కొత్తిమీర(Coriander)ను సాదారణంగా అనేక రకాల వంటల(Cooking) తయారిలోను. అలాగే గార్నిష్(Garnish) కు ఉపయోగిస్తాము.

ప్రతి రిఫ్రిజిరేటర్(Refrigerator) లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక పవర్ఫుల్ హెర్బ్(Powerful Herb), మంచి సువాసన(Smells good) కలిగి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) అందిస్తుంది.

కొత్తిమీరలో థియామైన్(Thiamine) తో సహా అనేక ఖనిజాలు(Minerals) మరియు విటమిన్లు(Vitamins) సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి(Vitamin C), విటమిన్ బి(Vitamin D),భాస్వరం(Phosphorus,),కాల్షియం(Calcium),ఇనుము(Iron), నియాసిన్(Niacin), సోడియం(Sodium), కెరోటిన్(Carotene), మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్(Liquid Acid), పొటాషియం(Potassium), కార్బొహైడ్రేట్స్(Carbohydrates), ప్రొటీన్(protein), ఫ్యాట్(Fat), ఫైబర్(Fiber) మరియు నీరు(Water) ఉంటాయి.

కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాల(Type of pepper)తో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది.

ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్స(Treatment)లో సహాయపడుతుంది. కొత్తిమీర కొన్ని అస్వస్థతలకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము. కొత్తమీర ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు(Anti Oxidants). ఒత్తిడి(Stress)ని తగ్గిస్తాయి.

కొత్తిమీర తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని పరిశోధన(Research)లో తేలింది. జ్ఞాపకశక్తి(Memory)ని పెంపొందించడానికి కూడా ఇది ఉపజాయపడుహ్తుంది. కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్’ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.

ఇవి రక్తపోటు(BP) ,కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు(Heart issues) ,స్ట్రోక్(Stroke) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చర్మాన్ని(Skin) కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు.

ముఖం పైన ఉండే మొటిమల(Pimples)కు, పొడి చర్మం(Dry skin), నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది.

కొత్తిమీర ఆకులలో యాంటీ మైక్రోబియల్(Anti Microbial) పదార్థాలు ఉన్నాయి. ఇవి కడుపు ఇన్ఫెక్షన్లు(Stomach Infection) ,సోకిన ఆహారం వల్ల వచ్చే వ్యాధుల నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అంతే కాదు పచ్చి కొత్తిమీర యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) నుండి రక్షించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలం(Bones Strong)గా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K'(Vitamin K) కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్(Zinc), కాపర్(Copper), పొటాసియం (Potassium)వంటి మినరల్స్(Minerals)’ని కలిగి ఉంది

కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్(Blood Purifier) అంతే కాదు, బ్లడ్ బిల్డర్(Blood Builder) కూడా. కొత్తిమీరలో పోషకాల(Nutrients)తో పాటు, ఐరన్ కంటెంట్(Iron Content) అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయా(Anemia)ను తగ్గిస్తుంది.

కొత్తిమీర ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అవి రెగ్యులర్ తీసుకోవడం వల్ల మెదడు వాపు(Brain Swelling), జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆందోళన ,ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కొత్తిమీర, ఫ్రీ రాడికాల్స్(Pre Radicals)’కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎలేమోల్(Elemol), కామ్ఫార్(camphor), బొర్నెఒల్ (Borneol), కార్వోన్(corvine), క్వుర్సేటిన్(quercetin), కేంఫెరాల్(camphorol), మరియు ఎపిగేనిన్(epigenin )’లను ఎక్కువగా కలిగి ఉండటం వలన ఫ్రీ రాడికాల్స్, శరీరంలో కలుగచేసే నష్టాలను తగ్గిస్తుంది.

రోజు వారి రొటీన్ లైఫ్(routine) లో కొత్తమీరని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.