ఉగాది(UGADI)! ఈ ఉగాదిని తెలుగు సంవత్సరాది అంటారు. తెలుగు వారి మొదటి పండుగా(First Festival) ఉగాదిని జరుపుకుంటారు.

ఉ అంటే నక్షత్రం(Star), గ అంటే గమనం(Comes), నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది, అనగా సంవత్సరంలో మొదటి రోజు.

చైత్ర(Chaitra) శుద్ధ పాడ్యమి(Padyami) రోజున ఈ పండుగా జరుపుకోబడుతుంది. ఇక ఉగాది పుట్టుక గురించి తెలుసుకోవాలంటే  చైత్ర శుద్ధ పాడ్యమి నాడు విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ దేవుడు(God Bramha) చేసిన కృషిని సూచిస్తూ ఉగాది జరుపుకుంటారని పురాణాలూ చెబుతున్నాయి.

మరొక్క కధనం ప్రకారం సోమకాసురుడు (Somakasurudu) అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాల(VEDAS)ను దొంగిలించాడు, అప్పుడు విష్ణుమూర్తి (Lord Vishnu) మత్స్యావతారం (Mastyavatara)లో వెళ్లి సోమకాసురుడుని వధించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మ దేవునికి అప్పగించారట, ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలూ చెబుతున్నాయి.

ఉగాది రోజు నుంచి తెలుగు సంవత్సరం(New Year) మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ. తలంటు స్నానాలు, ఇల్లు, వాకిలి శుభ్రపరుచుకోవడం, కొత్త బట్టలు ధరించి పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు కూడా, ముఖ్యంగా తెలుగు వారి సాంప్రదాయంగా గడపలను కుంకుమ పసుపుతో అలంకరించుకోవడం, రకరకాల అందమైన ముగ్గులు వేయడం ఆనవాయితీ. అలాగే గుమ్మాలకు మామిడి, వేపకొమ్మలు, బంతిపూల మాలలను కడతారు. మన దేశంలో వివిధ ప్రాంతంలో ఇదే ఉగాది పండుగను వివిధ పేర్ల(Different Names)తో పిలుస్తారు. ఆంధ్ర(Andhra), కర్ణాటక(Karnataka)లో ఉగాది(Ugadi) అంటారు, మహారాష్ట్ర(Maharastra)లో గుడి పడ్వా(Gudi Padwa), తమిళులు(Tamil) పుతాండు(Puthandu) , మళయాళీలు(Maliyalis) విషు(Vishu), పంజాబీలు(Punhjab) వైశాఖి(Vaisaki), బెంగాలీలు(Bengal) నాబా బార్ష(Nabha Barsha),  అస్సాం(Assam)లో బిహు(Bihu), ఇలా పేర్లతో పిలుస్తారు.

ఇక ఈ ఉగాది ప్రత్యేకతల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఉగాది పచ్చడి. వసంత ఋతువు(Vasantha Ruthuvu) ఆగమనమైన రోజు, ఈ రోజున  షడ్రుచులు కలిపినా పచ్చడిని తింటారు. షడ్రుచులు కల్గిన ఈ పచ్చడిని తీపి,పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం(Jaggery), చింతపండు(Tamrind), ఉప్పు(Salt), కారం(Chilly), వేపపూవు(Neem Flower), మామిడికాయలు(Mangoes) తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా తయారు చేస్తారు.

తెలుగు వారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తోంది. పంచాంగ శ్రవణం(Panchanga Sravanam)లో ఆ సంవత్సరం మన సిత్తిగత్తులను ముందే తెలుసుకోవచ్చు మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పంచాంగ శ్రవణం తిధి, వారం, నక్షత్రం, యోగం,కారణం అనే ఐదు అంశాల గూర్చి ప్రస్తావిస్తారు. ఇక మూడవది కవి సమ్మేళనం సాయంకాలం కవులు ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవడం అనేది జరుగుతుంది.

గత సంవత్సరం జరిగినవన్నీ మరచి పోయి ఆనందంగా ఈ కొత్త సంవత్సరం జరుపుకోవాలని కోరుకుందాం.

ఈ సంవత్సరం ఉగాది పండుగను శనివారం(Saturday), ఏప్రిల్ 2, 2022(April 2, 2022) నాడు జరుపుకుంటారు.

ఈ ఉగాది రోజునే వసంత నవరాత్రి(Vasantha Navaratri) పేరిట వివిధ ఆలయాల్లో ఉత్సవాల(Ustavas)ను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొంటే ఆ దేవుడి ఆశీస్సులు మనపై  ఎప్పుడూ ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

అంతే కాదు ఉత్తర భారతీయులు(North Indians) ఉగాదిని జరుపుకోరు కానీ అదే రోజున తొమ్మిది(Nine Days) రోజుల చైత్ర నవరాత్రి(Chaitra Navaratri) పూజ(Pooja)ను ప్రారంభిస్తారు.

కాబట్టి సాయంత్రం వేళ మర్చిపోకుండా దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా వినండి.

అలాగే మీ అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు …