హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు మండుతున్న ఎండల(hot) నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. తెలంగాణలో గురువారం వర్షాలు పడ్డాయి. ఎందుకంటే, గురువారం, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం(Heavy Rains) కురిసే అవకాశం ఉంది.

మార్చి 20 తేదీ వరకు కూడా నగరంలో వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ(Indian Weather) తెలిపింది. అంతేగాక, మార్చి 16, 17 తేదీల్లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్(Orange alert) జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఆరు జోన్లు(SIX Zones) హైదరాబాద్-ఛార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మేఘావృతమై వాతావరణం చల్లగా ఉండనుంది.

హైదరాబాద్ నగర పరిధిలో గురువారం సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.36 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ వర్షాలతో నగర ప్రజలకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం(Relief) లభంచనుంది. సంగారెడ్డి ప‌ట్టణంలోని రోడ్లన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లో(Inland areas)కి వ‌ర్షపు నీరు చేర‌డంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో పలు చోట్లలో ఉరుములు(Thunder), మెరుపులు(Lighting), ఈదురుగాలుల(Whirl wind)తో కూడిన వడగండ్ల వానలు(Hailstorms) కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలోని మార్పల్లిలో వడగండ్ల వాన భారీ ఎత్తున కురిసింది. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు(Ice) ప్రదేశం వలె మారిపోయింది. దీంతో అక్కడి ప్రజలు ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో(Video)ను కొంత మంది తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. కాగా ఈ వడగండ్ల వర్షానికి సంబంధించిన వీడియో కొద్ది సేపటికే రాష్ట్రం మొత్తం వైరల్(Viral) గా మారింది. పలువురు వడగండ్ల వానకు సంబంధించిన విజువల్స్(Visuals) సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తున్నారు.

మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తం(State wide)గా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్(Yellow alert) జారీ చేశారు. పగటి పూట ఎండ, సాయంత్రానికి వర్షాలు పడతాయని తెలిపారు అధికారులు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయన్నారు.17 18 తేదీల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు(Warnings) జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.