మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది – ‘సంసారం గుట్టు రోగం రట్టు’ అని. అంటే మన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలి, ఏదైనా జబ్బు గిబ్బు ఉంటే ఎవ్వరి ముందైనా దాపరికం లేకుండా చెప్పుకోవచ్చు అని. సరే, ఇంతకీ ఈ రోగాన్ని నిర్దారించాల్సింది వైద్యుడు కదా. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం మరో అడుగు ముందుకేసి, శరీరంలోని రోగాలను నిర్ధారించడానికి వైద్యుడు అవసరం లేదు AI Eyescan ఉంటే చాలు అంటోంది. AI అంటే ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్. అవును AI అద్ధరంగా తయారైన algorithms ఒక్కోసారి నిపుణుడైన వైద్యునితో సమానం. మరి ఆ వివరాల్లోకి వెళ్దామా.

వియన్నా లోని Medical University of Vienna లోని director of the ophthalmology department, Dr. Ursula Schmidt-Erfurth ఒక AI Eyescan ను రూపొందించారు. Optical Coherence Tomography (OCT) తో చేసే కంటి x-రే ద్వారా మన శరీరంలో ఉన్న డయాబెటిస్ మొదలుకుని autoimmune, neurodegenerative వ్యాధుల వరకు ఎన్నో వ్యాధులను కనిపెట్టవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే మన కన్ను కేవలం చూడడానికి మాత్రమే కాదు, ఆ కంటి పొరల్లో మన శరీర ఆరోగ్యానికి సంబంధించి సూచనలు ఉంటాయట. AI ఆధారంగా కంటికి తీసే ఎక్స్-రే తో ఆ వ్యక్తి వయసు, లింగం, పొగ తాగే అలవాటు, బ్లడ్ షుగర్, బీపి సైతం తెలుస్తుందట. అయితే ఆమె రూoపొదించిన AI ఇక్కడే అక్కరకు వస్తుంది. సహజంగా కంటి ఎక్స్-రే చదవడానికి నిపుణులు కావాలి. కానీ AI Eyescan ద్వారా ఆ ఎక్స్-రే ను చదివి దానర్ధం ఏమిటో ఈ AI చెప్పేస్తుంది. ఎందుకంటే ఈ AI algorithms ఒక వైద్యుడి కంటే వేగంగా మరింత సూక్షమాతి సూక్ష్మంగా ఎక్స్-రే లను చదవడం వీటి ప్రత్యేకత. అందువల్ల ఆ స్కాన్ లో అంతర్లీనం గా ఉన్న జబ్బులను అంటే diabetic retinopathy, ARMD (age related macular degeneration) మొదలైన వాటిని ఇది బయట పెట్టగలదు అంటున్నారు Ursula.

ఆమె రూపొందించిన ఈ పరిజ్ఞ్యానం ఇప్పటికే యూరోప్ లో అన్ని అనుమతులు పొంది అందుబాటులోకి వచ్చింది. అంతే కాదు 5 ఆసుపత్రుల్లో ఈ AI Eyescan ను సైతం ఉపయోగిస్తున్నారు. ఈ పరిశోధనను Dec 8 Opthamology జర్నల్ లో ప్రచురించారు.

Courtesy