బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) స్మాల్ స్క్రీన్ బిగ్ రియాలిటీ  షో ఆదివారం గ్రాండ్ ఫినాలే(Grand Finale) తో ముగియనుంది. అంతేకాకుండా సీజన్ 5 బిగ్ బాస్ విన్నర్(Winner) కూడా తేలిపోనుంది. ఇప్పటికే బయట విన్నర్ ఎవరన్నా ఊహాగానాలు జరుగుతోంది.

ఇక శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ ఎక్స్  కంటెస్టెంట్స్ (EX-Contestants) హుంగామ(Hungama) చేసారు.105 వ ఎపిసోడ్ హైలైట్స్ మీ కోసం.

ప్రతి సీజన్లో వున్నా టాప్ 5 కంటెస్టెంట్స్(Top 5 Contestants) తో చిట్ చాట్(Chit Chat) చేయడానికి ఎక్స్ – కంటెస్టెంట్స్ ఇంట్లోకి వస్తుంటారు.

ఐదో సీజన్‌ ఫైనలిస్టుల(Finalist)తో కలిసి  మాజీ సీజన్ల కంటెస్టెంట్లు హౌస్ లో గోల గోల చేశారు.ముందుగా ఫస్ట్‌ సీజన్‌(First Season ) కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌(House mates) తో ముచ్చటించారు.

శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్‌షిప్‌ చేసినా వారు వెళ్లిపోతారని పంచ్ ఇవ్వడంతో  అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్‌మేట్స్‌ గెస్‌ చేయాలి అని ఓ గేమ్ ఆడించారు. పాట సరిగ్గా గెస్‌(Guess) చేస్తే దానికి డ్యాన్స్‌ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగిలిన ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్‌(Dance) చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ అయిన ముగ్గురిని పాపం ఒంటరిగా ఉన్నారంటూ సింపతీ చూపెట్టింది.

దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్‌ సిరిని ఎలిమినేట్‌(Eliminate) చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్‌ చేశాడు.

ఇక హరితేజ బిగ్‌బాస్‌(Big Boss) షో గురించి, టాప్‌ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత రెండో సీజన్‌(Second Season) కంటెస్టెంట్సైనా  గీతా మాధురి, రోల్‌ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ ను(House mates) హూషారెత్తించారు. టాప్‌ 5(Top 5)లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ ప్రశంసించారు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు(Contestants) అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్‌షిప్‌పై పంచులు వేస్తూ వారిని ఓ ఆటాడేసుకుంటుంటే  సన్నీ, మానస్‌, శ్రీరామ్‌ పగలపడి నవ్వారు.

అసలే  మాట పాడని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో కోపం తో రగిలిపోయాడు. మనిద్దరం హైలైట్‌ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో చెప్పుకున్నాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్‌ అయినా బిగ్‌బాస్‌ హౌస్‌(Big Boss House) వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని ఫీల్ అయింది.

దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్‌(Hug) చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ బయటకు వెళ్లాక షణ్ను హగ్‌ గురూ అయిపోతాడని కామెంట్‌ చేశాడు.

ఇక  మూడో  సీజన్‌(Third Season) కంటెస్టెంట్లు శివజ్యోతి, రాహుల్సిప్లిగంజ్ వచ్చి  హౌస్‌మేట్స్‌ తో ముచ్చటించారు. బెలూన్  హీలియం పీల్చుకుని సాంగ్  లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్‌మేట్స్‌(Housemates) గొంతులు మారిపోవడంతో అందరూ తెగ  నవ్వారు.

నాలుగో  సీజన్‌(Fourth Season) కంటెస్టెంట్లు అఖిల్‌ సార్థక్‌, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్‌ కి సర్‌ప్రైజ్‌(Surprise) ఇచ్చారు. అతడు  చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్‌(Song) ప్లే చేయడంతో ఫుల్ ఖుషి అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు.

అందులో భాగంగా డేటింగ్‌ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు.

అరియనా అడిగిన  వేరే కంటెస్టెంట్‌(Contestant) టవల్‌ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను, శ్రీరామ్‌ టవల్‌ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్‌ కూడా వాడాడని పాయింట్ అవుట్ చేసింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న ఆట లో  శ్రీరామ్‌ విన్ అయ్యాడు.

సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్‌, అరియానా చూపించడంతో ఆమె చాలా షాక్  అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్‌(Dance) చేశారో మరోసారి అదే పాటకు స్టెప్పులేశారు.  ఆలా శనివారం ఎపిసోడ్ పాత కంటెస్టెంట్స్(Ex Contestants) చాలా కూల్ గా, ఖుషి ఖుషిగా సాగింది.

ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలే సాయంత్రం 6 గంటలకు ప్రసారముతుందన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే విన్నర్ ఎవరో కూడా చాలా మంది గెస్ చేసినట్టు తెలుస్తోంది. అయినా సరే సస్పెన్స్ ని అలాగే పాటిస్తూ విన్నర్(Winner) ని ఫినాలే(Finale) లో తెలుసుకుందాం అప్పటిదాకా వెయిట్ చేయండి.

నేనైతే చాలా ఎక్ససైటెడ్(Excited)గా వున్న నాతో పాటు మీరు కూడా కదూ!