భారతీయ వంటకా(Indian Recipes)ల్లో అనేక రకాల సుగంధ ద్రవ్యాలను(Spices) ఉపయోగిస్తారు. మన వంట గదిలో అనేక మూలికలు(Herbs), సుగంధ ద్రవ్యాలు ఉంటాయి.

ఇవి మన వంటకాలకు రుచిని తీసుకురావడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనకరమైన అనేక లక్షణాలను కలిగి ఉంటాయి. లవంగాలు దగ్గు(Cloves For Cough), జలుబు(Cold)ను తగ్గడానికి సహాయపడతాయి. పసుపు(Turmeric) యాంటీ బైయోటిక్(Anti – Biotic) గా పని చేస్తుంది.

పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. అలాంటి మరొక మసాలా(Another Spice) బే ఆకు(Bay Leaf) దీన్ని కొంతమంది బిర్యానీ ఆకు అని కూడా పిలుస్తారు. బిర్యానీ(Biryani), పులావ్(Pulav) మరియు చాలా వంటకాల్లో(Many Dishes) సాధారణంగా ఉపయోగిస్తారు.

ఇది వంటకాల్లో వాడటం వల్ల వంటకాలు రుచి(TASTY)గా తయారవుతాయి. ఇదికాకుండా, దీనిని శతాబ్దాలుగా సాంప్రదాయ మెడిసిన్(Traditional Medicine) కూడా ఉపయోగిస్తారు.

మంచి పోషకాల(Good Nutrients)ను అందించి మీ జీర్ణక్రియ(Digestive)ను సులభతరం చేసే బిర్యానీ ఆకు టీ తో కూడా ప్రయోజనాలు వున్నాయి. మెటబాలిజం(Metabolism), జీర్ణక్రియను వేగవంతం చేయడానికి దాల్చిన చెక్క(Cinnamon) యొక్క ఉండే మంచి లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇది బరువు తగ్గడాని(Weight Loss)కి సహాయపడుతుంది. బెంగళూరుకు చెందిన పోషకాహార నిపుణుడు చెప్పిన దాని ప్రకారం, ఆల్ ఇన్ వన్ మసాలా(All in ONE Masala) “ఇన్సులిన్ యొక్క ఉద్దీపన(Stimulus Insulin), ఒకరి జీవక్రియ రేటు పెంచడాని(Increases Digestive Rate)కి సహాయపడుతుంది.

” దాల్చిన చెక్క కడుపులోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను తగ్గించడానికి(Decreases Carbon dioxide Levels) సహాయపడుతుంది, మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

బిర్యానీ ఆకులో యాంటీఆక్సిడెంట్లు(Anti Oxidants), విటమిన్ ఎ, సి, బి 6(Vitamin A,C,B6), ఐరన్(Iron), పొటాషియం(Potassium), మరెన్నో అధికంగా ఉంటాయి. ఇది జీర్ణశయాంతర ప్రేగువ్యవస్థపై బలమైన ప్రభావాన్ని(Influence) చూపుతుంది. ఈ మసాలా దినుసులలో లభించే సమ్మేళనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్(IBS) నుండి ఉపశమనం(Relaxation) కలిగిస్తుంది.

అంతే కాకుండా మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బిర్యానీ ఆకు ఒత్తిడి(Stress) కలిగించే హార్మోన్స్‌ని నియంత్రించడాని(Controls Hormones)కి ఉపయోగపడుతుంది.

మీరు ప్రశాంతంగా, విశ్రాంతి(Rest) తీసుకోవడానికి సాయపడుతుంది. అంతేకాక, మసాలా దినుసులలోని రోగ నిరోధక(Immunity power) లక్షణాలు మన శరీరాన్ని ఇన్‌ఫ్లమేషన్(Body Inflammation) నుండి రక్షిస్తాయి.