ఆనాటి అల్లు రామలింగయ్య దగ్గర నుండి ,అల్లు అర్జున్ వరకు అల్లు వారి కుటుంబం తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది .

Allu family

రంజు భలే రామ్ చిలక అంటూ అల్లు రామలింగయ్య ,

మెకానిక్ అల్లుడు,మాస్టర్,పెళ్లి సందడి ,పెళ్ళాం ఊరెళితే ఇలా ఎన్నో హిట్స్ తో అల్లు అరవింద్ ,

గంగోత్రి,బన్నీ,ఆర్య,ఆర్య-2, పరుగు,వరుడు,జులాయి ,రేసుగుర్రం ,ఇద్దరు అమ్మాయిలతో,డీజే ,s % సత్య మూర్తి,రుద్రమ దేవి,అల వైకుంఠపురం లో ఇలా ఎన్నో సూపర్ హిట్స్ తో అల్లు అర్జున్

ఇలా అల్లు వారి ఫ్యామిలీ తెలుగు సినీ ఇండస్ట్రీ లో వారసత్వం ,ప్రతిభ తో ముందుకు దూసుకు పోతోంది ..

ఇదే క్రమం లో అల్లు అర్జున్ బంగారు తల్లి అల్లు అర్హ కూడా వెండి తెర మీదకి ఎంట్రీ ఇవ్వబోతోంది .

ఇది అల్లు వారి ఇంట నాలుగో తరం సినీ ఇండస్ట్రీ లో కి …

ఇప్పటికే అంజలి అంజలి సాంగ్ రీమేక్ తో అల్లు అర్హ అందరికీ పరిచయస్తు రాలే … తన ముద్దు ,ముద్దు మాటలు ,బోసి నవ్వులు అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ కూతురుని చిన్నప్పటి నుండే తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేశారు అనే చెప్పాలి .

అయితే  , తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి సినిమా (first movie )పరిచయం అనేది ఎంతో ప్రత్యేకం. వారి కెరీర్‌కు (career) పునాది వేసే తొలి సినిమాకు సెలబ్రిటీలు ఎంతో ఇంపార్టెన్స్‌ ఇస్తారు .

వెండితెరపై వారి పిల్లల ఎంట్రీ కూడా మంచి సినిమా తో చాలా ఘనంగా ఉండేలా చూసుకుంటారు.

ఇప్పుడు మన స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా తన గారాలపట్టి అర్హ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ చేశాడు.

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ (Stylish star allu arjun) గారాల పట్టి అల్లు అర్హ సందడి చేయనున్నారు.

పౌరాణికం

ఇటీవల గుణశేఖర్ శాకుంతలం అనే ఒక పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి ఇప్పటికే మన అందరికీ తెలిసిందే.

మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల అపర ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

sakuntalam

ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తుంది.కేరళలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నమలయాళీ నటుడు  దేవ్ మోహన్ తో పాటు భారీ తారాగణం ఈ సినిమాలో భాగంకానుంది.

వీరిద్దరికీ జన్మించిన బాలుడు భరతుడి పాత్రలో అర్హ మెరవనుంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే భారీ సెట్స్ రూపొందించారు.

పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ చిత్రం ను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిచనున్నారు.

ఇప్పటికే సమంత ఈ సినిమా కోసం గత  నాలుగు నెలల నుండి క్లాసికల్‌ డ్యాన్సులు కూడా నేర్చుకుంది.

ఈ సినిమాను ‘దిల్‌’ రాజు సమక్షంలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

కరోనా కారణంగా వాయిదాపడిన ఈ చిత్రం చిత్రీకరణ తాజాగా తిరిగి ప్రారంభమైంది.

ఈ మేరకు చిత్రయూనిట్ ఒక స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది.

అల్లు రామలింగయ్య గారి ముని మనవరాలు, అల్లు అరవింద్ గారి మనవరాలు, అల్లు అర్జున్ కూతురు అర్హ కు శాకుంతలం టీం స్వాగతం చెబుతోంది అని అధికారికంగా ప్రకటించారు.

బన్నీ ట్వీట్

దీనితో బన్నీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అల్లు వారి నాలుగో తరం కూడా శాకుంతలం సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతోంది.

ఈ సినిమాలో ప్రిన్స్ భరతగా అర్హ కనిపించనుంది.ఇది మేం గర్వించాల్సిన సమయం.

గుణ శేఖర్, నీలిమ గుణలకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. గుణ శేఖర్  ఆయన కూతురిని పరిచయం చేయడమే కాకుండా నా కూతురు అర్హ ని కూడా  ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

నేను సమంతతోనూ సినిమాల్లో నటించాను.. ఇప్పుడు నా కూతురు కూడా నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది.

శాకుంతలం సినిమా యూనిట్‌ అందరికీ ఆల్ ది బెస్ట్ (All the best) అని బన్నీ పేర్కొన్నారు.

థాంక్యూ

నా కుమార్తెను ఇలాంటి అందమైన సినిమాతో వెండితెరకు పరిచయం చేస్తున్న గుణశేఖర్‌, నీలిమకు కృతజ్ఞతలు’’ అని బన్నీ ట్విట్టర్ ట్వీట్‌ (twitter tweet) చేశారు.

అభిమానుల సందడి

ఇక అల్లువారి గారాల పట్టి తెలుగు బిగ్‌స్క్రీన్‌ (Big screen) పై సందడి చేయబోతుందని తెలిసిన అభిమానులు సోషల్‌ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

సమంత, అర్హను ఒకే స్క్రీన్‌ మీద చూడబోతున్నామని తెలుగు ప్రేక్షకులు చాలా ఎగ్జైట్‌ అవుతున్నారు.

మొత్తం మీద అల్లు వారి ఇంట కొత్త సినీ సందడి మొదలయ్యి ,తెలుగు ప్రేక్షకులని కనువింపు చేస్తున్నారు అనే చెప్పాలి .

ఆల్ ల్ ది బెస్ట్ అర్హ (All the best Arha)