ఉస్మానియా యూనివర్సిటీ(OU) పరిధిలో ఈ నెల 26 నుంచి పలు డిగ్రీ కోర్సుల(Degree Course) సెమిస్టర్‌ పరీక్షలు (Semister Exam) మొదలు కానున్నట్లు కంట్రోలర్‌(Controller) ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌(Professor SriNagesh) వెల్లడించారు. ఈ నెల 26న డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్‌ కోర్సుల 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు, 28న డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి.

కరోనా(Corona) కారణంగా గతంలో 2 గంటల వరకు కుదించిన టైంని, ఇక నుంచి డిగ్రీతో పాటు ఇతర కోర్సులకు సైతం పాత సమయాన్ని 3 గంటల(3Hours) వరకు పునరుద్ధరిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. .

ఓయూలో పరీక్షల వాయిదా పడ్డాయంటూ సోషల్‌ మీడియా(Social Media)లో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు.

ఇక పూర్తి టైం టేబుల్(Time Table) కోసం సంబంధించిన వివారాలు వెబ్సైటు లో చూడచ్చు