బంగాళ దుంపలు (పొటాటోస్ – Potatos) చిన్న ,పెద్ద అందరికీ చాలా ఇష్టమైనది. ఆలు అంటే ఆల్ టైం ఫేవరెట్ అనే చెప్పాలి.

మరి ఈ బేబీ పొటాటోస్ (Baby potatos) ,అదేనండి ,చిన్న బంగాళ దుంపల  తో వెరైటీ (variety) అంటే వాహ్ అంటారు ఇంట్లో అందరూ చిన్న ,పెద్ద ..  మరి ఇక ఆలస్యం చేయకుండా వెరైటీ బ్యాంగ్ బ్యాంగ్  ఎలా చేయాలో చూసేద్దామా !!

తయారు చేయడానికి కావలసిన పదార్దాలు :

బేబీ పొటాటోస్‌ – పావు కేజీ; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); పసుపు – అర టీ స్పూను;నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు , బొంబాయి రవ్వ – ఒక టేబుల్‌ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – మూడు;  కొత్తిమీర తరుగు- గార్నిషింగ్ కోసం

తయారు చేసే విధానం తెలుసుకుందామా మరి …

ముందు గా   బేబీ పొటాటోస్‌ను శుభ్రంగా కడిగి ,కుక్కర్ లో పెట్టి ఉండికించుకోండి.  చల్లారాక తొక్క తీయాలి.

Baby potatos peel

ఇపుడు ఒక గిన్నెలో  బొంబాయి రవ్వ,ఉప్పు, ఎండు మిర్చి ముక్కలు,పంచదార,  పసుపు వేసి బాగా కలపాలి

ఇపుడు ఉడికించిన బంగాళ దుంపలను ఈ మిశ్రమం లో వేసి దొర్లించాలి

ఇపుడు  స్టౌ మీద బాణలి పెట్టి దానిలో లో కొంచెం నూనె వేసి వేడయ్యాక కొంచెం పచ్చి మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి

దీనిలో  బేబీ పొటాటోలు జత చేసి ఒక పది నిమిషాలు ఉడికించాలి,మధ్యమధ్యలో మాడి పోకుండా కొంచెం కలుపుతుండాలి

బేబీ పొటాటోస్‌ మంచి  బంగారు రంగులోకి (Gold colour)  మారగానే దింపేయాలి.

ఇపుడు దీని మీద కొత్తిమీర తరుగు  (Garnishing )వేసి వేడి వేడిగా వడ్డించండి .

యమ్మీ ,యమ్మీ టేస్టీ టేస్టీ బ్యాంగ్ బ్యాంగ్ రెడీ …

ఇది మంచి స్నాక్స్ ఐటమ్ (Snacks item). చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా చాలా బాగుంటుంది .పిల్లలు ,పెద్దలు అందరూ చాలా ఇష్టం గా తింటారు . అబ్దుతః, అనక మానరు …

ఇక ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేసి మంచి వర్షం వస్తుననపుడు ఆహా ఏమి రుచి అని మీ కుటుంబం తో ఆహ్వాదించండి మరి …