సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్‌-2 బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభంకానున్నాయి.10, 12 తరగతులకు రెండో విడత బోర్డు పరీక్షల(Board Exams)ను ఆఫ్‌లైన్‌(Off Line) విధానంలో నిర్వహించనున్నారు. టర్మ్‌-2(Term 2)లో ఆబ్జెక్టివ్(Objective), సబ్జెక్టివ్(Subjective) తరహా ప్రశ్నలుంటాయని సీబీఎస్‌ఈ పేర్కొంది.

పరీక్షల తేదీల వివరాలను త్వరలో వెబ్‌సైట్‌(Web Site)లో ఉంచుతామని తెలిపింది. టర్మ్‌-2 బోర్డు పరీక్షలకు సంబంధించిన మోడల్‌ పేపర్‌(Model Paper)ను గత నెలలోనే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సంగతి తెలిసిందే.

అయితే.. కరోనా(Corona) కారణంగా  10, 12 తరగతులకు బోర్డు పరీక్షల విధానాన్ని సీబీఎస్‌ఈ(CBSE) మొదటిసారి మార్చింది. ఈ విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని ముందుగానే వెల్లడించింది.

ఇందులో భాగంగా షెడ్యూల్‌(Schedule) ప్రకారం గత ఏడాది నవంబర్‌-డిసెంబర్‌(November-December) మధ్యలో టర్మ్ 1 బోర్డు పరీక్షలను నిర్వహించింది. టర్మ్-1 పేపర్లలో ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ తరహా ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. అయితే వీటి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. త్వరలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

మరో వైపు  తెలంగాణ ఇంటర్ బోర్డ్(Telangana Inter Board)  తాజాగా కీలక ప్రకటన వెల్లడించింది. ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్(Inter Exam Schedule) ను రిలీజ్ చేసింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్(Practical Exam) ను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఆదివారాల్లో సైతం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎథిక్స్(Ethics) అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (Environmental Education) ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఎగ్జామ్స్ ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

థియరీ ఎగ్జామ్స్(Theory Exam) ను ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే.. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. అదేవిధంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వివరాలు

ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ(Telangana)లో ఇంటర్ పరీక్షలు

ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్(Inter First Year) ఎగ్జామ్స్

ఏప్రిల్ 21 నుంచి మే5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్

ఏప్రిల్‌ 20,22,25,27,29 మే 2 వ తేదీలలో ఇంటర్ ప్రధమ సంవత్సర పరీక్షలు

ఏప్రిల్ 21,23,26,28,30,మే 5 వ తేదీలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర(Second Year) పరీక్షలు

ఏప్రిల్ 11 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్(Human Values), ఎన్విరాన్మెంటల్(Environmental) పరీక్ష

మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు(Practical Exam) జరగనున్నాయి.