మారుతున్న జీవనశైలి(Life style), ఆహరపు అలవాట్లు(Food Habits) కారణంగా కాలానుగుణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఉబకాయం(Obesity), అధిక రక్తపోటు(High BP), అజీర్ణ(Indigestion) వంటి సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్లు డిటాక్సిఫై (Detoxify)చేయించుకోవడం చాలా ముఖ్యం.

అంటే కడుపులో పేరుకుపోయిన వ్యర్థాల(WASTAGE)ను తొలగించడం సహా మలినాలను శుభ్రం చేసేందుకు డిటాక్స్ పానీయాల(Detox Drink)ను తాగుతుంటారు. అందుకే చాలా మంది వైద్యులు(Doctors), నిపుణులు(Experts) ఉదయం లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్లు తాగాలని సూచిస్తుంటారు.

అయితే మీరు సాధారణంగా తాగే మంచి నీళ్ల ప్లేసులో డిటాక్స్ వాటర్ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ డిటాక్స్ డ్రింక్ తాగితే శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకునెట్టివేస్తుంది. దీని ద్వారా శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ఈ డిటాక్స్ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

దాల్చిన చెక్క, తేనె తో డిటాక్స్

దాల్చిన చెక్క(Cinnamon), తేనె(Honey) కలిపిన పానీయం శరీరంలోని మలినాలను శుభ్రం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ డిటాక్స్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్(Anti Fungal) లక్షణాలు ఉన్నాయి. అవి శరీరంలోని మురికిని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అదే సమయంలో, తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కలయిక మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

పుదీనా, దోసకాయ డిటాక్స్

పుదీనా(Mint), దోసకాయ(Cucumber)తో చేసిన డిటాక్స్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేస్తుంది. దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అందువల్ల వేసవిలో ఈ డిటాక్స్ తాగడం వల్ల డీహైడ్రేషన్(Dehydration) నుంచి బయటపడొచ్చు. మరోవైపు పుదీనా ఆకులు వివిధ రకాల యాంటీ బాక్టీరియల్(Anti Bacterial), యాంటీవైరల్(Anti Viral) లక్షణాలను కలిగి ఉంటాయి.

డీటాక్స్ వాటర్ ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య పరంగా కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ స్కిన్ గ్లో(Skin Glow) పెరగడాన్ని కూడా మీరు గమనించొచ్చు.

ఈ డీటాక్స్ వాటర్ ను బయట కొనుక్కొని తాగాలని మాత్రం ఎలాంటి రూల్ లేదు. కాబట్టి దీన్ని మీరు స్వయంగా మీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే అందుకోసం మీరు ముందుగా మంచినీళ్లతో పాటు కొన్ని రకాల పండ్లు(Fruits), కూరగాయలు(Vegetables), హెర్బ్స్(Herbs) కావాల్సి ఉంటుంది.

సాధారణంగా డీటాక్స్ వాటర్ తయారు చేయాలంటే రెండు వస్తువులు కావాలి. అందులో ఒకటి మనకు నచ్చిన పండ్లు, కూరగాయలు, లేదా హెర్బ్స్. వీటిని క్లీన్ చేసుకుని, మీకు కావాలంటే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని వేడి చేసిన లేదా చల్లని నీటితో కలుపుకోవాలి.

ఒక వేళ నీళ్లు అయితే.. ముందుగానే నీటిని వేడి చేసుకుని పదార్థాలను కలుపుకోవాలి. చల్లని నీరు కావాలంటే ఇవన్నీ కలిసిన తర్వాత.. ఒకటి, రెండు గంటల పాటు ఫ్రిజ్ లో పెడితే చాలు. అంతే మీకు కావాల్సిన డీటాక్స్ వాటర్(Detox Water) రెడీ అయిపోతుంది.