వైద్య(Medical), ఆరోగ్య శాఖ(Health Department)ల్లో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ నియామకాలు చేపట్టి చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టుల(2,588 Posts)ను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్(Medical and Health Commissioner) పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం పోస్టులు సృష్టించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్తగా సృష్టించిన పోస్టుల్లో డాక్టర్లు 485(Doctors), నర్సింగ్(Nursing) 60, ఫార్మసీ(Pharmacy) 78, పారామెడికల్ క్లాస్(Para Medical Class)-4 644, ల్యాబ్ టెక్నీషియన్(LAB Technician) 279, పోస్ట్ మార్టం అసిస్టెంట్(Postpartum Assistant) 39, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్(HA) 54, ఇతర పోస్టులు (Other Posts)949. . వీటిలో చాలా పోస్టులు డైరెక్ట్(Direct), పర్మినెంట్(Permanent), కాంట్రాక్ట్(Contract) మరియు ఔట్ సోర్సింగ్(Out Sourcing) ప్రక్రియ ద్వారా భర్తీ చేయబడతాయి, మరికొన్ని పోస్టులు పదోన్నతి పొందుతాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖల్లో 39 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టులను భర్తీ చేయగా మిగిలినవి ఈ నెల చివరిలోగా  పూర్తి చేస్తామన్నారు. అదే సమయంలో మరో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేయడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది.