వేసవి కాలం(Summer season)లో వేడిని తట్టుకోవడానికి చాలా రకాల ఆహారాలు, పండ్లు ఉండనే ఉంటాయి. అందులో పుచ్చకాయ(Watermelon), ఖర్భుజా(Musk Melon), మామిడి పండు(Mango) ఇలా చాలానే వున్నాయి వాటిలో సమ్మర్ స్పెషల్(Summer special) గా చెప్పుకునేది తాటి ముంజలు ఒక్కటి. చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు.

ఐస్ పామ్(Apple Ice) లేదా తాటి ముంజలు(Taati Munjalau) అనేది సీజనల్ పండు(Seasonal Fruit), ఇది చక్కెర తాటి చెట్టుపై పెరుగుతుంది మరియు లిచీ(Litchi) లాగా కనిపిస్తుంది. ఇది రుచిలో అమోఘమైనది మరియు శీతలీకరణ(Cooling Properties) లక్షణాలను కలిగి ఉంటుంది.

చల్లదనాన్ని ఇచ్చే ఈ తాటి ముంజలుతో రెసిపీస్(Recipes) ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆ రెసిపీస్ ఏంటో చూడంది

కావాల్సినవి:

తాటి ముంజలు 6, (చిన్న ముక్కలు గా తరగాలి )
వేడిచేసి పాలు 2 కప్పులు,
చక్కెర 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి 1/4 టీస్పూన్

తాటి ముంజలు పాల రిసిపి తయారు చేసే విధానం:

* ఒక గిన్నెలో పాలు పోసి, దాని అసలు పరిమాణంలో మూడు నాల్గవ వంతు వచ్చే వరకు చిన్న మంట మీద మరిగించాలి
* పంచదార మరియు యాలకుల పొడి వేసి కొన్ని మీటర్ల వరకు ఉడకనివ్వండి. మంటను ఆపివేసి రూమ్ టెంపరేచర్(Room Temperature) తీసుకురండి.
* చిన్న ముక్కలుగా తరిగిన తాటి ముంజలు వేసి కలపాలి.
* కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌(Fridge)లో ఉంచి సర్వ్(Serve) చేయండి.