . ఇట్స నాట్ జోక్ అంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. దీంతో షణ్ముఖ్.. నోటి దురద అని బాధపడుతూ.. శ్వేతా దగ్గరకు వెళ్లి.. అనుకోకుండా నోటిలోనుంచి ఆ మాట వచ్చేసిందని చెప్తూ.. చేతులు జోడించి సారీ  చెప్పాడు.

కానీ హర్ట్ అయినా శ్వేతా నాకు ఐదు నిముషాలు బ్రేక్ కావాలని చెప్తుంది. ‘నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు’, అంటూ లోబో షణ్ముఖ్ కు సపోర్ట్ చేస్తాడు … కానీ షణ్ముఖ్ మాత్రం శ్వేతకు సారీ చెప్పడం విశేషం.

ఇక సోమవారం వాల్  అఫ్ షేమ్ లో ప్రియా లహరిలు ఒకరి పై ఒక్కరు మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ఈ స్కిట్ లో అత్త,కోడళ్ళుగా.. బాగా పండించారు. అందులో భాగంగానే ప్రియ, లహరితో  కాళ్ళకు దండం పెట్టించుకోవడం, కాళ్ళు పట్టించుకోవడం లాంటివి చేయించడం కొసమెరుపు.

మొత్తానికి స్కిట్ లో భాగం గా నడిచిన లవ్ ట్రాక్  ల నుంచి  చివరకు ఎవరూ ఊహించని విధంగా ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ శ్రీరామ్ – లహరి వివాహంతో కథకి ఎండ్ కార్డు పడింది .

‘రారండోయ్ వేడుక చూద్దాం,’ సినిమా టైటిల్ పాట తో ఈ స్కిట్ కు ముగింపు పలికిన బిగ్ బాస్.

ఆ తరువాత  బిగ్ బాస్ కెప్టెన్సీ (Bigboss Captancy) కోసం ఈ స్కిట్ లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకు కెప్టెన్ గా అవకాశం ఇవచ్చని  లోబో, షణ్ముఖ్ డిస్కషన్ పెడతారు. అంతే కాకుండా పెర్ఫార్మన్స్ చూస్తే మనకే రావాలని షణ్ముఖ్ లోబో తో అంటాడు. అయితే… కొందరు మాత్రం అందరికంటే రవి పెర్ఫార్మెన్స్ బాగుందనే అభిప్రాయానికి వచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లోని సభ్యుల పెర్ఫార్మెన్స్ గురించి అంత పట్టించుకుంటాడో లేదో తెలియదు కానీ వాళ్ళు మాత్రం రకరకాల ఊహాగానాలు మొదలు పెట్టేశారు.

అందరూ నిద్రలోకి జారుకున్న, తరువాత  హమిదా, విశ్వ నిద్రపోకుండా , ఒక్కొక్కరి గురించి తమ తమ మనసులోని మాటలను చెప్పుకుంటారు.

మరి ఈ వారం కెప్టెన్ ఎవరవుతారో?.చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.