విటమిన్లు శరీరానికి రక్షణ కవచాలు.రక్షణ కవచంలా అవి శరీరాన్ని రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతూ ఉంటాయి.

వీటిలో అత్యంత ముఖ్యంగా విటమిన్ డి.

శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికీ విటమిన్ డి అత్యవసరం. చర్మం, వెంట్రుకలు, కండరాలు, ఎముకలు అన్నీ సమర్ధంగా పని చేయాలంటే విటమిన్ డి శరీరానికి ఖచ్చితంగా అందాలి. కానీ ఈ విటమిన్ లోపం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది.

మన నిత్య జీవితం లో ,వర్క్ ఫ్రొం హోమ్ ,ఐటీ ఉద్యోగాలు,పిల్లలకి ఆన్లైన్ క్లాసు లు ,ఏసీ ల లో నే జీవితం వీటితో బయట అవసరమే లేకుండా ఇంట్లో నే టైం అంతా గడిపేస్తున్నాం. దీనితో మన శరీరానికి తగినంత విటమిన్ డి అందడం లేదు.

ఆఫీస్ లకి ,బయటకి వెళ్లేవారు ప్రస్తుత కాలం లో కాలుష్యం కి తగ్గట్టుగా ధరించే దుస్తులు, హెల్మెట్ల కారణంగా శరీరానికి సూర్యరశ్మి సరిపడా సోకే వీలు లేకుండా అవుతోంది .దీనితో బయట తిరిగిన మన శరీరానికి విటమిన్ డి అందడం లేదు .

ఈ విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి ,ఏ ఆహార ఉత్పత్తుల్లో విటమిన్ డి ఉంటుంది అనేది తెలుసుకుందాం.

సూర్య రశ్మి ద్వారా విటమిన్ డి

విటమిన్ డి మన శరీరానికి సరిపడా అందడం కోసం ప్రతీ రోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యరశ్మి చర్మానికి తగిలేలా చూసుకోవాలి. కనీసం 50% ఎండ చర్మానికి తగిలినప్పుడే మానవ శరీరానికి సరిపడా విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, వెంట్రుకలు ఊడిపోవడం, కీళ్లనొప్పులు లాంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని తెలిపేవే. చిన్న పిల్లల్లో విటమిన్ డీ లోపం వల్ల రికెట్స్ (Rickets) వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పెద్దవారిలో ఎముకలు మెత్తబడిపోతాయి. కావల్సినంత విటమిన్ డీ లేకపోతే ఆడవారిలో బ్రెస్ట్ కాన్సర్ ,మగవారిలో కొలొరెక్టల్ కాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

విటమిన్ డీ లభించే ఆహార పదార్ధాలు..

మాంసాహారంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కనుక మాంసం ,చేపలు తరచుగా ఆహారంలో ముఖ్య భాగంగా చేసుకోవాలి. వీటితో పాటూ ఎగ్స్ కూడా చాలా మంచివి. అయితే ఎగ్స్‌ని యోక్ తో సహా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డీ ఉండేది ఎగ్ యోక్‌లోనే. పాలు, పెరుగు, మజ్జిగ, బటర్, ఛీజ్, పన్నీర్ ఇలా అన్నిరకాల పాల ఉత్పత్తుల లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.

ఫోర్టిఫైడ్ ఆహారాలు అనగా కొన్ని తృణధాన్యాలు వెన్నమరియు పాలు వంటి వాటిలో విటమిన్ D లభ్యమవ్తుంది. బార్లీ, రాగులు, గోధుమలు,ఓట్స్ లో విటమిన్ డీ లభిస్తుంది. అయితే వీటిని ప్రాసెస్ చెయ్యకుండా తీసుకోవాలి.

మష్రూమ్స్‌లో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువ. విటమిన్ డీ కూడా ఎక్కువే. వీటిని పైగా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. పిజ్జా, ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్, సాండ్విచ్, స్టర్-ఫ్రైడ్ వెజ్జీస్.

ఇలా రకరకాల వంటకాల్లో వీటిని నిత్య జీవితంలో భాగంగా చేసి మీ మరియి మీ కుటుంబ సభ్యులు అందరూ విటమిన్ డి లోపాన్ని అధిగమించండి.

ఇంజెక్షన్

విటమిన్ D యొక్క ఇంజెక్షన్ 6 నెలల పాటు తీసుకోవచు. ఇది సురక్షితమైన మరియు అనుకూలమైన ప్రత్యామ్నాయం. ఔషధాలను తీసుకోవటానికి ఇష్టపడని వారికి ఇది మంచిది.

మాత్రలు లేదా ద్రవాలు

విటమిన్ D ఉన్న కొన్ని మాత్రలు మరియు ద్రవాలు కూడా అందుబాటులో ఉంటాయి. రోజువారీ, వారంవారీ లేదా నెలవారీగా తీసుకోవచ్చు. దీని ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, పిల్లలు పెరుగుతున్నప్పుడు, త్వరగా లోపం రాకుండా అరికడ్తుంది.అయితే, ఇవి తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇలా అన్ని విధాలా విటమిన్ డి ని మన శరీరానికి అందించి ఆరోగ్యంగా,ఆనందంగా ఉందాం.