బుల్లి తేరా రియాలిటీ షో(Small Screen Reality Show) బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) తుది దశకు వచ్చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా షో మొదలైంది.

బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే(Grand Finale) ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇక కింగ్  నాగార్జున సీజన్ 5 హోస్ట్ గా ఈ రోజు తో వీడ్కోలు చెప్పనున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్(Celebrities) కూడా ఈ ఈవెంట్ కి వచ్చి సందడి చేశారు.

ఇక కింగ్  నాగార్జున గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. ఆ తరువాత ఎలిమినేట్(Eliminate) అయిన కంటెస్టెంట్లందరూ కూడా దిమ్మతిరిగేపోయే డాన్స్ పర్ఫామెన్స్‌(Dance Performances) లతో ఆదరగొట్టేసారు. ఇక సీజన్ 5 విన్నర్(Season 5 winner) ఎవరని అడిగిన ప్రశ్నకు పద్నాలుగు మంది కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను తెలిపారు.

ఎవరు గెలవాలని అనుకుంటున్నారు అంటూ ఒక్కొక్కరిని అడిగగా చాలా మంది శ్రీరామచంద్రకే ఓట్లు వేశారు. కానీ వాస్తవానికి మాత్రం ఇంకలా ఉంది.

అయితే పేరెంట్స్ మాత్రం చాలా కూల్ గా, కంపోజ్డ్‌గా మాట్లాడారు. అందులో సన్నీ మదర్, మానస్ తల్లి, శ్రీరామ్ అమ్మగారు, మాట్లాడారు.

ఇక సిరి అమ్మగారు  శ్రీదేవీ మాట్లాడుతూ ఎమోషనల్(Emotional) అయింది. సిరికి బిగ్ బాస్ హౌస్(Big Boss) లో చెప్పిన మాటలతో అందరూ తనను తిట్టారని, అలా చెప్పకూడదని అందరూ అన్నారంటూ శ్రీదేవీ తెలిపింది. అమ్మ చెప్పకపోతే ఇంకెవ్వరూ చెబుతారు. మీ మనసులో ఏముందో అది చెప్పారు కదా? దాంట్లో తప్పేం లేదు అని నాగార్జున మాత్రం శ్రీదేవిని ఓదార్చాడు.

ఇక హౌస్ లో వున్నా టాప్ 5 కంటెస్టెంట్స్ (Contestants) సూపర్ డాన్స్ లతో స్టెప్స్ వేసి  కుమ్మేసారు. తరువాత  సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సన్నీ ఫైనల్ గా ఒక టాస్క్ ఇచ్చాడు నాగార్జున. అందరికి హార్ట్ సింబల్స్ ఇచ్చి ఇంట్లో ఇష్టమైన ప్లేస్ లో పెట్టమన్నాడు నాగ్.

ముందుగా శ్రీరామ్ లివింగ్ రూమ్(Living Room) దగ్గర పెట్టాడు. అలాగే సన్నీ స్విమింగ్ పూల్(swimming pool) దగ్గర, మానస్ గార్డెన్ ఏరియాలో, షణ్ముఖ్ మొజ్ రూమ్(Moj room) లో పెట్టాడు. ఇక సిరి సోఫా(sofa)లో హార్ట్ సింబల్ పెట్టింది.

బిగ్ బాస్(Big Boss) స్టేజి మీదకి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్స్(Promotions) లో భాగంగా  ముందు బ్రహ్మాస్త్ర దర్శకుడు(Director) ఐయాన్ బిగ్ బాస్ వేదికమీదకు వచ్చాడు.

ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ అలాగే అలియా భట్ ఇద్దరు కలిసి స్టేజి మీదకు వచ్చారు. వీరితో పాటు  దర్శక ధీరుడు రాజమౌళి కూడా బిగ్ బాస్ షోకి గెస్ట్‌ గా వచ్చారు.

బిగ్ బాస్ వేదిక పై ఆర్ఆర్ఆర్ ట్రైలర్(RRR Tailor) చూసినపుడు గుజ్‌బంప్స్(Goose bumps) వచ్చాయన్నారు నాగ్. ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ ను కలపడం నాకు ఇష్టమన్నారు జక్కన్న. రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నేను నటిస్తున్నాని చెప్పారు నాగార్జున.

తెలుగులో నమస్కారం చెప్పిన అలియా, రణ్ బీర్ ఆ తర్వాత ముద్దుగా మాట్లాడి కట్టిపడేసింది అలియా భట్. ఆడియన్స్ అందరికి నా ముద్దులు అంటూ అలియా అండ్ రణ్ బీర్ తో మాట్లాడించిన నాగ్. ఇక కంటెస్టెంట్స్(Contestants) ని పలకరించిన  రాజమౌళి, అలియా, రణ్ బీర్ ను చూసి ఆనందంలో కేరింతలు కొట్టారు సన్నీకి ఐ లవ్ యు చెప్పిన అలియా.

అలాగే బాలయ్య దబిడి దిబిడే అనే డైలాగ్  సన్నీ తో కలిసి చెప్పిన అలియా. సింగర్ శ్రీరామ్ చంద్ర అందమైన పాటతో అలియాను, రణ్ బీర్ కపూర్ లని ఇంప్రస్(Impress) చేశాడు శ్రీరామ్ పాటకు రాజమౌళి కూడా ఫిదా అయ్యారు.

బిగ్‌బాస్‌(big Boss) స్టేజి మీదకు పుష్ప సినిమా ప్రమోషన్స్(Pushpa Movie Promotions) లో భాగంగా సుకుమార్, రష్మిక, దేవీశ్రీ ప్రసాద్ సందడి చేసారు . ఆ తరువాత టాప్ 5 కంటెస్టెంట్స్(TOP 5 Contestants) నుంచి ఒక్కరిని ఎలిమినేట్ చేయడానికి హౌస్ లోకి  రష్మిక, దేవిశ్రీ  ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు.

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరైన సిరి హనుమంత్‌ ఎలిమినేట్(Eliminate) అయ్యింది. రశ్మిక మందన, దేవిశ్రీ ప్రసాద్‌లు ఆమెను హౌస్‌ నుంచి బిగ్‌బాస్‌ స్టేజీపైకి తీసుకువచ్చారు. సిరి ఎలిమినేషన్ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా నుంచి పాటలతో బిగ్ బాస్ స్టేజిపై అలరించిన సింగర్ శ్రీకృష్ణ.

ఇక బిగ్ బాస్ సీజన్ 3(Season 3) విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ‘నాటు నాటు’ పాట పడుతూ అదిరిపోయే స్టెప్పులేశాడు.  బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు శ్యాం సింగరాయ్ టీమ్(Shyam Sing Roy team)  నాని, సాయి పల్లవి, కృతిశెట్టి.  ఆ తరువాత శ్యాం సింగరాయ్ టీమ్ హౌస్ లోకి  వెళ్లారు. మిగిలిన కంటెస్టెంట్స్ నలుగురిలో మానస్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు.

అనంతరం హీరోయిన్ శ్రీయ. డాన్స్ పర్ఫామెన్స్(Dance Performance) తో దుమ్మురేపింది.

బిగ్ బాస్ స్టేజి(Big Boss Stage)  మీదకు చిన్న బంగార్రాజు ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని నాగచైతన్య(Akkinneni Nagachaitanya)  ప్రో కబడ్డీ(Pro Kabadi) కి బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador) గా వ్యవహరిస్తున్నాడు. అయితే చైతు మాట్లాడుతూ  నాగ్ కి ఒక సర్ప్రైజ్(Surprise) అంటూ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సీజన్ 5 జర్నీ ఏ.వీ (Season 5 Journey)ను చూపించారు.

ఇక  నాగచైతన్య గోల్డెన్ బాక్స్(Golden Box) తో హౌస్ లోకి వెళ్లారు. హౌస్ లో ఉన్న వారిని టెంప్ట్ చేసిన  నాగచైతన్య.అయితే ఆ గోల్డెన్ బాక్స్ ని ఎవరు తీసుకోలేదు, ఆ తరువాత  శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్(Eliminate) అయ్యాడు. చైతన్య శ్రీరామ్ చంద్రను తీసుకొని స్టేజ్ పైకి వచ్చేశాడు.

ఇక హౌస్ ఎలా మిగిలిన సన్నీ, షణ్ముఖ్‌ల్లో విన్నర్(winner)  ఎవరనే అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇద్దిరిలో ఉన్న టెన్షన్ నుంచి  కూల్  చేయడానికి నాగార్జున ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి  పంపించారు. దీంతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా సన్నీ, షణ్ముఖ్‌లతో డ్యాన్స్‌ చేయిస్తూ వారి టెన్షన్‌ను పోగోట్టే ప్రయత్నం చేసింది.

ఇక నాగార్జున ఆదేశాల మేరకు ఫరియా సన్నీ, షణ్ముఖ్‌ లో ఒకరికి హార్ట్‌ సింబల్‌(heart symbol) ఇచ్చి విజేతను ప్రకటించాలన్నారు. బిగ్‌బాస్‌(Big Boss) చరిత్ర(history)లోనే మొదటి సారి విజేత(Winner)ను హౌస్‌లోనే ప్రకటించనున్నట్లు తెలిపిన నాగార్జున ఆసక్తి  పెంచేశాడు. ఇందులో భాగంగా రెండు బాక్సుల్లో ఇద్దరిని చేతులు పెట్టమని చెప్పిన నాగ్‌. గెలిచిన వారి చేతికి గ్రీన్‌ కలర్‌(green Color) అంటుకుంటుందని చెప్పారు. కానీ ఇద్దరు కంటెస్టెంట్‌ల చేతులకు బ్లూ కలర్‌(Blue Color) ఉండడంతో అంతా షాకేయ్యారు.

ఈ ట్విస్ట్‌ తర్వాత నాగార్జున నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో బిగ్‌బాస్‌ విజేతను ఎవరు ప్రకటించనున్నారన్న దానిపై మరోసారి ఉత్కంఠ మొదలైంది. సీజన్‌ 5(season 5) ముగిసే ఆఖరి  క్షణంలో కూడా బిగ్‌బాస్‌ ప్రేక్షకులను ఉత్కంఠతకు గురి చేస్తున్నాడు. విజేత  ఎవరో తేల్చే క్రమంలో సస్పెన్స్‌(Suspense) ను బాగా పాటించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే హౌస్‌లో మిగిలిన సన్నీ, షణ్ముఖ్‌లను నాగార్జున స్టేజ్‌పైకి తీసుకొచ్చారు. ఇక బిగ్‌బాస్‌ విన్నర్‌ షణ్ముఖా, సన్నీనా అనేది  కొద్దీ క్షణాలు పాటు అందరిని ఉత్కంఠతకు గురి చేసింది.

ఇక ఉత్కంఠతకు తెర దించుతూ సన్నీ బిగ్‌బాస్‌ 5 సీజన్‌ విన్నర్(Big Boss Season 5 winner) గా సన్నీ(SUNNY) గెలిచాడు. ఇక రన్నర్‌ అప్‌(Runner Up)గా షణ్ముఖ్‌(SHANMUKH) నిలిచాడు. ఈ సందర్భంగా రన్నర్‌అప్‌గా నిలిచిన షణ్ముఖ్‌ మాట్లాడుతూ ‘ఏం పర్లేదు గెలుపు ముఖ్యం కాదు, ఇంత దూరం వచ్చాను, నా పేరెంట్స్‌ ను ఇంత వరకు తీసుకొచ్చాను అది చాలు.

ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ట్రోఫీ(Trophy) వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ విజేతగా నిలిచిన సన్నీ ఎమోషనలయ్యాడు. విజేతగా గెలిచిన తర్వాత సన్నీ మాట్లాడుతూ ‘నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ (Thanks), నా గెలుపుకు నాగార్జున మోటివేషన్‌(Motivation), నా హౌస్‌ మేట్స్‌(House mates), నాకు ఓటు(Vote) వేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. అమ్మకు  నా జీవితంలో మొదటి గిఫ్ట్‌(Gift) ను అందించాను’ అని చెప్పుకొచ్చాడు.

ఇక షణ్ముక్‌ గురించి మాట్లాడుతూ హౌస్‌లో అందరి కంటే కూలెస్ట్‌ పర్సన్‌(Coolest person), షణ్ముఖ్‌, సిరిల మధ్య ఉన్న స్నేహం(Friendship) ఎంతో అద్భుతమైందంటూ సన్నీ, షన్ను ని పొగడల్తో ముంచేస్తాడు.

ఇక ఈ రోజు తో బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season5) ముగిసింది. ఇక నెక్స్ట్ సీజన్(Next season) ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు సీజన్ 5 ని నెమరువేసుకోండి. అలాగే విన్నర్ సన్నీ కి, రన్నర్ షన్ను కి కంగ్రాట్స్!