బిగ్ బాస్ సీజన్ 5(Big Boss Season 5) ఒక రాజు మాత్రమే వుంది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే(Grand Finale) కి, ఆ రోజే ఎవరు బిగ్ బాస్ విన్నర్ (Big Boss Winner) అని కూడా తెలిసిపోతుంది.

ఇక  శుక్రవారం 104 వ ఎపిసోడ్(Episode) లో సన్నీతో జరిగిన గొడవతో సిరి బాగా డిస్టర్బ్ అయింది. రాత్రంతా  కూడా నిద్రపోకుండా ఏడుస్తూనే వుంది . ఒక్క గేమ్‌(Game) ఓడిపోతే ఓడిపోయినట్లేనా అంటూ అర్ధరాత్రి ఒంటి గంటకు బాత్రూమ్ లో గుక్కపెట్టి ఏడ్చింది.

తనను కొట్టడానికి సన్నీ మీద మీద కొచ్చాడంటూ  షన్ను తో చెప్పుకుంది. దీంతో ఆమెను హాగ్ చేసుకుని  ఓదార్పు యాత్ర మొదలెట్టిన షణ్ను ఎవడికీ కొట్టేంత సీన్‌ లేదని ఖరాకండిగా తేల్చేసాడు. నేనేదైనా అంటే ఫీల్‌ అవ్వు కానీ ఇంకెవడన్నా అంటే  ఏడవద్దు, మూసుకుని కూర్చో అంటూ గట్టిగా వార్నింగ్‌(Warning) ఇచ్చాడు.

బిగ్‌బాస్‌ ప్రయాణం(Big Boss Journey)లో ఆఖరి మజిలీకి చేరుకోవడంతో మీలో ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని కుదిపేసి ఉంటాయని, మీ జాతకాలేంటో తెలుసుకోండంటూ జ్యోతిష్యురాలు(Astrologer) శాంతిని పంపాడు బిగ్‌బాస్‌.

ఆమె మొదటగా షణ్ను గురించి చెప్తూ జీవితంలో మంచి మార్పు ఉండబోతుంది. మీ ప్రేమ జీవితం బాగుండబోతోంది. కొత్త  అవకాశాలతో కావాల్సినంత సంపాదించబోతారు అని చెప్పింది.

సన్నీ గురించి చెప్తూ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ,బయటకు వచ్చాక కొత్త ప్రయాణం మొదలుపెడతారు. కార్డ్‌ లోస్వప్న సుందరి వచ్చింది అంటూ త్వరలో అతడు లవ్ లో పడతాడని హింట్‌(Hint) ఇచ్చింది. ఇక సిరి గురించి చెప్తూ.. త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయని శుభం పలికింది.

శ్రీరామచంద్రకు గెలుపు కార్డు(Win Card) వచ్చిందన్న ఆమె అతడు లోలోపల చాలా కన్‌ఫ్యూజ్‌(Confuse) అవుతున్నాడంది. బిగ్‌బాస్‌ షో(Big Boss Show) తర్వాత అతడికి ఎన్నో కొత్త చాన్సెస్(Chances) రాబోతున్నాయని పేర్కొంది.

మానస్‌కు బిగ్‌బాస్‌ జర్నీ తర్వాత అన్నీ సాధించానన్న తృప్తి(Satisfaction) ఉంటుందని తెలిపింది.

ఇక అందరి లవ్‌ లైఫ్‌(Love Life) గురించి చెప్తూ వచ్చిన జ్యోతిష్యురాలు షణ్ముఖ్‌ దగ్గరకు వచ్చేసరికి మాత్రం బిగ్‌బాస్‌ షోలోని లవ్‌ లైఫ్‌ గురించి చెప్పాలా? బయట లవ్‌ లవ్  గురించి చెప్పాలా? అంటూ సిరి, షన్ను ల గాలి తీసేసింది.

దీంతో సిరి, షణ్నులకు షాక్(Shock) తో  నోట మాట రాలేదు. వెంటనే షాక్‌ నుంచి తేరుకున్న షణ్ను బయట మాది ఐదేళ్ల రిలేషన్‌షిప్‌(Relationship), తర్వాత ఎలా ఉండబోతున్నాం అని అడిగాడు. మీలో ఉన్న చిన్నచిన్న భయాలను తీసేస్తే హ్యాపీగా ఉంటారని రిప్లై ఇచ్చింది జ్యోతిష్కురాలు శాంతి.

బిగ్‌బాస్‌(Big Boss) నుంచి బయటకు వెళ్ళాక సిరి పెళ్లి(Marriage) చేసుకోవడంతో పాటు ఫారిన్‌కు హనీమూన్‌(Honey Moon)కు కూడా వెళ్తుందని తెలిపింది. తర్వాత సిరి, షణ్ను మళ్ళీ గొడవపడ్డారు. ఇద్దరి కోసం కాకుండా అందరికీ ఎందుకు వంట చేస్తావని కోప్పడ్డాడు షణ్ను.

సిరి ఉదయాన చేసిన దోసెలు వాళ్లు తినలేదని, అలాంటప్పుడు మళ్లీ ఎందుకు వండతావని మండిపడ్డాడు. దీంతో చీరెత్తిపోయిన సిరి. నేను కష్టపడి వండితే ఎందుకు తినలేదని, ఇష్టం లేకపోతే ముందే చెప్పఛుకాదని మానస్‌ను నిలదీసింది. మానస్‌ మాత్రం తాను తిన్నానని చెప్పాడు. సన్నీకి రైస్‌ తినాలనిపిస్తే పులిహోర చేసుకుని తిన్నాడని బదులిచ్చాడు. అయినప్పటికీ వినిపించుకోని సిరి, షణ్ను మా వంట మేము చేసుకుంటామని చెప్పేసాడు.

ఇంతలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్(Contestants) అందరిని  సూట్‌కేసులు ప్యాక్‌(Pack) చేసుకోమని చెప్పాడు. ఈ మాట విని షాకైన కంటెస్టెంట్స్, ఏమి అర్థంకాకా, అయిష్టంగానే బ్యాగులు ప్యాక్ చేసుకుని గార్డెన్ ఏరియా కి వచ్చారు.

మీలో ఒకరి ప్రయాణం ఈ క్షణమే ముగిసిందంటూ ట్విస్ట్(Twist)  ఇచ్చిన బిగ్‌బాస్‌(Big Boss) ఎవరు ఎలిమినేట్‌(Eliminate) అవ్వాలనేదానిపై మీ అభిప్రాయం చెప్పాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు.

మానస్‌, సన్నీ- షణ్ముఖ్‌; శ్రీరామ్‌- సిరి; షణ్ముఖ్‌-సన్నీ; సిరి-మానస్‌ ఎలిమినేట్‌ అవడానికి అర్హులని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ మాత్రం అనూహ్యంగా సిరి ఇంటి నుంచి వెళ్తుందని ప్రకటించడంతో ఆమె, షణ్ను ఏడ్చేశారు.

కానీ సన్నీ మాత్రం నువ్వెళ్లెట్లేదని బల్లగుద్ది చెప్పాడు. చివరికి అతడి మాటే నిజమైంది. కాసేపు సిరి ని కన్ఫెషన్ రూమ్(Confession Room) లో ఉంచి  ఇంటి లోకి పంపించేశాడు బిగ్ బాస్

కాసేపు సిరిని కన్ఫెషన్‌ రూమ్‌(Confession Room)లో కూర్చోబెట్టి షణ్ను ఏడుస్తున్న వీడియో(Video) చూపించాడు బిగ్‌బాస్‌(Big Boss). షణ్ను కంటతడి పెట్టుకోవడాన్ని చూసి  ఎమోషనల్(Emotional) అయ్యి సిరి కూడా ఏడ్చేసింది. వాడు అక్కడ ఏడుస్తున్నందుకు బాధపడాలో, నన్ను మళ్లీ హౌస్‌లోకి పంపిస్తున్నందుకు ఆనందపడాలో తెలియట్లేదంటూ  బాధను వెల్లబోసుకుంది.

గేటు నుంచి బయటకు పంపిన కాసేపటికే తిరిగి ఆమెను హౌస్‌లోకి పంపించారు. దీంతో సిరి ఆనందంతో వెళ్లి షణ్నును హగ్ చేసుకుంది.

అసలు బిగ్ బాస్ సిరిని ఎందుకు ఇంటి నుంచి బయటకు పంపినట్టు ఎందుకు తిరిగి లోపాలకి పంపినట్టు ఏంటో ఈ ట్విస్ట్(Twist), అది రెండు రోజుల్లో షో ఎండ్ కార్డు పడనుండగా! ఈ షో చూస్తున్న వాళ్ళకి ఎం సందేశం(Message) ఇవ్వాలనుకుంటున్నారు బిగ్ బాస్.

ఇక  రేపటి ప్రోమో(Promo)లో మునపటి సీజన్ కంటెస్టెంట్స్(Contestants) సందడి  చేసినట్టు తెలుస్తోంది.