బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) లో తొమ్మిది వారాలు పూర్తిచేసుకుని పదో వారం లోకి అడుగుపెటింది. మొత్తం 19 కంటెస్టెంట్స్(Contestants) తో మొదలైన షో ఇప్పటికే తొమ్మిది మంది కంటెస్టెంట్స్, ఎలిమినేట్(Eliminate) అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

ప్రస్తుతానికి 10 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో మిగిలారు. ఇక సోమవారం అంటేనే కంటెస్టెంట్స్ స్ట్రెస్ ఫీల్ అయే రోజు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో? ఎవరు ఎవరి పై నోరుపారేసుకుంటారు.

హీట్ డిస్కషన్స్ కాస్త ఎలాంటి గొడవలకు దారి తీస్తుందో అనేలా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. దీనికి తోడు బిగ్ బాస్(Big Boss) కూడా ఈ నామినేషన్(Nominations) ప్రక్రియ లో ట్విస్ట్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ వారం ఎలాంటి ట్విస్ట్ లతో నామినేషన్ ప్రక్రియ వుండబోతుందో మరి……

ఇక ఈవారం నామినేషన్స్‌(Nominations) ప్రక్రియ ట్విస్ట్ లు పెట్టిన బిగ్ బాస్(Big Boss). హౌస్‌కి కెప్టెన్‌(Captain)గా ఉన్న ఆనీ ఇంటిలో ఉన్న నలుగుర్ని డైరెక్ట్‌ గా నామినేట్ చేసి ఇంటిలో ఉన్న జైలులో బంధించాలని ఆదేశించారు బిగ్ బాస్.

దీంతో ఆనీ మాస్టర్ రెండో ఆలోచన లేకుండా ఫస్ట్ కాజల్‌ని నామినేట్ చేసి జైలులో వేసింది. ఆ తరువాత సన్నీని నామినేట్ చేస్తూ ఇప్పటివరకూ అందర్నీ నామినేట్ చేశాను కానీ నిన్ను నామినేట్ చేయలేదు.

అందుకే ఈవారం సన్నీని చేస్తున్న అంటూ సిల్లీ రీజన్  తో  జైలు కు పంపించింది. ఆ తరువాత మానస్, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది ఆనీ. అయితే ఆనీ మాస్టర్ మానస్, షణ్ముఖ్, కాజల్, సన్నీ‌లను నామినేట్ చేసి జైలుకి పంపినప్పటికీ ఒక్కరికి కూడా పర్ఫెక్ట్  రీజన్ ఇవ్వలేకపోయింది ఆనీ మాస్టర్.

అయితే షణ్ముఖ్‌ని నామినేట్ చేసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయింది  ఆనీ. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ  జైలులో కూర్చున్నాడు షణ్ముఖ్. ఆలా మొత్తంగా మానస్, షణ్ముఖ్, కాజల్, సన్నీ నలుగుర్ని నామినేట్ చేసి జైలు కి పంపింది హౌస్ కెప్టెన్‌ అయిన ఆనీ మాస్టర్.

దీంతో నామినేషన్ ప్రక్రియ లో  మొదటి లెవెల్(First level) పూర్తయిందని బిగ్ బాస్ ప్రకటించారు.

ఆనీ మాస్టర్ చేసిన నామినేషన్‌(Nomination)ని మార్చే చాన్సు(Chance)ని మిగిలిన హౌస్ మేట్స్(House mates)కి ఇచ్చారు బిగ్ బాస్(Big Boss). దీనిలో భాగంగా బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న తాళ్ళాలను ఎవరైతే దక్కించుకుంటారో వారు తమకి ఇష్టమైన వాళ్లని విడిపించవచ్చని చెప్పారు.

ఆ రిలీజైన కంటెస్టెంట్ హౌస్ లో ఉన్న ఇద్దర్ని నామినేట్ చేయొచ్చని చెప్పారు. ఆ ఇద్దరు లో  ఒకరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే మొదట బజర్(Buzzer) మోగేసరికి పింకీ పరుగున వెళ్లి తాళ్ళాలను  చేజిక్కించుకుంది. వెంటనే మానస్‌ని జైలు నుంచి రిలీజ్ చేసింది.

అయితే మానస్ రవి, జెస్సీలను నామినేట్ చేయగా చివరికి ప్రియాంక, మానస్‌లు చర్చించి జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేశారు.

ఆ తరువాత సిరి జైలు కీ(key) ని సంపాదించి జెస్సీని సేవ్(Save) చేసింది. ఈ సందర్భంలో షణ్ముఖ్‌కి సారీ చెప్పింది సిరి నిజానికి షణ్ముఖ్ తనని రిలీజ్ చేయొద్దని ముందు సిరితో చెప్పాడు. బయటకు వస్తే నామినేట్ చేయడానికి తన దగ్గర సరైన కారణాలు లేవని చెప్పాడు.

దీంతో జెస్సీని సేవ్ చేసి బయటకు తీసుకుని వచ్చింది. దీంతో బయటకు వచ్చిన జెస్సీ తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే సిరి మానస్‌ని నామినేట్(Nominate) చేసింది. ఆ తరువాత జెస్సీ తాళ్ళాలను దక్కించుకుని షణ్ముఖ్ ని  జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు.

షణ్ముఖ్‌కి నామినేట్ చేసే అవకాశం రావడంతో పింకీ, సిరిలను నామినేట్ చేశాడు. చివరికి జెస్సీ సిరిని సేవ్ చేసి పింకీని జైలుకి పంపాడు. అయితే షణ్ముఖ్ వరుసగా తనని రెండుసార్లు నామినేట్ చేయడంతో హర్ట్ అయ్యింది. నేను సరిగా ఆట ఆడటం లేదని నామినేట్ చేస్తున్నాడు. మరి ఇన్నాళ్లూ ఇతనేం చేశాడు ఖాళీగా  కబుర్లు చెప్తూ కూర్చోలేదా? అని మండి పడింది.

ఇక సిరి అయితే కాజల్‌పై పగపట్టి ఆమెను ఈవారం నామినేషన్స్(Nominations) లో చూడాలని ఉంది అంటూ మిగిలిన ఆట ఎలా ఆడాలో రవి, షణ్ముఖ్, శ్రీరామ్, జెస్సీలకు గేమ్ స్ట్రాటజీ(Game strategy) చేపిపింది. ఆ తరువాత జైలు తాళ్ళాలను దక్కించుకున్న రవి  పక్కా ప్లానింగ్‌తో ప్రియాంకను జైలు నుంచి విడుదల  చేశాడు.

ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్‌గా రవి జెస్సీని సేవ్(Save) చేసి షణ్ముఖ్‌ని మళ్లీ జైలు లోపలికి పంపాడు. ఇక జైలు కీ దక్కించుకున్న శ్రీరామ్, రవి చెప్పిన  ప్లాన్ ప్రకారం కాజల్‌ని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్ సిరి, రవిలను నామినేట్ చేసింది.

ఫైనల్‌గా శ్రీరామ్ రవిని సేవ్ చేసి సిరిని నామినేట్ చేసి జైలుకి పంపాడు. అయితే కాజల్‌ని నామినేషన్స్‌ లో పెట్టాలని కుట్ర చేసిన సిరి అనూహ్యంగా శ్రీరామ్ తీసుకున్న డెసిషన్(Decision) తో తాను తవ్విన గోతిలో తానే పడినట్లింది.

అయితే కాజల్‌ని నమ్మి ఆమెను జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చిన శ్రీరామ్ సిరిని సేవ్(Save) చేయాలని అడిగాడు. అయితే కాజల్ ట్విస్ట్ ఇచ్చి అటు తన బెస్ట్ ఫ్రెండ్స్ మానస్, సన్నీలను కాకుండా షణ్ముఖ్‌ని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చింది. అయితే షణ్ముఖ్ రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేశాడు.

ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది. మొత్తంగా ఈ నామినేషన్స్(Nominations) మొదటి నుంచి  నుంచి కాజల్‌ నామినేట్ చేయాలని వేసిన ప్లాన్ లో రవి, సిరిలు ఇద్దరు వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడ్డట్టు అయ్యింది. .

చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి, సన్నీ, రవిలు నామినేట్ కాగా, మిగిలిన హౌస్ మేట్స్(House mates) లోనుంచి  ఒకర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవకాశాన్నికెప్టెన్ అయిన యాని మాస్టర్ కి ఇచ్చారు బిగ్ బాస్.

దీంతో ఆనీ మాస్టర్ అందరూ ఊహించనట్టే కాజల్‌ని నామినేట్ చేసింది. దీంతో మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్(Big Boss) ఊహించని ట్విస్ట్(Twist) లతో నామినేషన్ ప్రక్రియను ప్లాన్ చేస్తే, కంటెస్టెంట్స్(Contestants) ఒకరికి మించి ఒక్కరు, ఎత్తుకు పై ఎత్తులు వేసి నామినేట్ చేసారు……