భారతీయులు తులసి(Tulasi) చెట్టును దైవంగా భావించి పూజిస్తారు. ఈ తులసి చెట్టు ఒక ఔషధ(Medicines) గని. దీనితో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) కలుగుతాయి. తులసి ఆకులతో పాటు గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

తులసి గింజలు (Tulasi seeds) అధిక మొత్తంలో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ లను కలిగి ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. తులసి గింజలను తినడంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. తులసి ఆకులతో పాటు తులసి గింజల లో కూడా అనేక పోషకాలు(Nutritions) ఉంటాయి. ఇవి శరీరానికి ఏ విధంగా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి తెలుసుకుందాం!

తులసి గింజల్లో ప్రోటీన్స్ (Proteins), ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చక్కగా పనిచేస్తాయి. తులసి గింజలు అనేక రోగాల నివారణకు పనిచేస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ప్రతి రోజూ కొన్ని తులసి గింజలను తింటే అనేక రకాల రుగ్మతల నుండి బయటపడవచ్చు.  జీర్ణక్రియ(Digestion) మెరుగుపడుతుంది: తులసి గింజలను ఉదయాన్నే ఖాళీ కడుపున తింటే జీర్ణక్రియ  మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.

ప్రేగు(Intestine)ల్లో పేరుకుపోయిన మలం తేలికపడి మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో మలబద్దకం (Constipation) సమస్యలు తగ్గుతాయి. బరువును తగ్గిస్తుంది: తులసి గింజలను తింటే ఆకలి కలిగే అనుభూతిని తగ్గించి శరీరానికి కావలసిన పోషకాలను (Nutrients) అందించి బరువును తగ్గించడానికి (Reduces weight) చక్కగా పనిచేస్తాయి.

రోగనిరోధక శక్తి(Immunity Power)ని పెంచుతుంది: తులసి గింజలు ఆరోగ్యానికి మంచివి. తులసి గింజల్లో ఫ్లేవనాయిడ్స్ (Flavonoids), ఫినాలిక్ (Finalic) ఉండడంతో ఇవి రోగనిరోధకశక్తిని పెంచడంలో చక్కగా పనిచేస్తాయి. వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి. జలుబు, దగ్గు, ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.

శ్వాస సంబంధిత జబ్బులను తగ్గించడానికి తులసి చక్కగా పనిచేస్తుంది. జలుబు(Cold), దగ్గు(Cough) చేసినప్పుడు తులసి రసంలో (Tulasi juice) తేనె (Honey) కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది అస్తమా నివారణకు సహాయపడుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది.

తులసి రసంలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే కడుపు నొప్పి (Stomach ache) నుంచి విముక్తి కలుగుతుంది. ఇది కడుపులో ఏర్పడ్డ నులిపురుగులను (Worms) కూడా నశింపజేస్తుంది. ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

నోటి సమస్యలను తగ్గిస్తుంది: తులసి గింజలను నమిలి తింటే దంతాలలో పేరుకుపోయిన బ్యాక్టీరియా (Bacteria) నశించి దంత సమస్యలు (Dental Problems) దూరమవుతాయి. నోటి దుర్వాసన(Bad Breathe) తగ్గుతుంది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

మెదడు పనితీరు(Brain Work)ను మెరుగుపరచడానికి తులసి చక్కగా పనిచేస్తుంది. కాచి చల్లార్చిన నీటిలో తులసి రసాన్ని (Tulasi juice) కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగడంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి (Memory) పెరుగుతుంది.