బిగ్ బాస్ సీజన్ 5(Big Boss season 5) రియాలిటీ షో రోజు రోజుకి కాంట్రవర్సియల్ గా మారుతుంది. అప్పుడే రెండు వారాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని మూడో వారం లో కి అడుగుపెట్టింది. గత రెండు వారాలుగా  ఇంట్లో హౌస్ మేట్స్(Housemates) నవ రసాలు ప్రదర్శిస్తున్నారు. ఇక గొడవలు, కొట్లాటలతో రణ రంగాన్ని తలపిస్తున్నారు హౌస్ మేట్స్.  మొత్తం 19 మంది కంటెస్టెంట్స్(Contestants) తో మొదలైన ఈ షో ఇప్పటికే సరయు,ఉమా ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా 17 మంది కంటెస్టెంట్స్  తో మూడో వారం మొదలైంది. బిగ్ బాస్ హౌస్‌లో వారం మొత్తంలో ఇంట్రస్టింగ్ గా ఉండేది సోమవారమే. ఈరోజు ఎలిమినేషన్స్‌ కి నామినేషన్స్ ఉండటంతో అసలు రంగు బయటపడేది. నామినేషన్స్‌ కి కారణాలు చెప్తూ ఒకరినిఒక్కరు మాట మాట అనుకునేది నామినేషన్స్(Nominations) రోజు కావడంతో నేటి (సెప్టెంబర్ 20) ఎపిసోడ్‌లో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు.. మూడో వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకుందాం.

14వ రోజు 16వ ఎపిసోడ్‌ హైలైట్స్ విషయానికి వస్తే.. ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతూ కొత్త ట్రాక్ మొదలుపెట్టిన శ్రీరామ్-హమీదాలు ఫ్రెండ్లీ గా  మాట్లాడుతూ కనిపించారు. నామినేషన్స్ గురించి చర్చించుకున్నారు. మరోవైపు ప్రియ, రవిలు కూడా గేమ్ ఆడుతున్న విధానంపై చర్చించుకున్నారు. ఇక కాజల్, మానస్‌లు మాట్లాడుకుంటూ.. విశ్వ, శ్రీరామ్‌ల బిహేవియర్ పై  మానస్ ఫీల్ అయ్యాడు. విశ్వ కెప్టెన్ అయినతరువాత మారిపోయాడని చెప్పాడు. అలాగే సన్నీ మంచోడే కానీ పని సరిగా చేయదని, హమీద ఆర్డర్ లు వేస్తుంటే కోపం వస్తోందని  కాజల్ తో చెప్తాడు.ఇక ఉదయాన్నే కాజల్ కోరికపై నాగార్జున మటన్ బిర్యానీకి కావాల్సిన సామాన్లు పంపించారు. దీంతో ఇంటి సభ్యులంతా ఫుల్ హ్యాపీ అయ్యారు. కాజల్ అతి కష్టం మీద హమీదా సాయంతో బిర్యానీ చేయడానికి సిద్ధం అయ్యింది.

మరోవైపు విశ్వ.. తన కష్టాలను షణ్ముఖ్ దగ్గర చెప్పుకుని బాధపడతాడు.. ఇక్కడికి వచ్చేముందు కూడా.. తన దగ్గరకు డబ్బులేవని.. భార్యకి పిల్లోడికి ఏమైనా కొందాం అన్నా డబ్బులేవని కానీ ఎవరి అడగలేను .. నాలుగు నెలలు రెంట్  కూడా కట్టలేదు. పిల్లోడి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే అత్తయ్య, మామయ్యలు సాయం చేశారని చెప్పి ఏడ్చేశాడు. ఈ గేమ్ తనకి చాలా అవసరం అని తెగ బాధపడిపోతే షణ్ముఖ్ ఓదారుస్తాడు. ఇక రవి, విశ్వ మాట్లాడుకుంటూ శ్రీ రామచంద్ర, హామిడాలను చూపిస్తూ విల్లైద్దరి జంట క్యూట్ ఉంటుందని, హమీద ఎక్కడ ఉంటే శ్రీరామ్ అక్కడికి వస్తున్నాడు అని, హమీద తన లిమిట్స్ లో ఉంటూనే ఫ్రెండ్లీ గా  ఉంటాడని రవి విశ్వ తో చెప్తాడు. మరో పక్క షన్ను నిద్రపోవడం తో కుక్కలు మొరిగాయి. దీంతో హౌస్ కెప్టెన్‌ (captain )గా ఉన్న విశ్వ స్విమ్మింగ్ పూల్‌లో 21 సార్లు దూకాలని పనిష్మెంట్ ఇస్తాడు. దీంతో విశ్వ  మిలిటరీ మ్యాన్‌లా ఉన్నాడంటూ ప్రియ సెట్టైర్ వేస్తుంది.

ఇక ఈ వారం హౌస్ మేట్స్ కు ‘వాల్‌ ఆఫ్‌ షేమ్‌'(wall of shame) అనే నామినేషన్స్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్ బాస్(big boss). ఇందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరుచొప్పున నామినేట్ చేసి అందుకు గల కారణాలను తెలియజేయాలని చెప్పారు. టైల్స్‌ పై ఎవర్ని అయితే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల పేర్లతో ఉన్న స్టాంప్‌ని గుద్ది.. ఆ టైల్స్‌ని సుత్తితో బద్దలు కొట్టాలని చెప్పారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్(Nominations) టాస్క్  పోటాపోటీగా సాగింది. ముందుగా  బిగ్ బాస్  శ్రీరామ్ ని  మొదలపెట్టమనగా శ్రీ రామ్ అందరు ఊహించినట్టే  మానస్‌ని నామినేట్ చేశాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేస్తూ తనకి డెవిల్ స్టిక్కర్ పెట్టినందుకు నామినేట్ చేసినట్టు చెప్పాడు శ్రీరామ్. ప్రియ, సన్నీల మధ్య  హీట్ డిస్కషన్ జరిగింది. నటరాజ్ మాస్టర్.. సిరి చాలామందిని వాడు వీడు అని మాట్లాడుతుంది.. అది నాకు నచ్చలేదని సిరిని నామినెటే చేసిన నటరాజ్. అలాగే కాజల్ చాలా సెల్ఫిష్ అని .. అందుకే ఆమెను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. రవి శ్రీరామ్‌ని నామినేట్ చేస్తూ.. తనని వరస్ట్ పెర్ఫామర్‌ అన్నాడని నామినెటే చేస్తున్న అని చెప్పాడు . అలాగే జెస్సీని నామినేట్ చేస్తూ.. ఇంత మంచి ప్లేట్ ఫారం ని వేస్ట్ చేసుకుంటున్నావేమో అని నాకు అనిపిస్తోంది అని, ఎన్నాళ్ళు ఇలా అంత చిన్న  చెడ్డీలు వేసుకుని ఆ తగిలిన దెబ్బనే చూపిస్తావు . ఆ మైండ్ సెట్ లో ఉంటావో నాకు అర్ధం కావట్లేదు అని అన్నాడు రవి. దీంతో రియాక్ట్ అయిన జెస్సీ.. టాస్క్‌ (Task)లో నేను ఎలా ఆడానో అందరికీ తెలుసు.. మీరు కుళ్లు జోకులు వేసుకుంటే మధ్యలో వచ్చి దూరలేను.. నాకు అది నచ్చదు.. నేను పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడుతున్న అని గట్టిగానే సమాధానం ఇచ్చాడు జెస్సీ.

లహరి శ్రీ రామ్ ,ప్రియను నామినేట్ చేస్తూ.. టాస్క్(Task) అయిన తరువాత ప్రియ గారు తనకి దూరంగా ఉంటున్నారని ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని ప్రతిదానికి పాయింట్ చేస్తుందని చెప్పింది లహరి.

lahari priya coversationనాతో మీరు ఎందుకు డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని లహరి అనడంతో.. నోరు జారిన ప్రియా. నువ్వు  ఎప్పుడూ హౌస్‌లో ఉన్న మగాళ్లతో బిజీగా ఉంటావ్.. కేవలం నువ్వు  మగాళ్లతోనే కలుస్తున్నావ్ అని అన్నది..

ఎవరితో బిజీగా ఉన్నానో  పేర్లు చెప్పుఅంటే.. రవి, మానస్ మిగిలిన వాళ్లు అని అనేసింది.. స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లతో ఆడు గేమ్.. చాలామంది మగాళ్లు ఉన్నారు.. కానీ నువ్వు  వాళ్లని నామినేట్ చేయవు.. ఎందుకంటే నీకు మగాళ్ళతో ప్రాబ్లమ్ ఉండదు. నీకు ఆడవాళ్ళతోనే   ప్రాబ్లమ్ అని అనేసింది ప్రియ. తరువాత  లహరిని తిరిగి నామినేట్(Nominate) చేసింది ప్రియ. అప్పుడు కూడా ఆమె ఎప్పుడూ మగాళ్లతోనే ఉంటుందని ఘాటు గా అన్నడంతో గొడవకు దారి తీసింది.  దీంతో చిర్రెత్తుకొచ్చిన లహరి.. మీరు పదే పదే.. మగాళ్లతో ఉంటున్నా అని గుద్ది గుద్ది చెప్పడం కరెక్ట్ కాదని .. మాట్లాడుతుంటే మెన్ మెన్ అంటున్నావ్.. నేను అమ్మాయిలతో ఎవరితో మాట్లాడలేదో చెప్తావా? అంటూ ప్రతి అమ్మాయి దగ్గరకు వెళ్లి నేను నీతో మాట్లాడటం లేదా? అని అడిగింది.. వాళ్లంతా మాట్లాడుతున్నావ్ అని చెప్పడంతో.. లహరి ఆవేశం కట్టలుతెంచుకుంది.

వీళ్లకి తెలియని కొన్నింటిని నేను నా కళ్లతో చూశానని ప్రియ అనడంతో.. ఏం చేశానో చెప్పండి అని లహరి అన్నది.. ‘నువ్వ రవి తో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకుంటూ ఉన్నావు.. అది ఫ్రెండ్లీ హగ్ అయినా  ఏమైనా అయ్యి ఉండొచ్చు అని అన్నది ప్రియ. ఆ మాట చెప్పగానే లహరి షాక్ అయ్యింది. చప్పట్లు కొడుతూ ఏం చెప్పావ్ అని షాక్‌లోకి వెళ్లింది. వెంటనే రవి.. అక్కా ఏంటక్కా ఇది?? అడుగుతుండగా.. ఒక్క నిమిషం రవీ అంటూ.. లహరి ఎమోషనల్ అయ్యింది.

offsense comments priya

దాంతో హౌస్ లో రవి, లహరి, ప్రియాల మధ్య ఆర్గుమెంట్ తారాస్థాయికి వెళ్ళింది. విశ్వ, సన్నీ కూడా హాగ్ గురించి లహరి పాయింట్ చేయడం కరెక్ట్ కాదని ప్రియా తో వాదనకు దిగుతారు.

నామినేషన్స్(Nominations) టైం లో లహరి మీద ప్రియా నోరు పారేసుకోవడం తో ఈ గొడవకు దారి తీసింది. మరి ప్రియా, లహరి ల మధ్య గొడవ కొనసాగుతుందా లేదా క్లియర్ చేసుకుంటారో చూడాలి.