ప్రతిభ ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్య చదవ లేకపోతున్న అమ్మాయిల కోసం డీఆర్‌డీఓ స్కాలర్‌షిప్ అందిస్తోంది.
ఈ స్కీమ్ అమ్మాయిలకు మాత్రమే.ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ పొందొచ్చు.

దరఖాస్తు (Application) కి సంబంధిచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అర్హత (Qualification)

ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ మరియి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న అమ్మాయిలకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.

DRDO Scholarship Application

Application for DRDO girls scholarship

2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పీజీ అడ్మిషన్లు పొందిన అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్‌ స్కీమ్ వర్తిస్తుంది.

DRDO స్కాలర్షిప్ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు తేదీ ( Notification and application Date )

గతం లో ఈ స్కాలర్‌షిప్‌నకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది . దీనికి సంబంధించి దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసింది.

అయితే ప్రస్తుత శుభవార్త ఏంటంటే ,కరోనా వైరస్ సంక్షోభంతో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫలితాలు విడుదల చేయడంలో ఆలస్యమైనందున DRDO సంస్థ స్కాలర్షిప్ దరఖాస్తు తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దీనితో ఇదివరకు దరఖాస్తు చేసుకోలేక పోయిన వారికి ఇప్పుడు మరో అవకాశం లభించింది.

ఈ స్కాలర్షిప్ లో రెండు కేటగిరిలు .. గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్

బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలు అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు,ఎంటెక్, ఎంఈ, ఎంఎస్సీఫస్ట్ ఇయర్ విద్యార్థినులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

డిగ్రీ మరియు పీజీ లో ఈ బ్రాంచ్ విద్యార్థినులు దరఖాస్తు చేయడానికి అర్హులు

ఏరోనాటికల్ ఇంజనీరింగ్,రాకెట్రీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతూ ఉండాలి.

ఎంపిక విధానం (Selection process) మరియు దరఖాస్తు వెబ్సైటు వివరాలు

గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థులు కనీసం 60% మార్కులు మరియు JEE (Main) స్కోర్ ఆధారంగా అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌కు 20 మందిని ఎంపిక చేస్తారు.

DRDO

DRDO Selection

వారికి ప్రతీ ఏడాది రూ.1,20,000 వరకు నాలుగేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికీ ఏటా రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్‌షిప్ లభిస్తుంది.

విద్యార్థినులు డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌లో https://drdo.gov.in/ లో స్కాలర్‌షిప్ స్కీమ్ కి సంబధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) వెబ్‌సైట్ లో https://rac.gov.in/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మీరు కనుక ఈ అర్హతలు కలిగిఉంటే వెంటనే ఈ వెబ్సైట్ లో పూర్తి సమాచారాన్ని పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.మీకు తెల్సిన వాళ్లు ఎవరైనా ఈ స్కాలర్షిప్ కి అర్హులు అనిపిస్తే ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
విష్ యు ఆల్ ది బెస్ట్ (We wish you all the best ).